"తేనె" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (→‎తేనెతో వైద్యం: AWB తో "మరియు" ల తొలగింపు)
[[తేనెటీగ|తేనెటీగలు]] పువ్వులనుండి సేకరించే తియ్యటి ద్రవ పదార్థాన్నే '''తేనె''' అంటారు. స్వచ్ఛమైన తేనె ఎన్నటికి చెడిపోదు, ఎందుకంటే [[పంచదార]] కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది [[బ్యాక్టీరియా]]ని చంపే స్తుంది. తేనెలో 14 నుంచి 18 శాతం వరకు తేమ ఉంటుంది. ఇందులో నీటి శాతం కూడా తక్కువగా ఉండటంతో పులియడం, పాడవడం జరగదు. 18 శాతంకన్నా తక్కువ తేమ ఉన్న పదార్థాల్లో సూక్ష్మ జీవులు కానీ ఏ ఇతర జీవులు కానీ పెరగలేవు. కానీ పిల్లలకు హాని కలిగించేంత మొత్తంలో సూక్ష్మ క్రిములు ఉండడానికి అవకాశం ఉంది. పంచదార కనిపెట్టకముందు మనిషి తొలిసారిగా తీపి రుచిని తెలుసుకుంది దీని ద్వారానే. మొట్టమొదటగా మద్యాన్ని తయారుచేసిందీ తేనెతోనే. [[ప్లేటో]], [[అరిస్టాటిల్]], [[డిమొక్రటిస్]]... లాంటి తత్త్వవేత్తలంతా తేనె వైశిష్ట్యాన్ని తమ గ్రంథాల్లో పేర్కొన్నారు. మన [[ఆయుర్వేదం|ఆయుర్వేదానికి]] తేనె ప్రాణం లాంటిది. [[శుశ్రుతసంహిత]] తేనెను తాగేమందుగా వర్ణించింది, [[శ్వాసకోశవ్యాధులు|శ్వాసకోశవ్యాధుల]]కు మధువును మించిన దివ్యౌషధం లేదని చెప్పింది.
 
==తేనె చరిత్ర : history of honey==
 
ప్రకృతి వరప్రసాదాల్లో తేనె ఒకటి. బహుశా ఎలాంటి కల్తీకి లోనుకానిది, బలవర్ధక ఆహారం కూడా ఇదేనేమో! స్వచ్ఛమైన తేనె ఆరోగ్య ప్రదాయిని. ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడే వాటిలో ఇది కూడా ఒకటి. ఒకప్పుడు అడవుల్లో మాత్రం లభించే ఈ తేనె ఇప్పుడు పట్టణాల్లో అదీ ఇళ్ల పెరడులో కూడా తయారవుతోంది. ఇలా కృత్రిమంగా జరిగే ఈ [[తేనెటీగల పెంపకం]], తేనె సేకరణ వల్ల తేనెపట్టుల్లో లభించే తేనె ప్రమాణం క్రమంగా తగ్గిపోతూ ఉంది. ఇక అడవుల్లో లభించే కాడు తేనె సంగతి సరేసరి. ఇప్పటికే సగానికి క్షీణించిన ఈ అడవి తేనె మరి కొన్ని సంవత్సరాలు గడిస్తే కనుమరుగే అవుతుందేమోననే భయాన్ని ప్రకృతి ప్రేమికులు వ్యక్తం చేస్తున్నారు. తేనె వాడకం ఈ నాటిది కాదు. అనాదినుంచి కూడా వాడుకలో ఉంది. శిలాయుగం చివర్లోనే అడవి తేనె సేకరణ జరిగిందని చెప్పడానికి ఆధారాలున్నాయి. అంటే సుమారు పది వేల సంవత్సరాల మొదలు, యాభై వేల సంవత్సరాల ముందునుంచి ఈ తేనె మాధుర్యాన్ని చవి చూస్తూ ఉన్నారని చెప్పవచ్చు. స్పెయిన్‌లోని వలెన్సియా అనే ప్రాంతంలోని గుహలో అడవి తేనె వేటకు సంబంధించిన చిత్రాలున్నాయి. ఇవి 8 వేల సంవత్సరాల నాటివని చారిత్రకులు నిర్ధారించారు కూడా.నిజానికి [[తేనెటీగ]] జీవన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసిన కీర్తి స్పెయిన్ శాస్తజ్ఞ్రుడు హ్యూబర్‌కు దక్కుతుంది. రెండు వందల సంవత్సరాల క్రితం స్వతహాగా గుడ్డివాడయినప్పటికీ భార్య, సహాయకురాలి సాయంతో రాణిఈగ తన గూడుకు చాలా దూరంలో ఉన్న మగ ఈగతో ఎలా సంపర్కం పెంచుకుంటుంది? [[తేనెపట్టు]]పై ఉన్న రంధ్రాల సైజును చూసి కూలి మగ ఈగలను, వాటి సంఖ్యను ఎలా గుర్తించవచ్చో హ్యూబర్ వివరంగా తెలియజేసారు. సహజంగా తూర్పు, పశ్చిమ కనుమల్లోని దట్టమైన అడవుల్లో సాధారణంగా కనిపించే అడవి తేనెటీగల రకాల్లో ఎపిస్ దోర్సలా, అపిస్ సెరెనా ఇండికా, ఎపిస్ ఫ్లోరియా, డ్యామెస్ బీ లేదా స్ప్రింగ్‌లెస్ బీ అనేవి ముఖ్యమైనవి. వీటికి తోడు ఐరోపానుంచి దిగుమతి చేసుకున్న ఎపిస్ మెల్లిఫేరా విదేశీ జాతి. ప్రపంచవ్యాప్తంగా కనిపించే తేనెటీగ రకాలు ఇవి. వీటిలో మొదటి రకం తేనెను సేకరించే వారు చాలా ఎత్తయిన చెట్లకు నిచ్చెనలు కడతారు. పక్కచెట్టునుంచి ఇంకో చెట్టుకు పొడవాటి తాడు వేసి దాటుతూ పోతూ రాత్రిపూట తేనెపట్టులను కొడుతూ ఉంటారు. గతంలో ఇలాంటి పెద్ద తేనెటీగల తేనెపట్టునుంచి 70 కిలోల దాకా తేనె లభించిన సందర్భాలు కూడా ఉన్నాయని దాదాపుగా 45 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉండిన శ్రీపతి భట్ అంటారు. అప్పట్లో సగటున ఒక్కో తేనెపట్టునుంచి 15నుంచి 20 కిలోల దాకా తేనె లభించేది. అది ఇప్పుడు 5నుంచి 10 కిలోలకు తగ్గిపోయిందంటారాయన. మిగతా రకాల తేనెలదీ అదే పరిస్థితి. పాతికేళ్ల క్రితం తేనెకు గిరాకీదారులే ఉండేవారు కాదు. చాలా దూరంనుంచి ఒకరిద్దరు దళారీలు వచ్చే వారు. ఒక్క [[ఉత్తర కన్నడ జిల్లా]]లోనే ఏడాదికి 400 టన్నుల తేనె లభిస్తూ ఉండేదని చాలా ఏళ్లుగా అటవీ ఉత్పత్తుల వ్యాపారం చేసే నాసిర్ ఖాన్ గతాన్ని గుర్తు చేసుకుంటూ అంటారు.
[[File:Honey తేనె.JPG|thumb|right|తేనె]]
 
