వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 1,201:
 
అర్జున గారితో మీకు వచ్చినట్లే నాక్కూడా వివాదాలు వచ్చాయి. ఆ సందర్భాల్లో నా వాదన వినిపించానంతే. నేను ఆయన పనికి ఎక్కడా అడ్డుపడలేదు. మీకు తెలుసో లేదో.. అడ్డుపడే సందర్భం వచ్చినపుడు కూడా పక్కకు తప్పుకున్నాను. తగ్గి ఉన్నాను. అంతేగానీ నేను అడ్డుపడలేదు. ఈ ఉదాహరణలు [[మూస చర్చ:స్వాగతం#పుస్తకం లింకు]], [[మూస చర్చ:క్లుప్తస్వాగతం]] చూడండి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 07:20, 15 జూన్ 2021 (UTC)
 
== చంద్రకాంత రావు గారు మర్యాదగా మాట్లాడితే బావుంటుంది! ==
 
[[వాడుకరి:C.Chandra Kanth Rao]] గారూ!
*//తెవికీ తరఫున లాభదాయక పదవులు పొంది లక్షల్లో జీతం పొందిన పవన్ కూడా నిర్లక్ష్యపూర్వక ధోరణిలో ఉండుట శోచనీయం.// అన్నారు పైన.
* మీరు ఏది పడితే అది మాట్లాడడం బావోలేదు, మర్యాదగా మాట్లాడండి. ఉదాహరణకు: మీరు ప్రభుత్వోద్యోగి, నేను టాక్స్‌ పేయర్‌ని, అంటే నేను కట్టిన పన్నులోంచి ఎంతో కొంత భాగం మీవంటి ప్రభుత్వోద్యోగుల జీతాలకు, భత్యాలకు వస్తాయి. అంతమాత్రం చేత నేను మిమ్మల్ని చిటికేసి పిలవొచ్చనీ "ప్రభుత్వం నుంచి జీతాలు పొందిన" అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చని, మీ పెర్ఫార్మెన్సు, లోటుపాట్లు నాకు నివేదిక ఇవ్వాలని అనుకుంటే మీకెలా ఉంటుంది? హాస్యాస్పదంగా, అగౌరవంగా ఉండదా? ఇప్పుడు మీరు మాట్లాడిన మాట అంతకన్నా చాలా చాలా ఎక్కువ అమర్యాదగా ఉంటుంది. గాజు గదుల్లో ఉన్నవాళ్ళు బయటివాళ్ళ మీద రాళ్ళు వెయ్యకూడదు. ఏతావతా చెప్పేదేమిటంటే - కాస్త మర్యాదగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. మీ ఈ ధోరణి తగ్గించుకోవడం మంచిది. మీకు నేను మర్యాద ఇవ్వడమూ, మీరు నన్ను అమర్యాదగా మాట్లాడడమూ చెల్లుతుందనుకోకండి.
* //తిరుపతి మహాసభల ఖర్చు లెక్కలు ఇప్పటికీ తేల్చలేరు.// అన్నారు మళ్ళీ.
* ఆ మహాసభలో డబ్బు ఎవరు ఖర్చుపెట్టారు? ఎవరు లెక్కతేల్చాలి? ఎవరిని ఎవరు అడగాలి- ఏమైనా తెలుసా మీకు? మీరు మాట్లాడే ధోరణి ఎలా ఉందంటే, రేపు మీరు రిటైరయ్యాకా "చార్లెస్ శోభ్‌రాజ్‌ అన్ని హత్యలు చేస్తుంటే సకాలంలో ఎందుకు పట్టుకోలేదు మీరు?" అని నేను మిమ్మల్ని అడిగితే ఎలా ఉంటుందో అలా ఉంది. చార్లెస్ శోభ్‌రాజ్‌ను పట్టుకోవాల్సిన పోలీస్, గూఢచర్య సంస్థలూ ప్రభుత్వానికే చెందినవీ, మీరూ ప్రభుత్వోద్యోగిగానే రిటైర్ అయ్యారు కాబట్టి అసందర్భంగా మిమ్మల్ని అడగొచ్చు అనుకుంటే అది హాస్యాస్పదం అవుతుంది కదా. ఇదీ అంతే హాస్యాస్పదమైన సంగతి. మీరు రాస్తున్న ధోరణి చూస్తే మీకు ఉదాహరణ ఇచ్చి చెప్తే తప్ప అర్థం కాదని అనిపించి ఇలా చెప్పాను, మళ్ళీ ఈ ఉదాహరణ పట్టుకుని సాగదీయవద్దు. విషయం ఏమిటంటే - మీరు ఎవరిని పడితే వాళ్ళని ఏదైనా అడిగేయగలను అనుకోకండి. ఎంత నామీద మీరు ఏవో మనసులో పెట్టుకుంటే మాత్రం నాకు సంబంధం లేని సంగతులు నన్ను అడుగుతారా?
