బి.వి.రామానందం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
బి.వి.రామానందం (బయ్యపునీడి వెంకట రామానందం) తెలుగు సినిమా దర్శకుడు. ఇతను [[ఎస్.వి. రంగారావు|ఎస్.వి.రంగారావు]]<nowiki/>కు తెలుగు సినిమాకు పరిచయం చేసిన వ్యక్తిగా సుపరిచితుడు. అనేక మంది నటులను సినీ పరిశ్రమకు పరిచియం చేసిన ఇతనిని "ఆంధ్రా శాంతారాం" అని అభివర్ణించేవారు.
 
== జీవిత విశేషాలు ==
బయ్యపునీడి వెంకట రామానందం 1902 జనవరి 2న రాజమండ్రిలో జన్మించాడు. చిన్నతనంలో లలిత కళల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఒకపక్క విద్యాభ్యాసం చేస్తుందగానే మరో పక్క నాటకాలలో నటించేవాడు. బెనారస్ లో ఎఫ్.ఏ పరీక్ష ఉత్తీర్ణుడైన తరువాత ఆగస్టు 1922లో వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం ఏదైనా వ్యాపారం చేయాలనుకున్న సమయంలో మూకీల చిత్ర నిర్మాణం సాగుతుంది. చిన్నతనం నుండి కళా రంగంలో ఆసక్తి ఉండటంతో అతను సినిమా రంగంలోకి ప్రవేశించాడు. మొదట ఫిలిం పంపిణీ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాడు. దీని కోసం కలకత్తా వెళ్ళి కొన్ని నెలల పాటు అక్కడే ఉండి ఫిలిం పంపిణీ వ్యాపారం జరిగే తీరుని పరిశీలించి ఒక అవగాహనకు వచ్చాడు. రాజమండ్రికి వచ్చి "రాధాకృష్ణ ఫిలిం డిస్ట్రిభ్యూషన్" పేరుతో ప్యాపారం ప్రారంభించాడు. అదే సమయంలో కలకత్తా నుండి వచ్చిన [[సి. పుల్లయ్య]] రాజమండ్రిలో ఆంధ్రా సినీటోన్ స్టుడియోను స్వాధీనం చేసుకొని ఆంధ్రా టాకీస్ పతాకంపై శ్రీ సత్యనారాయణ చిత్ర నిర్మాణం ప్రారంభించాడు. వాడుక భాషలో రూపుదిద్దుకున్న తొలి చిత్రం ఇది. రామానందం పుల్లయ్య వద సహాయకునిగా చేరాడు. ఆ చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేసి అనుభవం సంపాదించుకున్నాడు.
 
== నిర్మాతగా ==
అతను చిత్ర నిర్మాణ రంగంలో ప్రవేశించాలనుకున్నాడు. అతను భారత లక్ష్మీ ఫిలిమ్స్ వారితో కలసి సక్కుబాయి సినిమాను నిర్మించాడు. అది 1935 మే 21న విడుదలైంది. ఈ చిత్రంలో 50 పాటలున్నాయి. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. తానే రాధా ఫిలిం కంపెనీ చిత్రనిర్మాణ సంస్థను నెలకొల్పి 1935లో భక్త కుచేల సినిమాను నిర్మించాడు. బళ్లారి పండిక్తులు సుబ్రహ్మణ్య శాస్త్రి రాసిన నాటకం ఆధారంగా నిర్మించిన ఈ సినిమాలో భారీ సెట్స్ వేసి చిత్రీకరించాడు. ఈ సినిమా విజయవంతమైంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బి.వి.రామానందం" నుండి వెలికితీశారు