త్రిజట: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''త్రిజట''' విభీషణుని కూతురు. రామాయణంలో రావణుడు సీతన...
 
సుందరకాండ భాగం
పంక్తి 1:
'''త్రిజట''' [[విభీషణుడు|విభీషణుని]] కూతురు. రామాయణంలో రావణుడు సీతను ఎత్తుకొని పోయి లంకలో బంధించి ఈమెను కావలి వుంచెను. ఈమెకు [[శ్రీరాముడు]] సముద్రము దాటివచ్చినట్లు, రావణుడు యుద్ధంలో చనిపోయినట్లు [[కల]] వచ్చెను. తన స్వప్న వృత్తాంతాన్ని సీతకు తెలియజేసి ధైర్యం చెబుతుండేది.
[[సుందర కాండ]]లో త్రిజట స్వప్నం గురించి వృత్తాంతం ఉన్నది.
 
 
కామాతురుడైన రావణుడు వచ్చి సీతను బెదరించి, తనకు వశముకావలెనని ఆదేశించాడు. సీత ఒక గడ్డిపరకను అడ్డముగా పెట్టుకొని, రావణుని ధర్మహీనతను, భీరత్వాన్ని నిందించింది. పోగాలము దాపురించినందువల్లనే ఈ నీచ సంకల్పము అతనికి కలిగిందని హెచ్చరించింది. ఒక నెల మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నించ సాగారు. రావణునికి వశం కాకపోతే ఆమెను తినేస్తామని బెదరించారు. భయ విహ్వలయై, ఆశను కోల్పోయిన సీత ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకొన్నది.
 
 
సహృదయయైన [[త్రిజట]] అనే రాక్షసకాంత మిగిలిన రాక్షస స్త్రీలను గద్దించి, సీతవంటి పుణ్య స్త్రీకి హాని చేయడం రాక్షస జాతికి వినాశకరమని హెచ్చరించింది. తనకు వచ్చిన కలలో ఇలా జరిగిందని చెప్పింది -
 
"వేయి హంసలు పూన్చిన తెల్లని ఏనుగుదంతపు పల్లకీలో రామలక్ష్మణులు లంకకు వచ్చారు. తెల్లని పర్వతాగ్రంపై సీత ఆసీనయై ఉంది. ఆమె సూర్య చంద్రులను స్పృశించింది. నాలుగు దంతాలు కలిగిన తెల్లని ఏనుగు నెక్కి, రాముని ఒడిలో సీత యున్నది. సీతారామలక్ష్మణులు అధివసించిన భద్రగజం ఆకాశంలో లంకపైభాగాన నిలిచింది. ఎనిమిది వృషభములు పూన్చిన రథంపై రాముడు తెల్లని వస్త్రాలతో, సీతా లక్ష్మణులతో లంకలో కనిపించాడు. తరువాత వారంతా పుష్పకం ఎక్కి ఉత్తర దిశగా వెళ్ళారు.
 
"ఎర్రని వస్త్రములు ధరించి, తైలము పూసుకొని రావణుడు మత్తిల్లి పుష్పకంనుండి క్రింద పడ్డాడు. గాడిదలు పూన్చిన రధంలో ఉన్నాడు. అతని మెడలో త్రాడు కట్టి, నల్లని వస్త్రములు ధరించిన ఒక స్త్రీ దక్షిణానికి లాగుచుండెను. అతడు దుర్గంధ నరక కూపంలో పడిపోయాడు. రావణుడు పందినెక్కి, కుంభకర్ణుడు పెద్ద ఒంటెనెక్కి, ఇంద్రజిత్తు మొసలినెక్కి దక్షిణ దిశగా పోయారు. విభీషణుడు మాత్రం తెల్లని గొడుగుతో, దివ్యాభరణాలతో, తెల్లని గజం అధిరోహించి, మంత్రులతో కూడి [[ఆకాశం]]లో ఉన్నాడు. లంకా నగరం ధ్వంసమై సముద్రంలో కూలింది. రాక్షస స్త్రీలంతా తైలము ద్రావుచు, పిచ్చివారివలె లంకలో గంతులు వేయుచున్నారు."
 
 
 
ఇలా చెప్పి త్రిజట తమను ఆపదనుండి కాపాడమని సీతాదేవిని వేడుకొనమని తక్కిన రాక్షస కాంతలకు హితవు పలికింది. భయంకరమైన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు.
 
 
{{రామాయణం}}
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/త్రిజట" నుండి వెలికితీశారు