* //అజ్ఞత వాడుకరి రాసినది చెత్త కానేకాదు. అనవసరంగా నిందించకండి, అతను తెలుగు భాషాభిమాని.//
* మమ్మల్ని "అరే, తురే" అని సంబోధిస్తున్నాడు అజ్ఞాతంగా, అలాంటివాడిని వెనకేసుకుని వస్తారా? అంటే మీరు రేపట్నించీ మమ్మల్ని "అరే ఒరే" అంటారా? మిమ్మల్ని ఎవరైనా అంటే మీకు ఓకేనా? "పందులు" అని నన్ను, చదువరి గారిని సంబోధించిన ఈ అజ్ఞాత వాడుకరి తెలుగు భాషాభిమానియా? అంత బాగా తెలుసా మీకు? మీకు విడిగా పరిచయం ఉందా అతనితో? అలాంటి దుశ్చర్యలకు మీ ప్రోద్బలం, ప్రోత్సాహం, కితాబులు దేనికి?
* //[[వాడుకరి:Pranayraj1985|ప్రణయ్]], [[వాడుకరి:K.Venkataramana|రమణ]]లు అలా అభిప్రాయపడటం తప్పు. అభిప్రాయాల ప్రకారం రచ్చబండ వ్యాఖ్యలను తొలగించే అవకాశం లేదు.//
* పదేళ్ళ క్రితం ఒకసారి, ఎనిమిదేళ్ళ క్రితం ఒకసారి అదే చంద్రకాంతరావు గారు "చర్చలలో తమ అభిప్రాయాలు తెలిపే వారు సభ్యనామంతో చర్చిస్తే బాగుంటుంది. ఐపీ అడ్రస్ తో చర్చాపేజీలలో వ్రాసిననూ ప్రాధాన్యత ఉండదు. అంతేకాకుండా ఆ విషయాలను చర్చా పేజీల నుంచి పూర్తిగా తొలిగించవచ్చు కూడా." అనీ, "వారి రచనలన్నీ తొలిగించడానికి, ఐపి అడ్రస్‌లన్నీ బ్లాక్ చేయడానికి సభ్యులు చొరవచూపుతారని ఆశిస్తున్నాను" అనీ అజ్ఞాతంగా రాసేవారి గురించి మాట్లాడారని చదువరి గారు బట్టబయలు చేశారు. ఐపీ అడ్రస్‌లు బ్లాక్ చేయడం గురించి ఇప్పుడెందుకు ఇంత బాధ కలుగుతోందో మీకు, మమ్మల్ని, మాతోపాటు ఇతర నిర్వాహకులను ఇంకో నాలుగు బూతులు తిట్టి ప్రోత్సహిద్దామనేనా? ఎంతటి అకారణ ద్వేషం మీకు మామీద ఉన్నా, ఇలాంటి సందర్భంలో అజ్ఞాతలతో మమ్మల్ని నానా తిట్లూ తిట్టిస్తూ ప్రోత్సహించడం సరికాదు.
మీరు రాసిన కొన్ని రాతలు దాడులుగా పరిణమిస్తున్నాయి కాబట్టీ, మీ అజ్ఞాతలు దాడులు చేయడానికి ప్రోత్సాహం, ప్రోద్బలం కలిగిస్తున్నాయి కాబట్టి తగదు అని నేను మీకు చెప్తున్న హితవు ఇది. మీరు ఒక ఖాతాతో రాస్తున్నారు కాబట్టి మీకు ఈ హితవు చెప్పగలుగుతున్నాం. ఖాతాతో రాసినవారు వ్యక్తిగత దాడులు చేసినా నిర్వాహకులు ఒకటి రెండుసార్లైనా హితవు చెప్పి చూడగలరు. అజ్ఞాతంగా రాస్తే ఇలా చెప్పలేం. ఆ రాతలను బట్టి చర్యలు తీసుకోవడం తప్ప మార్గం ఉండదు. ఈమాత్రం అవగాహన అయినా ఈసారి నుంచి కలిగివుంటారని ఆశిస్తున్నాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]])
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు