దీపం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB తో సవరణలు
పంక్తి 10:
* [[కొవ్వొత్తులు]] (Candles): [[మైనం]] వంటి [[కొవ్వు పదార్ధాలు|కొవ్వు]] పదార్ధాల మధ్యలో వత్తిని ఉంచి కొవ్వొత్తి చేస్తారు. పూర్వకాలంలో పందుల కొవ్వునుండి చేసేవారు. ప్రస్తుతం మైనం, ముఖ్యంగా పారఫిన్ మైనం ఎక్కువగా వాడుతున్నారు. కొన్నింటిని [[మేజా]]పై ఉంచడానికి అనువుగా స్టాండుల్ని ఉపయోగిస్తే, విస్తృతమైన ఏర్పాట్లు చేస్తారు.
* నూనె దీపాలు (Oil lamps): [[నూనె]]తో కుందులలో వెలిగించే దీపాలను నునె దీపాలు అంటారు. ఇవి అతి పురాతన కాలం నుండి ఉపయోగంలో ఉన్నాయి. ఇవి [[మట్టి]], [[గాజు]], పింగాణీ, లేదా లోహాలతో తయారుచేయబడి ఉంటాయి. కొన్ని దీపాలలో చిన్న [[చక్రం]] అమర్చి ఉంటుంది. అది తిప్పినప్పుడు వత్తి నెమ్మదిగా పైకి వస్తుంది. సాంప్రదాయకంగా దీపాల్ని దేవుని కోసం ప్రత్యేకంగా వాడతారు. చాలా రకాల నూనెలు దీపాల కోసం వాడకంలో ఉన్నాయి. ఉదా. నెయ్యి, [[నువ్వుల నూనె]], [[ఆలివ్ నూనె]], [[కిరోసిన్]] మొదలైనవి.
 
* [[విద్యుద్దీపాలు]] (Electric lamps): [[విద్యుత్తు]]తో [[కాంతి]]ని వెదజల్లే దీపాల్ని విద్యుద్దీపాలు అంటారు. ఆధునిక యుగంలో ఈ దీపాలు విస్తృతంగా ఉపయోగంలోకి వచ్చాయి.
 
* డేవీ దీపం (Davy lamp) : గనులలో ఉపయోగించే సురక్షితమైన దీపం.
* [[ఆకాశదీపం]] : [[కార్తీక మాసం]]లో, ముఖ్యంగా శివాలయాలలో ఎత్తైన చోట, అవసరమైతే ఒక గడకు కట్టి, సాయం సంధ్యవేళ, మట్టితో గానీ, [[లోహం]]తో గానీ చేసిన ఒక చిల్లుల పాత్రలో నువ్వుల నూనె వేసి [[ప్రమిద]]లో ఒత్తులను వెలిగించడం ఒక సంప్రదాయంగా ఉంది. కార్తీక మాసం అంతా ప్రమిదలు వెలిగించే ఈ దీపాన్ని [[ఆకాశదీపం]] అంటారు; [[సూర్యుడు]] తులా రాశిలో ఉన్నప్పుడు వెలిగించే దీపం; [[కార్తీక దీపం]] అని కూడా వ్యవహరిస్తారు.
Line 29 ⟶ 27:
[[వర్గం:గృహోపకరణాలు]]
[[వర్గం:సంస్కృత పదజాలము]]
[[వర్గం:దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/దీపం" నుండి వెలికితీశారు