==తేనె లో రకాలు :==
తేనె సంపూర్ణ పోషక పదార్ధమని, తిరుగులేని ఔషధ గుణాలు కలిగి ఉన్నదని తెలుసుకున్నాక దానిని సేకరించిన తీరు, నిలువచేసేందుకు వాడిన విధానాలబట్టి పలు రకాలుగా విభజించారు .
 
అడవి తేనె : ఇది అత్యంత సహజమైనది . అడవిలో లభించే అన్నిరకాల పూలనుండి తేనెటీగలు మకరందాన్ని సేకరిస్తాయి గకుక చాలా మంచిది .
 
ఒకే పూవు తేనె : ఇది తేనెటీగల పెంపకం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది . ఒక్కొక్క తరహా పూల మకరందము ఒక్కో రుచిలో ఉంటుంది . తేనెటీగలకు ఏదో ఒక రకమైన పూలమొక్కలను మాత్రమే అందుబాటులో ఉంచడం ద్వారా దీనిని తయారు చేస్తారు .
 
మిశ్రమ తేనె : మార్కెట్ లో అధికంగా అమ్మే తేనె ఇదే. నాలుగయిదు రకాల తేనెలను భిన్నరుచులు, రంగులు కలిగినవి కలిపేస్తారు ఈ మిశ్రం తేనెలో . రంగు, రుచిని బట్టి రకరకాల పేర్లు పెడతారు .
 
పుట్ట తేనె : ఇది తేనె పట్టులను అలానే తీసుకువచ్చి అందులోని తేనెను సేకరించి వెనువెంటనె అందించేది . దీనిని తాజా తేనెగా భావించాలి .
 
నిలువతేనె : తేనెను నిలువ చేసేందుకు భిన్న విధానాలు ఉన్నాయి. పాలను పాశ్చరైజ్ చేసిన తీరునే తేనెను పాశ్చరైజ్ చేస్తారు . దానిలోని సూచ్మజీవులను తొలగించి, దానిలోని ఎంజైమ్‌ ల చర్యలను పరిమితం చేయడం ద్వారా తేనె ఎక్కువకాలము నిలువ ఉంచేలా చే్స్తారు . ఈ ప్రక్రియలో తేనెను వేడిచేయడం జరుగుతుంది . వేడి చేయడం వల్ల కొన్ని నష్టాలున్నాయి . దానిని అధిగ మించేందుకు నేడు ఆల్ట్రాసొనిక్ తేనెను తయారుచేస్తున్నారు . దీనివలన తేనె పులియకుండా ఉంటుంది .
 
