విలియం కెరే: కూర్పుల మధ్య తేడాలు

ప్రముఖ ఆంగ్ల నాటక రచయిత, కవి, సమాజవాది, భాషానువాది, బహుభాషా వేత్త, విద్యావేత్త
Created page with '{{Infobox writer <!-- for more information see Template:Infobox writer/doc --> | name = విలియం కెరే (William Carey) | image...'
ట్యాగు: 2017 source edit
(తేడా లేదు)

14:05, 10 జూన్ 2021 నాటి కూర్పు

విలియం కెరే (William Carey) (ఆగష్టు 17, 1761 - జూన్ 9, 1834) ప్రముఖ ఆంగ్ల నాటక రచయిత, కవి, సమాజవాది, భాషానువాది, బహుభాషా వేత్త, విద్యావేత్త. తెలుగుభాషకు 'ఎ గ్రామర్ ఆఫ్ ది తెలింగ లాంగ్వేజ్' (A Grammar of the Telinga Language) అనే పేరుతో 1814లో ఇంగ్లీషు వ్యాకరణం రచించిన వ్యక్తి.

విలియం కెరే (William Carey)
పుట్టిన తేదీ, స్థలం17 August 1761
మరణం9 June 1834
వృత్తినాటక రచయిత, కవి
జాతీయతఇంగ్లీష్
కాలం1761–1834

జీవిత విశేషాలు

విలియం కెరే జీవిత చరిత్రను జె.సి.మార్ష్మన్ రచించాడు.1885లో జార్జిస్మిత్ అనే అతను మరొక జీవిత చరిత్రను రచించాడు. ఇతను ఆగష్టు 17 1761 న ఇంగ్లాడులో జన్మించాడు. కెరే మొదట వృత్తిరీత్యా బూట్లు తయారుచేసేవాడు. క్రైస్తవ మతస్థులు కానివారికి క్రైస్తవ చరిత్రను తెలియజెప్పడానికీ, క్రైస్తవ సువార్తను ప్రచారం చేయడానికి ఇంగ్లాండులో 1792లో బాప్టిస్టు మిషనరీ సొసైటీ స్థాపించబడింది.ఆ మిషన్ తరపున బెంగాలులో పనిచేయడానికి ముందుకు వచ్చినవాడు కెరే. ఇతను 1793లో కలకత్తా చేరుకున్నాడు. 1800 సం.లో కలకత్తా సమీపంలో శ్రీరామ్పూర్ లో బాప్టిష్టు మిషన్ నెలకొల్పబడినది.ఇది బెంగాలు సాంస్కృతిక చరిత్రలో ఒక ముఖ్య సంఘటన అని బెంగాలీ సాహిత్య చరిత్రకారుడు డా.సుకుమార్ సెన్ వ్రాశారు. ఈ మిషన్ కు విలియం కెరే, జాషువా మార్ష్మన్, విలియం వార్డ్ మూర్తిత్రయం వంటివారు. మిషన్ తో పాటు ఒక ముద్రాక్షశాలను కూడా పెట్టారు.ఈ మిషన్ వారు స్కూళ్ళు పెట్టి భారతీయులకు ఇంగ్లీషునేర్పారు.ఒకప్పుడు సతీసహగమనముల్ సంఖ్య అధికంకాగా ఆవిషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటిని ఆపమని కోరారు. రాజా రామమోహనరాయ్ సందర్సించగా కెరే ఆయనకు సగౌరవంగా స్వాగతం చెప్పి, బైబిల్ ప్రతిని ఆయనకు కానుకగా ఇచ్చాడు. స్కూల్ అభివృద్ధికోసం రామమోహనరాయ్ గారు కొంత స్థలాన్ని దానంగా ఇచ్చినారు.

