పాబ్లో పికాసో: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 22:
}}<br />[[File:Picasso Signatur-DuMont 1977.svg|250px|right|Signatur Pablo Picasso]]
పాబ్లో పికాసో స్పానిష్ శిల్పి, చిత్రకారుడు. చిత్రలేఖనంలో క్యూబిజం (cubism)ను ప్రోత్సహించిన కళాకారుడు. ఇతడు [[1881]]లో జన్మించాడు. 20వ శతాబ్ధంలో వచ్చిన చిత్రకారులలో అత్యంత ప్రసిద్ధి చెందిన వాడు . అతని పరిశోధక మేధస్సు చిత్రకళలో అనేక శైలులను, మాధ్యమాలను అనుసరించినది. పికాసో చిత్రించిన చిత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందినవి:
 
===జీవిత విశేషములు===
పికాసో స్పెయిన్ దేశంలో మలగాలో 1881లో అక్టోబరు 23వ తేదీన జన్మించాడు.తండ్రి డ్రాయింగు టీచరు.పికాసో తన ఎనిమిదవ యేటనే వర్ణచిత్రరచన ఆరంభించాడు.అతని చిత్రాల "వన్ మాన్స్ ఎగ్జిబిషన్" అతను 14ఏళ్ళ బాలుడిగా ఉన్నప్పుడే జరిగింది.1903లో పికాసో కళాకారులందరికి అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ యాత్రాస్థలమైన ప్యారిస్ వెళ్ళాడు.ప్యారిస్ నగరం ఆయన కళను పెంచి పోషించింది.అక్కడే స్థిరపడ్డాడు.నవ్యకళారూపాలతో ప్రయోగాలు చేస్తూ అమేయమైన సృజనాత్మక కృషితో జీవితం గడిపాడు.ప్యారిస్లో ఆయన కళాజీవితంలో ప్రధానంగా రంగులవాడకాన్ని బట్టి మూడు దశలున్నాయని కళా విమర్సకులు చెబుతారు.తొలినాటిది బ్లూ పీరియడ్-అంటే నీలందశ.రెండవది పిక పీరియడ్ అనగా పాటల వర్ణం దశ. మూడవది నీగ్రో దశ. 1902 నుంచి 1905 వరకూ నీలం దశ రకరకాల నీలవర్ణఛ్ఛాయలతో ఆయన చిత్ర రచన చేసిన ఈ దశలో '''జీవితం''' అనే చిత్రం గొప్పది.ఈ దశలో భిన్నుడై ఆకలినీ, దారిద్రాన్ని సూచించే బిచ్చగాళ్ళను, వికలాంగులను మానవ అస్తిత్వంలోని వ్యాకులమునూ,విషాదాన్ని ప్రధానంగా చిత్రీకరించాడు. 1905 నుంచీ పికాసో పాటల వర్ణపుఛాయలలో చిత్రాలు వేశాడు.ఈ దశలో '''అలంకరణ''' చిత్రం ఎన్నదగినది.క్రమేణా చిత్రకారుడిగా ఖ్యాతి, పెద్దలు, రచయితలు, కళాఖండాల విక్రేతల ప్రాపకం సంపాదించాడు.1907లో నీగ్రోదశ మొదలైంది.అప్పుడు అతని చిత్ర రచనపై స్పానిష్, నీగ్రో శిల్పం ప్రాభావం పడింది. ఈ దశలోనే కళాప్రపంచంలో ఆయన ఒక గొప్ప విప్లవం తీసుకొచ్చాడు.అంతవరకూ పాశ్చాత్య చిత్రకారులు కళారంగంలో సాంప్రదాయకమైన సహజవాదమును అనుసరిస్తూ ఉండేవారు. పికాసో ఆఫ్రికన్ చెక్కడాల వనితనుంచే ప్రభావితుడై ఒక అపూర్వ సంచలనం కలిగించాడు.
 
ఆధునిక చిత్రకళకు పికాసో ప్రధానంగా చేకూర్చిన విశిష్టత కళలో '''క్యూబిజం''' విధానాన్ని వ్యాప్తం చేయడం. వాస్తవానికి క్యూబిజాన్ని ప్రారంభించిన వాడు పాల్ సెజానె (Paul Cézanne). కానీ ఆవిధానాన్ని కళారంగంలో ఒక కొత్తరీతిగా, ప్రపంచ వ్యాప్తంగా మేధావుల ఉద్యమంగా పెంపొందించినవారు జార్జ్ బ్రాక్ (Georges Braque), పికాసో. కంటికి కనిపించే వస్తువులను రేఖా గణిత సంబంధమైన ప్రక్రియల ద్వారా చిత్రించి చూపడం. ఈ విధమైన చిత్రాల వల్ల రూపవక్రీకరణ జరుగుతుంది.చూచేవారికి కొంత ప్రతిబంధకమూ ఏర్పడుతుంది. క్యూబిజంకు పికాసో ఇచ్చిన నిర్వచనం ఇది "నేను ఒక కప్పును వేయాలనుకున్నప్పుడు దానిని గుడ్రంగానే చూపుతాను.కాని వర్ణ చిత్రంలో మొత్తంపై కనిపించే లయ-అంటే నిర్మాణ లక్షణం నన్ను గుడ్రదనాన్ని చతురస్రంగా చూపమని ఒత్తిడి చేస్తుంది." అని అంటాడు.ఇది ఆయన తన 80వయేట అన్నమాట. పరిశ్రమలు వ్యాప్తిచెంది ఎన్నోరకాల యంత్రాలు రావడంతో మానవుడు మరుగుజ్జు అయిపోయి, వ్యక్తిత్వం కోల్ఫోయినాడు. ఆస్థితిని ఈపద్దతి వర్ణనాత్మకముగా ధ్వనిప్రాయంగా చిత్రించింది.
 
