ఆలంపూర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 89:
 
== విశేషాలు , చారిత్రక, పర్యాటక ప్రదేశాలు==
ఇది ఒక చారిత్రక ప్రాధాన్యం గల ప్రదేశం.ఇక్కడ ఏడవ శతాబ్దానికి చెందిన ప్రాచీన నవబ్రహ్మ ఆలయం ఉంది. [[భారతదేశం]]లోని 18 శక్తిపీఠాలలో ఇది ఒకటి.<ref>నా దక్షిణ భారత యాత్రావిశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 245</ref> ఇది [[హైదరాబాదు]] నకు సుమారుగా రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది [[శ్రీశైలంశ్రీశైల క్షేత్రం|శ్రీశైలానికి]] పశ్చిమ ద్వారంగా భావింపబడింది. ([[సిద్ధవటం]], [[త్రిపురాంతకము|త్రిపురాంతకం]], [[ఉమామహేశ్వరం]]లు [[దక్షిణం|దక్షిణ]], [[తూర్పు]], [[ఉత్తర]] ద్వారాలుగా భావింపబడినాయి). [[తుంగభద్ర]], [[కృష్ణా నది|కృష్ణా]] నదులు అలంపూర్ కు దగ్గరలో కలుస్తాయి. ఇక్కడి తొమ్మిది నవ బ్రహ్మ దేవాలయములు కూడా శివాలయాలే
 
అలంపురం సమీపంలో కృష్ణ, తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని [[దక్షిణకాశి|దక్షిణకాశీ]]గా అభివర్ణిస్తూ ఉంటారు. అలనాటి [[ఆంధ్ర రాష్ట్రం|ఆంధ్ర రాష్ట్ర]] రాజధాని [[కర్నూలు]]కు 27 కిలో మీటర్ల దూరంలో ఉంది. [[మహబూబ్‌నగర్‌]]కి 90 కిలోమీటర్ల దూరంలోనూ, [[హైదరాబాద్‌]]కి 200 కిలో మీటర్ల దూరంలోనూ నెలకొని ఉన్న అలంపురం అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవది. అలాగే, ఈ క్షేత్రంలో నవ బ్రహ్మలు కొలువై ఉన్నారు. క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో బాదామీ చాళుక్యులు ఈ ఆలయాలను నిర్మించారు. అలంపూర్ చుట్టూ నల్లమల అడవులు వ్యాపించి ఉన్నాయి. [[తుంగభద్ర]] నది ఎడమ గట్టున అలంపూర్ ఆలయం ఉంది. శాతవాహన, బాదామీ చాళుక్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాధిపతులు, గోల్కొండకి చెందిన కుతుబ్‌ షాహీ ల కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందింది. అలంపురాన్ని పూర్వం హలంపురంగానూ, హటాంపురంగానూ వ్యవహరించేవారని క్రీస్తు శకం 1101 సంవత్సరం నాటి శాసనం తెలియజేస్తోంది. ఈ శాసనం పశ్చిమ చాళుక్య రాజు త్రిభువనమల్ల విక్రమాదిత్య-4 కాలం నాటిది. జోగులాంబ, బ్రహ్మేశ్వరస్వామి వార్ల ఆలయాలు చారిత్రక ప్రసిద్ధి చెందినవి.
"https://te.wikipedia.org/wiki/ఆలంపూర్" నుండి వెలికితీశారు