కొత్త సత్యనారాయణ చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
 
==తెలుగు పలుకు - ౨౦౦౭ , ౧౬వ [[తానా]] సమావేశాల జ్ణాపకసంచిక నుండి==
"కళాప్రపూర్ణులు"
( "కళాప్రపూర్ణులు" రచన: '''కొమ్మనేని వెంకట రామయ్య)'''
ఉభయ భాషా పండితులుగా, ఉపాధ్యాయులుగా, విమర్శకులుగా, సాహితీవేత్తలుగా, సరస హృదయులుగా, కళాప్రపూర్ణులుగా,కవి పండిత లోకానికి కాదర్శప్రాయులుగా , భాషా పోషకులుగా ప్రశస్తిగాంచిన సత్యనారాయణ చౌదరి గారికి జోహారులు.వీరు బాల్యమాది విద్యావ్యాసంగమున సంపాదించిన సాహిత్యంసజ్జన సమ్మాన్యము సూరి జనస్తుత్యమునైనది. వీరు వైదిక వాఙ్మయమును తొలుత రచించి ధర్మశాస్త్రాల మర్మమెలయించిరి . వివిధ నీతి కధాసారాల వెలార్చి విమర్శకాగ్రేసరులగుటయే గాక తమ దైవభక్తిని , గురుభక్తిని ,దేశభక్తిని ,ప్రకటించుకొని మహాకవీంద్రులైరి. సత్యనారాయణ గారి వచన రచనా విధానము అనుసర ణీయము, ఆదర్శప్రాయమునైనది. అలతియలంతి వాక్యాలతో కధాగమనము సాగించుటలో వీరి భాషాపటిమ యాంధ్రినలంకరింపచేసినది.సరళము , సరసము , శయ్యా సౌలభ్యముగల వచన రచన సాగించిన కవులలో ప్రధమ శ్రేణికి చెందినవారు. గద్యంకవీనాం నికషం వదన్తి అనునాశయమునుప్రధానాంశముగ నేర్పరచుకొనియే ముమ్మొదట గద్యరచనమునే సాగించిరి. అనువాదాలతో అర్ధౌచితిని భావ గాంభీర్యమును పొందుపరచుకొని యందముగావీరిరచనకొనసాగినది. పఠనాసక్తి విమర్శనాశక్తి విస్తరిల్లిన యనంత్రము పద్యరచన ప్రారంభించిరి.వీరు పురాణాంశాలలోని వింతలను, విశేషాలను వివరించి తమ భావాల వెల్లడించుటలో నొకింతేని సంశయం పడని విద్వన్నణులై, ఆయాకాలమందలి ధర్మాలలోని మర్మాల పరిశీలించిన పండిత ప్రకాండులై, పద్య కవితారీతుల నాంధ్రలోకానికందించిన కవివరేణ్యులై, కళాప్రపూర్ణులై, సత్కీర్తి నార్జించుకొనిరి. నిరంకుశాఃకవయః అను సూక్తి లోని సూనృతమును గ్రహించి భారత రామాయణాదు లంగలకధాంశాల గైకొని విషయ పరిశీలన మొనర్చి విజ్ణలోకానికే కనువిప్పు కలిగించిరి. విమర్శనము సైతము వితండ వాదమునకు పోక సశాస్త్రీయముగ సహేతుకముగా జరిపించిరి . ఇక వీరిరచనా విశేషాల కొలదిగ మాత్రమేపరిశీలించుదుము.కలిపురాణములోదుర్యోధనునిదొరతనమునువర్ణించుచు , "ఈకతలన్నీవాస్తములేయని యెంచగ వచ్చు ద్రొల్లియాయాకవులెందరో తమ మహాకృతులందు వచించువానినే వ్రాసి చూపితిని గాని మదీయ కవిత్వ కల్పనా పాకము గాదు" , అని తమ కవితారీతులకు గల కారణాల వెల్లడించి కల్పనలలో యదార్ఠము లోపించినదని వక్కాణించిరి. మరియు "కవియగువాడు దాస్యమును కర్మము కాలి కవిత్వధోరణిన్ భువి వెలయింప జ్రొచ్చిన పూర్వ విశేషముతోడి పక్షపాత విధము లెస్సగా బొరయు, దానిని భారతగాధ సాక్ష్యమేయవును" , అని కవిపక్షపాతము వహించిన కలుగు దోషమును నిరూఊపించిరి . మరొకచోట "ఆవేశములేక ధర్మము వివేచన సేసిన నిగ్గు తేలెదిన్," అని లోకమునే నిగ్గు తేల్చవలసినదిగా నుగ్గడించిరి . ఇట్లే వేరొక వర్ణనమున , "ఎదోగికురించి పూతలు సమున్నత ధోరణి బూయుచుండు, నాయా కధలిట్టి వానికనయంబును బ్రాత్రములై వెలింగెడిన్,"అని తమ సునుశిత సువిశాల ధోరణిని సువ్యక్తమొనర్చిరి.ఒకచో భీక్ష్ముని కధను వర్ణించుచు , "కుమారిలభట్టు దొట్టివిఖ్యాతుల శాస్త్రవేత్తలు ప్రకాశము సేసి సకారణంగా నీతని నీతినెన్నరిది యీప్రజబుధ్ధినెఋంగ దేలొకో," అని పెద్దలు శాస్త్రవేత్తలగు వారి నుదాహరించిగాధల లోని గకావికలకు చీకాకు చెందిరి.ఇంకొకచో క్షేత్ర బీజాల విభిన్న మార్గపు పోకడల దలంచి , "పురాణగాధలన్ యోజన చేసి చూడవలె నోరిమి దీక్షయు బూని నెవ్వడేన్ ," అని యనూచానముగా వ్యాప్తమగు గాధల యెడ నుండవలసిన దీక్షను సూక్ష్మబుధ్ధిని విశద పరచిరి . ఒకచో వ్యాస సుతుల లోని విభేదమును చర్చించుచు , "ఇట్లే సరిపెట్టుకొంచు కధ లెన్నియో గాసట బీసటయ్యెడిన్," అని ఏ చోటున కాచోట సమన్వయించుకొని కాలమును కాపురుషులను సరిదిద్దుకొని పోవువారిని గూర్చిన సమాచారాల సన్నిహిత పరచిరి.వ్యాసుని ఘట్టాలను వర్ణించుచు , " ఈ విధమున వ్యాసమౌని యవివేకము సూపి యధర్మ కార్యమయ్యదనువ జేసె,వీడొక మహాత్ముడె వేద విభాగకర్తయే, " అని దిటవుగా చెప్పగలట్టి కవులెందరుందురో విజ్ణులూహించుకొందురు గాక?భారత ప్రశస్తి నొనర్చుచు , జయ శబ్ద నిర్వచన మొనర్చి అనల్ప కల్పనలు భారతాన చేరినవనియు యదార్ధ దృష్టి ప్రాకృత లోకాని కవసర మనియు ప్రబోధించిరి. వీరాస్తిక్య పరిజ్ఞానము కలవారేగాని మూఢముగ
విశ్వసించువారు కాదు. తమ భక్తిప్రపత్తుల నభివ్యక్త మొనర్చు కొనుచు , మ్రొక్కుబడి, మాస్వామి, వంటి గ్రంధ రాజాలను రచించిరి. సత్య నిరతిలో నిశ్చలాంతరంగాన నిరంతరం పరమాత్ముని ధ్యానింఛూటయే వీరి ప్రధానాశయం. అట్టి తలంపులున్నందున సూక్తులనుద్ధరించి సుకృతులుగా గణ్యత గాంచిరి .