వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1,213:
* //[[వాడుకరి:Pranayraj1985|ప్రణయ్]], [[వాడుకరి:K.Venkataramana|రమణ]]లు అలా అభిప్రాయపడటం తప్పు. అభిప్రాయాల ప్రకారం రచ్చబండ వ్యాఖ్యలను తొలగించే అవకాశం లేదు.// అన్నారు మీరిప్పుడు.
* 14 ఏళ్ళ క్రితం ఒకసారి, ఏడేళ్ళ క్రితం మరొకసారి అదే మీరు (చంద్రకాంతరావు గారు) "చర్చలలో తమ అభిప్రాయాలు తెలిపే వారు సభ్యనామంతో చర్చిస్తే బాగుంటుంది. ఐపీ అడ్రస్ తో చర్చాపేజీలలో వ్రాసిననూ ప్రాధాన్యత ఉండదు. అంతేకాకుండా ఆ విషయాలను చర్చా పేజీల నుంచి పూర్తిగా తొలిగించవచ్చు కూడా." అనీ, "వారి రచనలన్నీ తొలిగించడానికి, ఐపి అడ్రస్‌లన్నీ బ్లాక్ చేయడానికి సభ్యులు చొరవచూపుతారని ఆశిస్తున్నాను" అనీ అజ్ఞాతంగా రాసేవారి గురించి మాట్లాడారని చదువరి గారు బట్టబయలు చేశారు. ఐపీ అడ్రస్‌లు బ్లాక్ చేయడం గురించి ఇప్పుడెందుకు ఇంత బాధ కలుగుతోందో మీకు, మమ్మల్ని, మాతోపాటు ఇతర నిర్వాహకులను ఇంకో నాలుగు బూతులు తిట్టి ప్రోత్సహిద్దామనేనా? ఎంతటి అకారణ ద్వేషం మీకు మామీద ఉన్నా, ఇలాంటి సందర్భంలో అజ్ఞాతలతో మమ్మల్ని నానా తిట్లూ తిట్టిస్తూ ప్రోత్సహించడం సరికాదు.
మీరు రాసిన కొన్ని రాతలు దాడులుగా పరిణమిస్తున్నాయి కాబట్టీ, మీ అజ్ఞాతలు దాడులు చేయడానికి ప్రోత్సాహం, ప్రోద్బలం కలిగిస్తున్నాయి కాబట్టి తగదు అని నేను మీకు చెప్తున్న హితవు ఇది. మీరు ఒక ఖాతాతో రాస్తున్నారు కాబట్టి మీకు ఈ హితవు చెప్పగలుగుతున్నాం. ఖాతాతో రాసినవారు వ్యక్తిగత దాడులు చేసినా నిర్వాహకులు ఒకటి రెండుసార్లైనా హితవు చెప్పి చూడగలరు. అజ్ఞాతంగా రాస్తే ఇలా చెప్పలేం. ఆ రాతలను బట్టి చర్యలు తీసుకోవడం తప్ప మార్గం ఉండదు. ఈమాత్రం అవగాహన అయినా ఈసారి నుంచి కలిగివుంటారని ఆశిస్తున్నాను. ఇకపై వికీపీడియాలో ఈ వ్యక్తిగత దాడులు మానుకొమ్మని సూచిస్తున్నాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]])
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు