వికీపీడియా:విషయ ప్రాముఖ్యత: కూర్పుల మధ్య తేడాలు

ప్రవేశిక విస్తరణ
ట్యాగు: 2017 source edit
→‎ప్రాముఖ్యతను గుర్తించే అంశాలు: ప్రాముఖ్యతను గుర్తించే సాధారణ అంశాలు విభాగంలో కొత్త పాఠ్యం చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 9:
ఏదైనా విషయం ఇక్కడ చూపిన మార్గదర్శకాలకు సరిపోయినంత మాత్రాన, దానికి ప్రత్యేకంగా ఒక పేజీ ఖచ్చితంగా ఉండొచ్చని అర్థం కాదు. మరో వ్యాసంలో భాగంగా రాసేందుకో, లేదా మరేదైనా విషయంతో కలిపి ఒకే వ్యాసంగా రాసేందుకో వాడుకరులు చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు. ఈ మార్గదర్శకాలు ఫలానా విషయానికి వికీపీడియాలో పేజీ ఉండవచ్చునా అనేది చెబుతాయే తప్ప, ఆ వ్యాసంలో కంటెంటు ఏమి ఉండాలో, ఏం ఉండకూడదో చెప్పవు. ఆ సంగతిని వివరించేందుకు [[వికీపీడియా:తటస్థ దృక్కోణం|తటస్థ దృక్కోణం]], [[వికీపీడియా:నిర్ధారత్వం|నిర్ధారత్వం]], [[వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం|మౌలిక పరిశోధనలు నిషిద్ధం]], [[వికీపీడియా:ఏది వికీపీడియా కాదు|ఏది వికీపీడియా కాదు]] అనే మౌలిక నిబంధనలు ఉన్నాయి.
 
== ప్రాముఖ్యతను గుర్తించే సాధారణ అంశాలు ==
ఒక విషయానికి స్వతంత్రమైన, విశ్వసనీయమైన వనరులలో గణనీయమైన కవరేజీ వచ్చినపుడు ఆ విషయానికి వికీపీడియాలో ప్రత్యేకమైన వ్యాసం ఉండవచ్చని భావిస్తారు.
ఆంగ్ల వికీలో "Notability" కి ఇచ్చిన ప్రమాణాలు ఇవి.
* ఒక విషయం గురించి విశ్వసనీయమైన ప్రచురణలలో (ఆ సబ్జెక్టుకు సంబంధించిన ప్రత్యేక ప్రచురణలలో కాదు) గణనీయంగా వ్రాయబడితే అది ప్రముఖమైన విషయం అనవచ్చును.
 
