గీత గోవిందం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
ఒక అర్ధరాత్రి, విజయ్ నిత్యా ను నడిరోడ్డులో కలవడంతో కథ ప్రారంభం అవుతుంది. నిత్య విజయ్ చాలా బాధగా ఉండటం గమనించి ఆరా తీస్తుంది. అప్పుడు విజయ్ తన కథ ఆమెకు చెబుతాడు. నీలు అనే విద్యార్థిని అతని వెంట పడుతూ ఉంటుంది. గుడికి వెళ్ళి అక్కడ అలంకరించేది గీత అనే అమ్మాయని తెలుసుకుంటాడు. ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు అని తెలుసుకుని చాలా ఆనందిస్తాడు.విజయ్ సోదరి నిశ్చితార్థం కోసం కాకినాడ వెళ్లాల్సి వస్తుంది. అనుకోకుండా గీత కూడా ఇతని తో పాటు అదే బస్సు లో ప్రయాణిస్తుంది. ఆమె కిటికీ పక్కన సీట్ లో కూర్చుంటుంది. ఆమె నిద్ర పోతూ వుండగా హీరో సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నిస్తాడు. అదే సమయంలో బస్సు కుదుపు కి గురి అవడంతో అతను ఆమెపై పడతాడు. విజయ్ క్షమించమని అడుగుతాడు. కానీ గీత అతని చేతిని కట్టేసి తన అన్నయ్యను ఫణీంద్రను పిలుస్తుంది. ఆ మరుసటి రోజు ఫణీంద్ర బస్సు చేరుకొని సంఘటన గురించి అడుగుతాడు. గీత అతను తప్పించుకుని పారిపోయాడు అని చెపుతుంది. విజయ్ తాను తప్పించుకున్నట్లు సంతోషపడతాడు కానీ తన పెళ్ళి చేసుకోబోతున్నది ఫణీంద్ర అని తెలుసుకుని షాక్ కి గురి అవుతాడు. బస్సు లో అల్లరి చేసినవాడు విజయ్ అని మొదట ఫణీంద్ర అనుమానిస్తాడు. కానీ తన చెల్లెలు, విజయ్ కాదు అని చెప్పడం తో ఆవిషయం మర్చిపోతాడు. విజయ్ గీత కు ధన్యవాదాలు చెపుతాడు. మీ చెల్లెలు పెళ్ళి ఇబ్బందుల్లో పడ్డం ఇష్టం లేక అల్లరి చేసింది నువ్వు కాదు అని అన్నయ్య తో చెప్పను అని చెపుతుంది.
 
గీత తండ్రి షాపింగ్ లో విజయ్ సాయం తీసుకోమని చెప్తాడు. ఆమె ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటుంది. అదే సమయం లో నీలు విజయ్ ఫోన్ కి ఒక చెత్త వీడియో పంపుతుంది. అనుకోకుండా అది చూసిన గీత కి విజయ్ మీద చెడు అభిప్రాయం ఇంకా బలపడిపోతుంది. గీత తన బాస్ ఇంటికి కి తన అన్నయ్య పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి వెళ్తుంది. గీత అక్కడ నీలు అమ్మని చూసి ఆశ్చర్య పోతుంది.గీ త ఆమెతో నీలు గురించి, ఆమె తో విజయ్ కి ఉన్న చేదు స్నేహం గురించి చెపుతుంది. అప్పుడు ఆమె విజయ్ గురించి చెప్పిన విషయం విని గీత షాక్ కి గురి అవుతుంది. హీరో విజయ్ ఎంత ఉత్తముడో వివరిస్తుంది. గీత విజయ్ తో ప్రేమలో పడుతుంది. తన అన్నయ్య తో బస్సు లో జరిగిన గొడవ గురించి మర్చిపోమని చెపుతుంది. కానీ ఆమె తన ప్రేమ గురించి విజయ్ తో చెప్పదు. గీత తాతయ్య కు హార్ట్ ఎటాక్ వస్తుంది. గీత నాన్నమ్మ ఫణీంద్రతో పాటే గీత్ కి కూడా మ్యారేజ్ చేసేయమని పట్టు బడుతుంది. ఫణీంద్ర విజయ్ అయితే మంచిదని అని అందరికి చెపుతాడు. అందుకు గీత ఒప్పుకుంటుంది కానీ విజయ్ కి గీత తనని ఆప్షన్ గా ఎంచుకోవడం నచ్చదు.
 
===తారాగణం===
"https://te.wikipedia.org/wiki/గీత_గోవిందం_(సినిమా)" నుండి వెలికితీశారు