పెళ్లి కూతురు (1970 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:విజయనిర్మల సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 47:
 
==సంక్షిప్త చిత్ర కథ==
ఆ పల్లెటూరికి గబ్బిలాల సుబ్బన్న మునసబు. అతడు ఆ ఊరికి తులసి వనంలో గంజాయి మొక్కలాంటి వాడు. అతడికి ఆడపిల్లలంటే మోజు. లక్ష్మిని పెళ్ళి చేసుకుందామనుకున్నాడు. కాని పార్వతికి ససేమిరా ఇష్టం ఉండదు. తల్లిలేని భూషయ్య కొడుకు సూర్యాన్ని పార్వతి చిన్నప్పటి నుండి కన్నతల్లిలా పెంచింది. పార్వతి కూతురు లక్ష్మి అంటే సూర్యానికి తీరని ప్రేమ అభిమానం. లక్ష్మికి మంచి వరుణ్ణి తెచ్చి పెళ్ళి చేస్తానని పార్వతికి మాట ఇస్తాడు. భద్రకాళి తన కొడుకు అంజికి లక్ష్మిని ఇచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుంది. భర్త పరమయ్య ఎంత నసుగుతున్నా పుట్టినరోజు పండగకి అందరినీ పిలుస్తుంది. కాంట్రాక్టర్ చలపతిరావు కొడుకు మధు ఆ గ్రామానికి వస్తాడు. వాళ్ళు కూడా దూరపు చుట్టమైన భద్రకాళి ఇంటికి పుట్టినరోజు పండగకి వస్తారు. మోహన్, లక్ష్మి ఒకర్నొకరు ఆకర్షించుకుంటారు. సూర్యం సంతోషిస్తాడు. మారువేషంలో వచ్చిన స్వాములవారిని తన భర్త అని పార్వతి గుర్తుపడుతుంది.
 
==పాటలు==