అంత్యకుల పైడిరాజు ఆధ్వర్యంలో నాలుగు సంవత్సరాలపాటు గోపాలకృష్ణ చిత్రలేఖనం నేర్చుకున్ననేర్చుకున్నాడు. హైదరాబాదులోనపి ఫైన్ ఆర్ట్ కళాశాలకు అప్లై చేస్తే సీటు రాలేదు. దాంతో గోపాలకృష్ణ అప్పటి ముఖ్యమంత్రి [[బూర్గుల రామకృష్ణారావు]]కు లేఖ రాయగా, ఆయన గోపాలకృష్ణ ప్రతిభ చూసి కళాశాలలో సీటు ఇప్పించాడు. సెమినార్లు-పత్రికలలో 36 పరిశోధనా పత్రాలను ప్రచురించాడు. 100కి పైగా కవితలు, తొమ్మిది నాటకాలు రాశాడు. పదవీ విరమణ చేసిన తరువాత, కళను ప్రోత్సహించడానికి ‘అబ్బూరి కళాకేంద్రం’ ను స్థాపించి, వర్ధమాన కళాకారులను ప్రోత్సహించడానికి అనేక ప్రదర్శనలను ఏర్పాటు చేశాడు.<ref name="Abburi Gopalakrishna passes away">{{cite news |last1=The Hindu |first1=Visakhapatnam |title=Abburi Gopalakrishna passes away |url=https://www.thehindu.com/news/cities/Visakhapatnam/Abburi-Gopalakrishna-passes-away/article17125493.ece |accessdate=8 June 2021 |date=1 February 2017 |archiveurl=https://web.archive.org/web/20210225055633/https://www.thehindu.com/news/cities/Visakhapatnam/Abburi-Gopalakrishna-passes-away/article17125493.ece |archivedate=25 February 2021}}</ref>