*సగం ఎద్దు, సగం మనిషిగా కనిపించే, గ్రీకు పురాణాలలోని మినోటార్ (గ్రీకుల పౌరాణికరాక్షసుడు) పికాసోను జీవితంలో చివరివరకు ఆకర్షించాడు.పికాసో ఆరాక్షసుణ్ణి క్రౌరయానికి, అంధకారానికీ ప్రతీకగా గ్రహించాడు.మానవునిలోను పాశవిక ప్రవృత్తికి అది చిహ్నం. దానిని '''గెర్నికా''' చిత్రంలో వాడుకున్నాడు.దీనిని పికాసో 1937లో వేశాడు.స్పెయిన్ లో అంతర్యుద్ధం జరిగుతున్న కాలంలో ఆదేశంలోని గెర్నికా అనేపట్టణంపై జర్మన్ ఫాసిస్ట్ లు బాంబులు వేయగా ఆమారణహోమంలో అసువులు బాసిన నిస్సహాయులైన ప్రజల స్థితికి పికాసో ఈచిత్రం వేశాడు.ఈ చిత్రం కొన్ను దశాబ్దాలపాటు న్యూయార్క్ లోని మోడర్న్ ఆర్ట్ మ్యూజియంలో ప్రవాసం ఉండినది.[[1937]] ఏప్రియల్లో ప్రాంకో, జర్మన్ మిత్రపక్షాల పురాతన గుయోర్నికో రాజధాని [[బాస్క్]] ను బాంబులతో నేలమట్టం చేసిన సంఘటనకు ప్రతిస్పందిస్తూ పికాసో వేసిన చిత్రం- [[గుయెర్నికా (చిత్రం)|గుయెర్నికా]](Guernica) ఓ గొప్పకళాఖండం. దీనిలో ఎద్దులను కిరాతక సైనికులకు, దౌర్జన్యానికి చిహ్నంగా, గుర్రాలను ఎదురు తిరిగిన ప్రజానీకానికి, సాత్వికత్వానికి చిహ్నంగా పికాసో చిత్రించాడు. ఈ చిత్ర ఇతివృత్తం ఎద్దుల కుమ్ములాట, అమాయకుల ఊచకోతగా అభివర్ణించి, ఈ చిత్రాన్ని చిత్రించి ప్రపంచానికి అందించాడు పికాసో.
 
కొన్ని వేల కాన్వాసులను చిత్రంచాడు.తన 85వయేట కూడా రాత్రి భోజనం చేసి నడిరేయి దాటే వరకూ చిత్రాలు గీస్తూ ఉండేవాడట.88 ఏండ్ల వయస్సులో 185 వర్ణ చిత్రాలు, 45 డ్రాయింగులు వేశాడని చెబుతారు.93 ఏళ్ళు జీవించి, జీవించి ఉండగానే పురాణ పురుషుడుగా లోకంచే కీర్తించబడి 1973లో పికాసో కాలధర్మం చేశాడు.
 
 
* [[1901]] లో చిత్రించిన "తల్లిప్రేమ'.
 
* [[1937]] ఏప్రియల్లో ప్రాంకో, జర్మన్ మిత్రపక్షాల పురాతన గుయోర్నికో రాజధాని [[బాస్క్]] ను బాంబులతో నేలమట్టం చేసిన సంఘటనకు ప్రతిస్పందిస్తూ పికాసో వేసిన చిత్రం- [[గుయెర్నికా (చిత్రం)|గుయెర్నికా]](Guernica) ఓ గొప్పకళాఖండం. దీనిలో ఎద్దులను కిరాతక సైనికులకు, దౌర్జన్యానికి చిహ్నంగా, గుర్రాలను ఎదురు తిరిగిన ప్రజానీకానికి, సాత్వికత్వానికి చిహ్నంగా పికాసో చిత్రించాడు. ఈ చిత్ర ఇతివృత్తం ఎద్దుల కుమ్ములాట, అమాయకుల ఊచకోతగా అభివర్ణించి, ఈ చిత్రాన్ని చిత్రించి ప్రపంచానికి అందించాడు పికాసో.
* లే డెమొసెల్లిస్ డి అవినాన్(Les Demoiselles d" Avignon) కూడా గొప్ప కళాఖండమే.
* [[1962]] లో అతడు [[లెనిన్ శాంతి బహుమతి]]ని అందుకొన్నాడు.
 
పికాసో [[1973]]లో మరణించాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పాబ్లో_పికాసో" నుండి వెలికితీశారు