* గణనీయమైన కవరేజీ అంటే విషయం గురించి నేరుగా, వివరంగా చర్చించడం. ఎంత వివరంగా ఉండాలంటే అందులోని కంటెంటును సంగ్రహించాలంటే మౌలిక పరిశోధన చెయ్యాల్సిన అవసరం ఉండకూడదు. ఆ వనరుల్లో ఏదో ఒకటీ అరా చోట్ల, స్వల్పమైన ప్రస్తావన (ట్రివియల్ మెన్షన్) వస్తే అది గణనీయమైన కవరేజీ అని భావించరాదు. అయితే ఆ మూల వ్యాసానికి ఇదే ప్రధాన విషయం కావాల్సిన అవసరం లేదు.
** విప్లవ రచయితల సంఘం గురించి [https://www.sakshi.com/news/family/special-story-virasam-1253542 సాక్షి దినపత్రికలో ప్రత్యేకంగా వచ్చిన వ్యాసం] ఆ వ్యాస విషయ ప్రాముఖ్యతను వివరించేందుకు సరిపోతుంది.
** పై వ్యాసంలో "గా, అల్లం రాజయ్య ‘అగ్నికణం’లో మాదిగ బయ్యక్క విప్లవ నాయకిగా కావడంగా కనిపిస్తుంది." అనే వాక్యం ఉన్నంత మాత్రాన బయ్యక్కకు విషయ ప్రాముఖ్యత ఉన్నట్టు కాదు.
* "విశ్వసనీయమైన" అంటే [[వికీపీడియా:నమ్మదగ్గ మూలాలు|విశ్వసనీయమైన మూలాల]] మార్గదర్శకానికి అనుగుణంగా ఉండే సమగ్రత, ప్రాశస్త్యం ఉన్న మూలాలు అని అర్థం. ఈ మూలాలు ఏ రూపంలో/ఏ మాధ్యమంలో నైనా, ఏ భాషలోనైనా ప్రచురితమై ఉండవచ్చు. విషయాన్ని కవర్ చేసే ద్వితీయ స్థాయి మూలాలైతే మరీ మంచిది.
* "వనరులు" <ref>Including <em>but not limited to</em> newspapers, books and e-books, magazines, television and radio documentaries, reports by government agencies, and academic journals. In the absence of multiple sources, it must be possible to verify that the source reflects a neutral point of view, is credible and provides sufficient detail for a comprehensive article.</ref> [[వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం|ద్వితీయ స్థాయి మూలాలై]] ఉండాలి. ఎందుకంటే అవి విషయ ప్రాముఖ్యతకు సంబంధించి అత్యుత్తమ వస్తుగత సాక్ష్యాలను అందిస్తాయి. మూలాలు నాణ్యత లోను, కవరేజి లోతులోనూ తేడాలు ఉంటాయి కాబట్టి, మూలాలు ఎన్ని ఉఅండాలి అనే వుషయంలో ఇదమిత్థమైన సంఖ్య అంటూ లేదు. కాని అనేక వనరులు ఉంటే బాగుంటుంది. <ref>Lack of multiple sources suggests that the topic may be more suitable for inclusion in an article on a broader topic. It is common for multiple newspapers or journals to publish the same story, sometimes with minor alterations or different headlines, but one story does not constitute multiple works. Several journals simultaneously publishing different articles does not always constitute multiple works, especially when the authors are relying on the same sources, and merely restating the same information. Similarly, a series of publications by the same author or in the same periodical is normally counted as one source.</ref> ఈ వనరులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండవలసిన అవసరం లేదు. తెలుగు లోనే ఉండాలని కూడా ఏమీ లేదు. ఒకే రచయిత రాసినవీ లేదా ఒకే సంస్థ ప్రచురించినవీ అయిన ప్రచురణలను ఒకే మూలంగా పరిగణిస్తారు.
* "విషయానికి సంబంధించినవి కాకుండా స్వతంత్రమైనవి" అంటే వ్యాస విషయం గానీ, దానికి సంబంధించిన వారు గానీ చేసిన రచనలు. ఇవి విషయ ప్రాముఖ్యత నిరూపించే మూలాలుగా అంగీకరించబడవు. ఉదాహరణకు, ప్రకటనలు, పత్రికా ప్రకటనలు, ఆత్మకథలు, వ్యాస విషయానికి చెందిన వెబ్‌సైటు మొదలైనవి స్వతంత్ర వనరులుగా పరిగణించబడవు. <ref>Works produced by the subject, or those with a strong connection to them, are unlikely to be strong evidence of notability. See also: [[Wikipedia:Verifiability#Questionable sources]] for handling of such situations.</ref>
* "భావిస్తారు" అని ఎందుకు అన్నారంటే.. విశ్వసనీయమైన వనరులలో గణనీయమైన కవరేజి ఉన్నంత మాత్రాన దానికి వ్యాసం కచ్చితంగా ఉండాలి అనే హామీ ఏమీ లేదు, ఉండవచ్చు అనే సంభావ్యతను మాత్రమే ఇది సూచిస్తుంది. మరింత లోతైన చర్చ జరిగితే ఈ విషయానికి ప్రత్యేకంగా వ్యాసం ఉండనక్కరలేదు అని తేలవచ్చు. బహుశా ఏది వికీపీడియా కాదు అనే పేజీలో చెప్పిన మినహాయింపులకు లోబడి లేకపోయి ఉండవచ్చు. <ref>Moreover, not all coverage in [[Wikipedia:Reliable sources|reliable sources]] constitutes evidence of notability for the purposes of article creation; for example, directories and databases, advertisements, announcements columns, and minor news stories are all examples of coverage that may not actually support notability when examined, despite their existence as [[WP:RS|reliable sources]].</ref>
 
ఏదైనా విషయం ఈ ప్రమాణాలకు అనుగుణంగా లేనప్పటికీ, కొన్ని ధృవీకరించదగిన వాస్తవాలను కలిగి ఉంటే, దాని గురించి మరొక వ్యాసంలో రాసే అవకాశం ఉండవచ్చు.
 
== సాధారణ విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలు ==