నిడదవోలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి →‎చరిత్ర: AWB తో అయోమయ నివృత్తి లింకుల సవరణ
పంక్తి 21:
ఇంకా ప్రాచీన చాళుక్య శిల్పం గల మరో పెద్ద నంది విగ్రహం గొల్లవీధిలో త్రవ్వకాలలో లభించింది. సోమేశ్వర ఆలయంలో ప్రతిష్ఠింపబడింది. నిడదవోలు చారిత్రక ఘనతను చాటడానికి ఈ విగ్రహాలు ఒక్కటే చాలు. కుల, మత రహితంగా ప్రజలు ఎదురు నిల్చి నందీశ్వరుని విగ్రహన్ని మ్యూజియానికి తరలించకుండా ఆలయంలో ప్రతిష్ఠించారు.
[[బొమ్మ:Venkateswara swami devalayam ndd.JPG|right|thumb|250px|చిన కాశీ రేవు మీద ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయం]]
ఈ నిరవద్యపురంలో మహాదేవేశ్వరాలయం ఉండేదని అనేక శాసనాల వలన తెలుస్తోంది. ఈఆలయానికి సంబంధించిన వివరాలు [[పాలకొల్లు]], [[పెనుగొండ (ప.గో)|పెనుగొండ]] ఆలయాలలో ఉన్నాయి. బహూశా ఆ మహాదేవేశ్వర ఆలయ ప్రాంగణమే జూనియర్ కళాశాల ఆవరణ కావచ్చునేమో. ఆస్వామివారి లింగమే 200 సం క్రితం గోవు కారణంగా బయటపడిన శ్రీ గోలింగేశ్వర స్వామి కావచ్చునని ఆ స్వామిని 7 తరాలుగా సేవిస్తున్న అర్చిక స్వాములైన శ్రీ కాకుళపు వారి కుటుంబాల విశ్వాసం. అందుకే ఆ మహాదేవేశ్వరుని నందీశ్వర విగ్రహం ఇక్కడకు చేరిందని నమ్మకం.
నిరవద్యపుర జలదుర్గం చుట్టూ ఎర్రకాలువ, భీమదొర కాలువ, రాళ్ళమడుగు, తాడిమళ్ళ ఆవ, ఉత్తరంగా గోదావరి మధ్యన ఇది నిర్మించబడింది. నీటిలో అతి బలమైనది మొసలి. తాము జల దుర్గ రక్షణలో నున్న మొసలి వంటి బలవంతులమని చాటడానికే తూర్పు చాళుక్యురాజులు "మకరధ్వజులు"గా తమ జండాపై మొసలి గుర్తును కల్గియున్నారు. కనుక వీరికి ఆది నిరవద్యపురమేనని తోస్తోంది. నగరం చుట్టూ దండ నాయకుల పేర్లతో గ్రామాలు కనిపిస్తాయి. ఉదా:ద్రోణంరాజుముప్పవరుడు, సింగవరుడు, గోపవరుడు, తిమ్మరాజు, సమిశ్రుడు. చావుకొలనే "[[చాగల్లు]]" శిక్షలు విధించు స్థలము. పూర్వపు విజయనగరం వలె, వీధుల విభజన, వివిధ వర్ణముల వారు నివసించే వరుసలు, ఈ జలదుర్గమునకు ద్వారమే [[దారవరం]] అక్కడ"రాళ్ళమడుగు" దాటితే ఓడపల్లె వాడపల్లె అక్కడ గోదావరి దాటిన రాజమండ్రి, ఇదీ పూర్వపు నిరవద్యపుర ప్రాంతం అయి ఉండవచ్చునని తెలుస్తోంది.విధ్వంసమునకు గురి కాబడిన చాళ్యుక్య పుణ్యక్షేత్రమైన ఈ నగరంలో తలలు తెగిన నంది విగ్రహాలు, లింగాలు, మహిషాసుర మర్ధని విగ్రహాలు మరెన్నో దొరుకుతూనే ఉన్నాయి. ఇవన్నీ నిడదవోలు ప్రాచీనతకు చిహ్నాలు.1953 లో [[అవతార్ మెహెర్ బాబా]] వారి పాద స్పర్శచే ఈ గడ్డ మరలా పునీతం కాబడి అన్ని మతముల వారికి నిలయం అయింది. నిరవద్యపురమునకు నిరవద్యప్రోలు- నిడుదవోలు- నిడదవోలు రూపాంతరం మాత్రమే. అయితే ప్రాచీన పూర్వ చరిత్ర యిచ్చే ఘనకీర్తి భావితారలకు సంస్కృతి సంప్రదాయాలను, సాంఘిక- ఆర్థిక పరిస్థితులను, ప్రజల జీవన విధానములను తెలియజేస్తుంది. దేశంలోని మహానగరాలే తమ అసలు పేర్లను ఏర్పరచుకొని మార్పు తెచ్చుకుంటుంటే ఈ ప్రాచీన చారిత్రక ప్రసిద్ధిగల భారతీయనగరం ఇంకా సజీవంగా జీవిస్తూ ఉందని తన ఉనికిని లోకానికి చాటడానికైనా తన అసలు పేరును పొందవలసిన ఆవశ్యకత ఉంది. స్కాందపురాణం "నిరవిద్యపురంబున మహాదేవేశ్వరుడు" అని చెపుతోంది. దీనిని బట్టి కూడా మనం నిరవిద్యపురం ప్రాచీనతను అంచనా వేయవచ్చు.
 
"https://te.wikipedia.org/wiki/నిడదవోలు" నుండి వెలికితీశారు