ఆది శంకరాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
వ్యాసములో మూలము జత చేయడం
పంక్తి 75:
 
===బాల్యము===
శంకరుల బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి, శాస్త్రోక్తంగా [[ఉపనయనం]] జరిపించింది. శంకరులు [[ఏకసంథాగ్రాహి]]. బాల్యంలోనే [[చతుర్వేదాలు|వేదవిద్యలు]], [[సంస్కృతం]] అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా శంకరులు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకొన్న [[ఉసిరి]] కాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు, ఆశువుగా [[కనకధారా స్తోత్రం|కనకధారా స్తోత్రాన్ని]] చెప్పారు. కనకధారా స్తోత్రంతో పులకించిన [[లక్ష్మి|లక్ష్మీ దేవి]] బంగారు ఉసిరికాయలు వర్షింపజేసింది .
 
ఒకరోజు శంకరుల తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహతప్పి పడిపోయింది. అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు.
"https://te.wikipedia.org/wiki/ఆది_శంకరాచార్యులు" నుండి వెలికితీశారు