పీలా కాశీ మల్లికార్జునరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
దివంగత నటులు [[రావు గోపాలరావు]] సహకారంతో చిత్రసీమలోకి ప్రవేశించారు. 1972లో ''తులసి'' అనే చిత్రంలో చిన్నవేషం వేశారు. ఆ సమయంలోనే పార్వతీ పరమేశ్వరులు చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. తరువాత నాగమల్లి లాంటి కొన్ని చిత్రాల్లో నటించారు. వంశీతో ఏర్పడ్డ పరిచయం ఆయన సినీజీవితాన్ని మలుపు తిప్పింది.
 
[[వంశీ]] మొదటిచిత్రం మంచు పల్లకీలో చిన్న పాత్ర పోషించారు. [[అన్వేషణ]]లో పులిరాజుగా మల్లికార్జునరావు నటన చిత్రసీమను ఆకట్టుకొంది. అదే సమయంలో తన తండ్రి అస్వస్థతకు లోనైతే [[అనకాపల్లి]] వెళ్లడం వల్ల అవకాశాలు కోల్పోయారు. 'లేడీస్‌ టైలర్‌'లో బట్టల సత్యం పాత్ర తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 350కి పైగా సినిమాల్లో నటించారు. [[తమ్ముడు (సినిమా)|తమ్ముడు]] సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ [[నంది అవార్డు]]ను పొందారు. [[ఏప్రిల్‌ ఒకటి విడుదల]], [[కనకమాలక్ష్మి రికార్డింగ్‌ డ్యాన్స్‌ట్రూపు]], [[హలో బ్రదర్]]‌, [[ఆలీబాబా అరడజను దొంగలు]], [[ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు]], [[బద్రి]], [[ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు]], [[ఎవడి గోల వాడిది]], [[మా ఆయన సుందరయ్య]] (2001) లాంటి చిత్రాలు ఆయనకెంతో పేరు తీసుకొచ్చాయి. మల్లికార్జునరావు నటనలో తనకంటూ ఓ పంథాను ఏర్పరచుకొన్నారు. తొలినాళ్లలో రావుగోపాలరావు ప్రభావం ఉండేది. తన సంభాషణ శైలిలో ఉత్తరాంధ్ర యాసని మేళవించడంతో జనాన్ని సులభంగా ఆకట్టుకోగలిగారు. ఆ యాసనీ, మాండలికాన్నీ సాధికారికంగా మాట్లాడగలిగిన నటుడిగా గుర్తింపు పొందారు. అలాగే గ్రామీణ నేపథ్యం ఉన్న పాత్రలకు జీవంపోసే నటుల్లో ఆయన ముందుండే వారు. చివరిగా ఆయన నటించిన చిత్రం మహా నగరంలో.
 
=== నటించిన చిత్రాలు ===