చందమామ: కూర్పుల మధ్య తేడాలు

ఇలియడ్ కి లింకు
ట్యాగు: 2017 source edit
పంక్తి 40:
[[దస్త్రం:Chandamama-Betala-kathalu.jpg|right|thumb|100px|బేతాళ కథల చిత్రం]]
 
ఇదొక చిత్రమైన కథల సంపుటి. ప్రతిమాసం ఒక సంఘటన (విక్రమార్కుడు చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని) తో మొదలయేది. అలాగే, మరొక సంఘటన (రాజుకు ఈవిధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు) తో అంతమయేది. ప్రతి కథనూ, విక్రమార్కుడు మోస్తున్న శవంలోని బేతాళుడు, విక్రమార్కుడికి "శ్రమ తెలియకుండా విను" అని చక్కగా చెప్పేవాడు. చివరకు, ఆ కథకు సంబంధించి చిక్కు ప్రశ్న (లు) వేసేవాడు.అలా ప్రశ్నలు వేసి, విక్రమార్కుడికి ఒక హెచ్చరిక చేసేవాడు "ఈ ప్రశ్న(ల)కు సమాధానం తెలిసీ చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది" అని. మౌనం వీడితే వ్రత భంగం అయ్యి, వచ్చిన పని చెడుతుంది, సమాధానం తెలిసీ చెప్పకపోతే ప్రాణానికే ప్రమాదం. పాపం విక్రమార్కుడు ఏం చేస్తాడు? తప్పనిసరి పరిస్థితిలో, తన మౌనం వీడి, ఆ చిక్కు ప్రశ్నకు చాలా వివరంగా జవాబు చెప్పేవాడు. ఈ విధంగా ప్రతినెలా శవంలోకి బేతాళుడు ప్రవేశించి కథచెప్పి, ప్రశ్నలడిగి, హెచ్చరించి, విక్రమార్కుడికి మౌనభంగం చేసి, అతను వచ్చిన పని కాకుండా చేసేవాడు. అలా పై నెలకి కథ మొదటికి వచ్చేది. అసలు బేతాళ కథలు పాతిక మాత్రమేనని తెలిసినవారు చెబుతారు. చందమామలో వందల కొలది మామూలు కథలను బేతాళ కథలుగా ఎంతో నేర్పుతో (గా) మార్చి ప్రచురించారు. సాధారణమైన పిల్లల కథల్లోంచి, కథ చివర, ప్రతినెలా, ఒక చిక్కు ప్రశ్నను సృష్టించడం, దానికి చక్కటి సమాధానం చెప్పించడం, సామాన్య విషయం కాదు. అతి కష్టమైన ఈ పనిని, దశాబ్దాలపాటు నిరాఘాటంగా కొనసాగించడం చందమామ నిబద్ధతకు, నైపుణ్యానికి, చక్కటి నిదర్శనం. మొదటి బేతాళ కథ ఎలా ఉంటుందో అన్న పాఠకుల ఆసక్తిని గమనించిగాబోలు, చందమామ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూలై, 1972లో మొదటి బేతాళ కథను రంగుల్లో పునర్ముద్రించారు. మరి కొన్ని పిల్లల పత్రికలు [[బొమ్మరిల్లు (పత్రిక)|బొమ్మరిల్లు]] వంటివి ఇదేపద్ధతిలో కథలను (కరాళ కథలు) సృష్టించడానికి ప్రయత్నించాయి గాని, అంతగా విజయం సాధించలేదని చెప్పవచ్చు.
 
== '''చందమామలో జానపద కథలు''' ==
"https://te.wikipedia.org/wiki/చందమామ" నుండి వెలికితీశారు