వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1,124:
::'''అనుకూలం:'''
# అజయ్ కుమార్
=== ఈ పుకార్లు, వ్యక్తిగత దాడుల ధోరణిపై చర్యలు ===
* "భాషాభిమానులందరూ చెప్తారు", "తెలుగు భాషాభిమానుల సమావేశంలో నాకు తెల్సిన విషయం ఏంటంటే", "పెద్ద అభియోగం ఉంది", "పని జర్గనివ్వడని చెప్తుంటారు" - ఇవన్నీ పుకార్లు. ఎవరో చెప్పారు, నాకు తెలిసిన విషయం, అభియోగం ఉంది - వంటి వాక్యాలు నిరూపించలేని ఆరోపణలు చేయడానికి, వాటిని ఎవరో అజ్ఞాత భాషాభిమానుల మీదకు తోయడానికి ఉపయోగిస్తున్న పదబంధాలు. సామాన్యంగా కొన్ని రకాల పత్రికల్లో, వెబ్‌సైట్లలో "ఆ హీరోయిన్‌ గురించి ఇండస్ట్రీ కోడై కూస్తోంది", "ఫలానా జరిగిందని భోగట్టా", "సినిమా పరిశ్రమ వర్గాల్లో ఫలానా పుకార్లు షికార్లు చేస్తున్నాయి" - ఇలాంటి భాష వాడి సినీ ప్రముఖుల మీద పుకార్లు లేవనెత్తుతారు. అందులో ఏ ఆధారమూ ఉండదు. అలాంటి భాషే ఇక్కడ వాడారు.
* ఈ గాలి పుకార్లు తప్పించి సరైన ఆధారాలతో కూడిన విమర్శలు లేవు. "పాతాళంలోకి దింపాడు", "ఎలా అభివృద్ధి పర్చాలి అనేది ఇతనికి ఏమీ తెలియదు", "పదవులను పట్టుకొని వేలాడటం", "పంగనామాలు పెట్టి పని జర్గనివ్వడని", "వల్లనే తెలుగు వికీపీడియా కుప్పకూలిందని" - ఇవి తిట్లు, ఆరోపణలు. రాజకీయ నాయకుల మీద సామాన్యంగా చేసే వ్యక్తిగత దాడుల వంటివి ఇవి. మొన్న [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] గారి మీద, నిన్న [[వాడుకరి:Chaduvari|చదువరి]] గారి మీద ఈ భాషే వాడి ఆధారాలు లేని ఆరోపణలు చేసి అవమానపరిచాడు. రేపు ఇతరుల మీద కూడా ఇలానే చేయడన్న ఆధారమేమీ కనిపించట్లేదు. దీనికి తోడు ఇతర సభ్యులను కూడా ఈ అనవసర వివాదంలోకి లాగుతున్నాడు.
* ఈ తిట్లు, గాసిప్పుల నడుమ అడిగిన ఒకే ఒక్క విషయం - "నిరోధం విధించే ముందు హెచ్చరిక జారీచేయాలనే" సంగతి. నిరోధం విధించే ముందు హెచ్చరిక ఇతనికి ఎక్కడ జారీచేయాలి చదువరి గారు? ఇతను అజ్ఞాతంగా ఈ పని చేస్తున్నాడు. ఐపీ అడ్రస్ తప్ప ఖాతా లేదు. ఐపీ అడ్రస్ చర్చా పేజీల్లో హెచ్చరికలు రాయకూడదు. (కారణం తెలియనివారికి: ఒకే ఐపీ అడ్రస్ పలువురు వాడుతూ ఉంటారు. ఐపీ అడ్రస్ వాడేవారు ఒక సారి ఒకచోట, ఇంకోసారి ఇంకోచోట లాగిన్ అవుతారు.) కాబట్టి, భవిష్యత్తులో ఈ వ్యక్తి ఖాతా సృష్టించుకుని మార్పుచేర్పులు చేస్తేనే చర్చపేజీలో ఏమైనా చెప్పగలం లేకుంటే ఏ నిర్వాహకుడైనా చేసిన దుశ్చర్య ఆధారంగా నేరుగా చర్యలు తీసుకోవడం తప్ప చేసేదేమీ లేదు. అందుకే ఇప్పుడూ అదే చేశాను.
* చివరగా, చదువరి గారు పద్ధతి ప్రకారం ఒకరోజు నిరోధం విధించారు. ఇప్పుడు మళ్ళీ పైన పాల్పడిన ఆధారాలు లేని వ్యక్తిగత దాడులు, పుకార్లు, అవమానకరమైన భాష కారణంగా మరోసారి నేను వారం రోజుల ఐపీ నిరోధాన్ని విధించవలసి వచ్చింది. ఇదంతా పద్ధతి ప్రకారం చేసిన నిర్వహణా చర్యలు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 09:34, 13 జూన్ 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు