తుల్జాబాయి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Fixing double redirect to బైంసా పురపాలక సంఘం
ట్యాగులు: దారిమార్పు లక్ష్యాన్ని మార్చారు తిరగ్గొట్టారు
చి Bot: Fixing double redirect to బైంసా పురపాలకసంఘం
ట్యాగులు: దారిమార్పు లక్ష్యాన్ని మార్చారు తిరగ్గొట్టారు
పంక్తి 1:
#దారిమార్పు [[బైంసా పురపాలక సంఘంపురపాలకసంఘం]]
<!-- {{తొలగించు| "చర్చా పేజీ చూడండి"}}
మానవత్వాన్ని గెలిపించిన అమ్మ. ముష్కరులు నిప్పెట్టిన ఇంట్లోకి ధైర్యంతో ముందడుగువేసి ముస్లిం కుటుంబానికి రక్షణగా నిలిచిన హిందూ వృద్ధురాలు. ఆదిలాబాద్ జిల్లా భైంసా లో దుర్గామాత ఉత్సవాలు.. అందరూ సంతోషంగా, ఉత్సాహంగా చూస్తున్నారు. పంజేషా చౌక్ వద్దకు రాగానే ఏం జరిగిందో ఏమో! ఒక్కసారిగా రాళ్ల వర్షం మొదలైంది. అల్లరి మూకలు ఇళ్లపైబడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. తలుపులు పగులగొట్టి లోపలికి వస్తున్నాయి. జనమంతా భయభ్రాంతులయ్యారు. ముష్కరుల స్వైరవిహారాన్ని తలుపు సందుల్లోంచి చూస్తున్నారు. ఇంతలో తమకు తెలిసిన ఒక కుటుంబం.. తమ ఇంటి ఎదురుగానే అల్లరిమూకల కంట పడింది. దుండగులు ఆ ఇంటికి నిప్పుపెట్టారు. వారు మంటల్లో చిక్కుకొన్నారు. అందరూ ప్రాణాలు ఉగ్గబట్టి చూస్తున్నారు. రెండు వర్గాల మధ్య ఘర్షణల్లో తలదూర్చితే ఏమైనా జరిగే ముప్పు! దీనికి ఆ 65 ఏళ్ల మహిళ భయపడలేదు. మానవత్వంతో ముందుకు కదిలారు. తన కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపైకి వచ్చారు. తమతో కలిసి మెలిసి ఉండే ఆ ముస్లిం కుటుంబాన్ని అగ్నికీలల నుంచి రక్షించి తన ఇంటికి తెచ్చుకొని ఆశ్రయమిచ్చారు. ఆ హిందూ మహిళే '''తుల్జాబాయి'''. చాలా మంది అనుకొంటున్నట్టు భైంసా ప్రజలు రెండుగా విడిపోలేదు. అందుకు మానవత్వం తో తుల్జాబాయి చేసిన సాహసమే తాజా నిదర్శనం. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో భైంసాలో ఉన్నట్టుండి అల్లర్లు చెలరేగాయి. పంజేషా చౌక్ వద్ద మసీదు దాటిన తరువాత చిన్నపాటి కిరాణా దుకాణం ఉంది. అక్కడే తన కొడుకులు, కోడళ్లు, మనువళ్లు, మనుమరాళ్లతో తుల్జాబాయి ఉంటున్నారు. రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడం మొదలై అల్లరిమూకలు స్వైర విహారం చేస్తుంటే.. అక్కడి జనమంతా ఇళ్లల్లోకి వెళ్లి తలుపులు మూసుకొన్నారు. తుల్జాబాయి కుటుంబానిదీ అదే పరిస్థితి. కిటీకీ సందుల్లోంచి బయటకు భయంభయంగా చూస్తున్నారు. వారి ఇంటికి ఎదురుగా ఉండే సయ్యద్ ఉస్మాన్ ఇంట్లోకి అల్లరిమూకలు ప్రవేశించాయి. ఉస్మాన్ రిక్షా నడుపుకొంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సంఘటన సమయంలో ఆయన ఇంట్లో లేరు. దుకాణానికి వెళ్లారు. ఇంట్లో ఆయన భార్య నసీమా, నలుగురు పిల్లలు ఉన్నారు. ముష్కరులు ఆ ఇంటికి నిప్పుపెట్టారు. ఈ పరిణామంతో హతాశురాలైన తుల్జాబాయి హృదయం తల్లడిల్లిపోయింది. ఘోరం ఆపేందుకు వెంటనే తలుపులు తెరిచి కొడుకులు, మనుమలను తీసుకుని ఉస్మాన్ ఇంటిలోకి ప్రవేశించారు. తమ వెంట బిందెలతో తెచ్చిన నీళ్ళు మంటలపై చల్లి నసీమా, నలుగురు పిల్లలను తన ఇంటికి తీసుకొచ్చారు. పోలీసుల సాయంతో రాత్రి 7.30 అప్పుడు ఉస్మాన్ ఘటనాస్థలానికి చేరుకుని తన కుటుంబం గురించి ఆరాతీశారు. తుల్జాబాయి నివాసంలో సురక్షితంగా ఉందని తెలుసుకొని ఊపిరి పీల్చుకొన్నారు. జరిగిన సంఘటన నుంచి తేరుకోవడానికి కట్టుబట్టలతో బాధిత కుటుంబం బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. తుల్జాబాయి కి చంద్రబాబు ప్రశంస వర్గాల మధ్య ఘర్షణల్లో తుల్జాబాయి చూపిన తెగువను, మానవత్వాన్ని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ప్రశంసించినప్పుడు ఈ విషయం తెలిసింది. నాటి ఘటన కళ్ల ముందు కదలుతోందని ఆమె 'న్యూస్‌టుడే'తో పేర్కొన్నారు. అల్లరిమూకల చేతిలో కత్తులు, కటార్లున్నాయి. విచక్షణరహితంగా ప్రవరిస్తూ ఇళ్లకు నిప్పుపెట్టాయి. దుండగులు ఇక్కడి వారు కాదు. వారు బయటి నుంచి వచ్చినట్టుగానే ఉంది అని ఆమె తెలిపారు. ఎన్నో ఏళ్లుగా తామందరం కలిసిమెలిసి ఉంటున్నామని, తమ మధ్య చిచ్చు పెట్టడానికే ఘర్షణ లు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. మానవత్వాన్ని కాపాడిన అమ్మవు నీవు అంటూ [[గద్దర్]] తుల్జాబాయికి పాదాభివందనం చేశారు.
"https://te.wikipedia.org/wiki/తుల్జాబాయి" నుండి వెలికితీశారు