కలువకొలను సదానంద: కూర్పుల మధ్య తేడాలు

Dead link
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 41:
 
==రచయితగా==
సదానంద మొదటి రచన తన 18 ఏటనే ప్రచురితమైంది. [[చందమామ]], [[బాలమిత్ర]], [[బాలజ్యోతి]], బాలరంజని, [[బొమ్మరిల్లు (పత్రిక)|బొమ్మరిల్లు]], [[బాలభారతి]], బుజ్జాయిలాంటి బాలల మాస పత్రికలలో, [[ఆంధ్రప్రభ]], [[ఆంధ్రపత్రిక]], [[ఆంధ్రభూమి]] వంటి వార, మాస పత్రికలలోని పిల్లల శీర్షికలలో వీరి రచనలు ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం [[ఈనాడు]] దినపత్రిక ‘హాయ్‌బుజ్జి’ పేజీలో వీరికథలు ఎక్కువగా మనం గమనించవచ్చు.
 
సదానంద బాలలకోసం ఇప్పటి వరకు 200కు పైగా కథలు, 2 నవలలు, 100 కి పైగా గేయాలు, కొన్ని గేయకథలు రాశారు. 8 కథా సంపుటాలు, 2 నవలలు ప్రచురించారు. తన 25 సంలో రాసిన పిల్లలనవల బాల రంజనిలో సీరియల్‌గా వచ్చింది. 1964లో మొదటి కథా సంపుటి ‘సాంబయ్య గుర్రం’ ప్రచురితమైంది. అదే సంవత్సరం ‘చల్లనితల్లి’, 1966లో నీతికథామంజరి, 1967లో విందుభోజనం, 1983లో [[శివానందలహరి]] ఇలా... మొత్తం 8 కథా సంపుటాలు ప్రచురించారు. 1965లో బాలల కోసం ‘బంగారు నడిచినబాట’ నవల ప్రచురించారు. ఈ నవలకు 1966లో ఉత్తమ బాల సాహిత్య గ్రంధంగా కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ వారి అవార్డు లభించింది. వీరి "నవ్వే పెదవులు - ఏడ్చేకళ్ళు" కథా సంపుటానికి 1976లో [[ఆంధ్రప్రదేశ్]] సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. [[తెలుగు]] కథాసాహిత్యంలో వంద ఆణిమ్యుత్యాలు పేరుతో వెలువడిన కథా సంకలనంలో వీరి కథ "తాత దిగిపోయిన బండి"కి స్థానం లభించింది. త్వరలో వీరి "పరాగభూమి కథలు" గ్రంథం వెలువడనుంది<ref>[http://epaper.andhrajyothy.com/detailednews?box=aHR0cDovL2VjZG4uYW5kaHJhanlvdGh5LmNvbS9GaWxlcy8yMDE2MDIyMTAyMjEwMzA0MTg1MTEuanBn&day=20160221 కథల కొలను - కలువకొలను - పలమనేరు బాలాజీ - [[ఆంధ్రజ్యోతి]] దినపత్రిక - 22 ఫిబ్రవరి, 2016]{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
"https://te.wikipedia.org/wiki/కలువకొలను_సదానంద" నుండి వెలికితీశారు