"ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం" కూర్పుల మధ్య తేడాలు

టెలివిజన్ వ్యాఖ్యాత చేర్పు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8)
(టెలివిజన్ వ్యాఖ్యాత చేర్పు)
ట్యాగు: 2017 source edit
| weight =
}}
'''ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం''' (1946 జూన్ 4 - 2020 సెప్టెంబరు 25) నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడాడు. అతడి పూర్తి పేరు '''శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.''' అతన్ని ఎస్పీబీ అని కూడా పిలవడం కద్దు. అభిమానులు ఆయనను ముద్దుగా '''బాలు''' అని పిలుస్తారు. 1966 లో పద్మనాభం నిర్మించిన [[శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న]] చిత్రంతో సినీ గాయకుడిగా అతని ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవాడు.
 
1969 లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన ఈయన తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించాడు. తర్వాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించాడు. [[ప్రేమ (1989 సినిమా)|ప్రేమ]] (1989), [[ప్రేమికుడు]] (1994), [[పవిత్ర బంధం (1996 సినిమా)|పవిత్రబంధం]] (1996), [[ఆరో ప్రాణం]] (1997), [[రక్షకుడు]] (1997), [[దీర్ఘ సుమంగళీ భవ]] (1998) మొదలైనవి ఆయన నటించిన కొన్ని సినిమాలు. బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేకమంది కళాకారులకు గాత్రదానం చేశాడు. [[కమల్ హాసన్]], [[రజినీకాంత్|రజనీకాంత్]], [[సల్మాన్ ఖాన్]], [[విష్ణువర్ధన్(నటుడు)|విష్ణువర్ధన్]], [[జెమినీ గణేశన్|జెమిని గణేశన్]], [[గిరీష్ కర్నాడ్]], [[అర్జున్ సర్జా|అర్జున్]], [[నగేష్]], [[రఘువరన్]] లాంటి వాళ్ళకి గాత్రదానం చేసాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3206421" నుండి వెలికితీశారు