ఏ మాయ చేశావే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{for|ఇదే పేరుతో ఉన్న తెలుగు ధారావాహిక|https://te.wikipedia.org/wiki/%E0%B0%8F_%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF_%E0%B0%9A%E0%B1%87%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87_(%E0%B0%A7%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%95)}}
{{సినిమా
|name = ఏ మాయ చేశావే
Line 26 ⟶ 27:
ఇందిరా ప్రోడక్షన్స్ పతాకం పై ఘట్టమనేని మంజుల నిర్మాతగా [[గౌతమ్ మీనన్]] దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథాచిత్రం '''''ఏ మాయ చేశావే'''''. [[అక్కినేని నాగ చైతన్య]], [[సమంత]] ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు [[ఏ.ఆర్.రెహ్మాన్]] సంగీతం అందించారు<ref>{{Cite web|url=https://indiancine.ma/AYGS|title=Ye Maya Chesave (2010)|website=Indiancine.ma|access-date=2021-04-22}}</ref>. 2010 ఫిబ్రవరి 26న విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. నాగ చైతన్య, సమంతలకు తొలి తెలుగు విజయవంత చిత్రంగా నిలిచిపోయిన ఈ సినిమా నేటికీ తెలుగులో వచ్చిన అమర ప్రేమకథాచిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఏ.ఆర్.రెహ్మాన్ అందించిన సంగీతం నేటికీ విశేషంగా ఆదరించబడుతోంది.
కార్తీక్ అనే యువ అసిస్టంట్ డైరెక్టరుకీ, తనకంటే రెండేళ్ళు పెద్దదైన జెస్సీ అనే మలయాళ క్రిష్టియన్ అమ్మాయికీ మధ్య నడిచిన ప్రేఅమాయణాన్నీ, ఈ ప్రయాణంలో వారు వారి కుటుంబాల నుంచి ఎదురుకున్న ఒడిదుడుకుల నేపథ్యంలో సాగే ఈ సినిమా ఏకకాలంలో తమిళంలో శింబు, [[త్రిష]] ముఖ్య పాత్రల్లో ఈ సినిమా "విన్నైతాండి వరువాయా" పేరుతో తెరకెక్కింది. ఈ సినిమా నటవర్గం, పతాక సన్నివేశం ఏ మాయ చేశావే సినిమాకి పూర్తి విభిన్నంగా ఉంటుంది. ఈ సినిమా కూడా భారీ విజయం సాధించింది. కానీ ఈ సినిమా హింది పునః నిర్మాణమైన ఏక్ థా దీవానా మాత్రం పరాజయం చవి చూసింది.
 
==కథ==
తన ఇంజినీరింగ్ పూర్తిచేసుకున్న కార్తీక్ ([[అక్కినేని నాగ చైతన్య]]) సినిమా దర్శకుడవ్వాలని కలలు కంటుంటాడు. తన స్నేహితుడి ద్వారా ప్రముఖ దర్శకుడు [[పూరీ జగన్నాధ్]] దగ్గర అసిస్టంట్ గా చేరుతాడు. ఇంతలో తన ఇంటి పైపోర్షనులో కేరళ నుంచి వచ్చిన ఒక క్రిష్టియన్ కుటుంబానికి కార్తీక్ ప్రోత్సాహం మీద ఇల్లు అద్దెకి ఇస్తాడు కార్తీక్ తండ్రి. ఐతే వాళ్ళ కూతురు జెస్సీ ([[సమంత]])ని చూసి ప్రేమలో పడతాడు కార్తీక్. తన తండ్రికి భయపడుతున్న కార్తీక్ ఒక రోజు ఎవరూలేని సమయం చూసి జెస్సీకి తన ప్రేమ విషయం చెప్తాడు. దీనికి ఒప్పుకోని జెస్సీ తరువాత తన ఊరికి బయలుదేరిందని కార్తీక్ తెలుసుకుంటాడు. తన స్నేహితుడి ([[కృష్ణుడు (నటుడు)|కృష్ణుడు]])తో కలిసి ఆ ఊరికి చేరుకున్న కార్తీక్ జెస్సీని కలిసి తన ప్రవర్తనకు క్షమాపణలడిగి, స్నేహితులుగా కొనసాగుదామని చెప్తాడు.కార్తీక్ పై ఎలాంటి ఆలోచనలు లేవని స్పష్టం చేసిన జెస్సీ తన స్నేహానికి ఒప్పుకుని తన ఇంట్లోవారికి తన క్లాస్ మేట్ గా పరిచయం చేస్తుంది.
"https://te.wikipedia.org/wiki/ఏ_మాయ_చేశావే" నుండి వెలికితీశారు