వసుంధర (రచయిత): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), గా → గా (3), తో → తో (2), , → , using AWB
చి →‎top
పంక్తి 1:
'''[[జొన్నలగడ్డ రాజగోపాలరావు]] - రామలక్ష్మి దంపతులు''' [[వసుంధర]] కలం పేరుతో వ్రాస్తున్న జంట రచయితలు. రాజగోపాలరావు రసాయన శాస్త్రవేత్తగా పనిచేసి రిటైరయ్యాడు. వసుంధరతో బాటు [[బాబి]], [[కమల]], [[సైరంధ్రి]], [[రాజా]], [[రాజకుమారి]], [[శ్రీరామకమల్]], [[యశస్వి]], [[కైవల్య]], [[మనోహర్]] వారి కలం పేర్లు.
 
వీరు ఒక్క [[చందమామ]] లోనే వెయ్యికి పైగా కథలు వ్రాశారు. వాటిలో కథల ప్రయోజనం, అపకారికి ఉపకారం, మొదలైనవి సుప్రసిద్ధం. వీరి కథల్లో పిల్లలకు విలువైన సందేశం గానీ, అద్వితీయమైన చమత్కారం గానీ తప్పనిసరిగా ఉంటాయి. [[బొమ్మరిల్లు (పత్రిక)|బొమ్మరిల్లులో]]లో నూరుకట్ల పిశాచం కథలు, మరికొన్ని ఇతర కథలు వ్రాయడంతోబాటు లోకజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు-జవాబులు, ఈ శతాబ్దపు చివరి దశాబ్దం లాంటి ఇతర శీర్షికలు కూడా చాలాకాలం నిర్వహించారు. రామలక్ష్మి ఆ పత్రికకు పేరులేని సంపాదకురాలిగా పనిచేసింది. ఆమె వసుంధరలో భాగస్వామిగానే కాకుండా విడిగా కూడా చాలా కథలు, నవలలు వ్రాసింది.
 
ఇక పెద్దలకోసం వారు వ్రాసిన కథలను, నవలలను ప్రచురించని పత్రికలు తెలుగులో దాదాపుగా లేవనే చెప్పవచ్చు. ఈ కథలు ఇంకో వెయ్యిదాకా ఉంటాయి. వాటిలో "ఒక్క [[అపన]]లోనే రెండొందలుంటాయి." (అపన: అపరాధపరిశోధన అనే పేరుగల పత్రిక) ఈ కథల్లోనుంచి ఎంపిక చేసిన కొన్ని కథలు రెండు సంపుటాలుగా వచ్చాయి: రసికరాజతగువారముకామా?, చిరునవ్వు వెల ఎంత? (హాస్యకథల సంపుటి) వీటిలోని కొన్ని కథలు చదివితే 'ఇలాంటి విశేషాలు అందరి జీవితాల్లోనూ ఉంటాయి. వాటిని కథలుగా మలచగల దృష్టి ఉండాలేగానీ ఎవరైనా కథలు రాయొచ్చు' అనే ధైర్యమొస్తుంది. (నిజంగా వీరు చాలామందిని కథలు వ్రాయమని ప్రోత్సహించారు, కొందరిని వేధించారు కూడా: తీరుబాటు అనే కథలో ఆ విషయం వివరిస్తారు. కానీ అధిక శాతం కథలు పాఠకులను అబ్బురపరుస్తాయి.
"https://te.wikipedia.org/wiki/వసుంధర_(రచయిత)" నుండి వెలికితీశారు