కెరే 1801లో కలకత్తాలోని ఫోర్ట్ విలియం కాలేజీలో బెంగాలీ సంస్కృతశాఖల అధిపతిగా నియమితుడైనాడు.ఆ రోజులలో ఆకాలేజీ వివిధ యూరప్ పండితులు, భారతీయ విద్వాంసులూ కలుసుకొనే విద్యాకేంద్రంగా వాసికెక్కింది.వారి సహకారంతో క్రైస్తవమత గ్రంధాలను ప్రధానమైన భారతీయ భాషలలోకి అనువదించాలని కెరే తలపెట్టాడు. ఆపనికి గాను ఎనిమిది మంది పండితులను నియమించాడు.వారిలో ముఖ్యుడు మృత్యుంజయ్ విద్యాలంకార్. ఆతని మాతృ భాష ఒరియా.మనిషి స్ఫురదృపి.సంస్కృత కావ్యాలు క్షుణ్ణంగా చదువుకున్న విమర్సకుడు. వీరి 1808లో న్యూటెస్ట్ మెంట్ ను సంస్కృతంలోకి ముద్రించారు.1883నాటికల్లా బైబిలు 33 భాషలలోనికి అనువదించబడినది. ఈ అనువాదాలు పూర్తి అయ్యే సమయానికి కెరే ఆ భాషలో చక్కని ప్రవేశం పొందేవాడు.అంతేకాక దాని అనువాద పాఠంలో తగు సవరణలు చేసి మెరుగులు తిద్దగల స్థితిలో ఉండేవాడు.

తన అనువాద పద్దతిని గూర్చి కెరే ఇట్లా చెప్పుకునేవాడు. 'నా అనువాద శైలినీ, వాక్య విన్యాసాన్ని నా పండితుడు పరిశీలించేవాడు.మూలమునకు వ్యత్యాసం లేకుండా సరిగా ఉన్నదాలేదా అని చూచేవాడు.నా అనువాదాన్ని నాకు చదివి వినిపించేవాడు.అతడు వత్తిపలుకు విధానమును నేను గమనించి, అతనికి పూర్తిగా అర్ధమైనదీ లేనిదీ గ్రహించగలిగేవాడిని.అతను సరిగా చదవలేకపోతే నా అనువాదమును గూర్చిశంక కలిగేది.బెంగాలీలో ఒక్క పుల్ స్టాప్ తప్ప, ఇతర విరామ స్థానములు గుర్తులేకుండటచేత ఎక్కడ నొక్కి చదవవలెనో పాఠకునికి అంత సులభమైన పనికాదు.'

అయితే కెరే ఇన్ని భాషల అనువాదాల అజమాయిషీ ఎట్లా చేసేవాడా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. అందుకు ఆయన చెప్పిన సమాధానం: "సంస్కృతం, హిందీ, బెంగాలీ, మరాఠీ, పర్షియన్, పంజాబీ, తెలుగుభాషలతో పూర్తి పరిచయం కలిగిందంటే ఇతర దేశ భాషలలో ప్రావీణ్యం సంపాదించడం కష్టమేమీ కాదు."

కెరే మృత్యుంజయ్ విద్యాలంకార్ సహకారంతో బెంగాలీ భాషలో శిక్షణ పొందవలసిన సివిలియన్ ఉద్యోగుల ఉపయోగం కొరకై పాఠ్యపుస్తకాలు కూడా రచించాడు.సంస్కృతం, మరాఠీ, పంజాబీ భాషలకు వ్యాకరణములు నిర్మించాడు.అందులో సంస్కృత వ్యాకరణం ప్రసిద్ధికెక్కింది.

కెరేకు, ఆతని సహచరులకు ఇంగ్లాండులో మెప్పు లభించలేదు.హీనులు అని దూషించారు.క్రైస్తవ మత ప్రచారానికి పంపితే కెరే చేసింది, బెంగాలులో విద్యావ్యాప్తి. భారతీయ భాషా సాహిత్యాలకు ఎనలేని సేవ.పూర్తిగా మత ప్రచారం చేయక, భాషలలో పడి తన కర్తవ్యం మరిచాడని విమర్స. కాని సమకాలీక ఆంగ్లకవి రాబర్ట్ సఠే కెరేను గూర్చి చెబుతూ " ప్రపంచంలోని రాజులూ ప్రభువులూ విశ్వవిద్యాలయాలూ ఇతర సంస్థలూ చేసిన, చేయ ప్రయత్నించినదానికన్న కెరే క్రైస్తవ మతగ్రంధాలలోను జ్ఞానమును వ్యాప్తి చేయడానికి ఎక్కువ కృషిచేసాడు." అన్నాడు.

మూలాలు

  • 1982 భారతి మాస పత్రిక. వ్యాసము: డా.విలియం కెరే వ్యాసకర్త శ్రీ. డి.రామలింగం.