ఎండు తేనె : ఇది మరో ప్రత్యేకమైనది . తేనెను ఘన రూపమ్లో తయారుచేస్తారు . ఇది చిన్నచిన్న ముక్కలుగా వస్తాది . చేతికి అంటుకోదు .
 
==చెడు గుణాలు :==
 
తేనే సుద్దిచేయకుండా వాడకూడదు . దీనిలో అనేక సుక్ష్మ జీవులు ఉంటాయి . తేనే లోగల 'బొటులినియం ఎన్దోసపొర్స్" చిన్నపిల్లలకు హానిచేయును ... ఒక సం. లోపు పిల్లలకు వాడకూడదు. తుతిన్(tutin) అనేది విషపదార్దము - - శరీరమునకు మంచిదికాదు .
 
వృక్షాల సంతానోత్పత్తికి ప్రకృతి ఇచ్చిన వరాలలో మకరందం ఒకటి. మొక్కలలోని పూలకు మధ్యభాగంలో గ్రంధులద్వారా స్రవిస్తూ ఉంటుంది. ఈ గ్రంధులు పూల కేసరాల మొదటి భాగంలో ఉంటుంది. [[కీటకాలు]] మకరందం కోసం పూలమీద వాలినపుడు కీటకాల శరీరానికి అంటిన [[పుప్పొడి]] సంపర్కం చేందటం ద్వారా మొక్కలలో సంతానోత్పత్తి జరుగుతుంది. మకరందం సామాన్యంగా మాంసాహార కీటకాలను ఆకర్షిస్తుంది కనుక అవి మకరందాన్ని సేవిస్తూ చుట్టుపక్కన తిరుగుతున్న మొక్కలను తినే పురుగులను తింటాయి దానివలన మొక్కలు నాశకారక కీటకాలనుండి రక్షింపబడతాయి. మకరందాన్ని సేకరించి తేనెటీగలు తేనె తయారు చేస్తాయి. మకరందంలో [[చక్కెర]] పాలు ఎక్కువగా ఉంటుంది. అదీ కాక మొక్కలలోని ఔషధ గుణాలు కూడా ఉంటాయి కనుక దీనిద్వారా తయారైన తేనెలో ఔషధ గుణం కలిగి ఉంటుంది.
 
==తేనె (Honey) కల్తీ అవుతుంది :==
 
ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ద ఔషధం "తేనె". తేనెలో ఉన్న ఔషధ గుణాలు అన్నీఇన్నీ కావు. మరి అలాంటి ఔషధం నేడు విషంగా మారిందా..?! అవుననే అంటున్నాయి తాజా పరిశోధనలు. "అన్ని రోజులు ఒకలా ఉండవు" అన్న సామెత మాదిరిగా "అన్ని కంపెనీల తేనెలు ఒకలా ఉండవు" అని చెబుతున్నారు పరిశోధకులు. ప్రముఖ దేశీయ, విదేశీయ బ్రాండ్లు "ప్యూర్ హనీ" అంటూ విక్రయిస్తున్న తేనెలో అధికశాతంలో యాంటీబయొటిక్స్ ఉంటున్నాయని, వీటి వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఉందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) హెచ్చరిస్తోంది. కొన్ని భారతదేశపు బ్రాండ్‌లలో ఉండాల్సిన దానికన్నా అధికంగా రెండు నుంచి నాలుగు వరకూ యాంటీబయొటిక్స్ ఉన్నాయని సీఎస్ఈ కాలుష్య పర్యవేక్షణ ల్యాబొరేటరీ కనుగొంది. ఇవే కాకుండా ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన విదేశీ బ్రాండ్లు కూడా తేనెలో మోతాదుకు మించి యాంటీబయోటిక్స్ వాడుతున్నారని సీఎస్ఈ తెలిపింది. ఇప్పటి వరకూ 12 కంపెనీలకు చెందిన తేనెలను పరిశీలించిన సీఎస్ఈ వాటిల్లో ఆరు రకాల యాంటీబయోటిక్స్ వాడినట్లు గుర్తించింది. "అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. భారతీయ కంపెనీలు విదేశాలకు ఎగుమతి చేసే తేనెలో మాత్రమే యాంటీబయోటిక్స్‌ను వీలైనంత వరకూ నియంత్రిస్తున్నాయి. కానీ మన దేశంలో ఉపయోగించే వాటిలో మాత్రం ఎటువంటి నియంత్రణ లేదు. ఇందుకు నిర్లక్ష్యం ఒక్కటే కారణం." ఐరోపా, అమెరికా వంటి దేశాల్లో తేనె ఉత్పత్తులకు కఠినమైన, నిర్ధిష్టమైన నిబంధనలు ఉంటాయి. కానీ మన దేశంలో ఇవేమి ఉండవు. అందుకే చాలా వరకూ విదేశాల్లో భారతీయ తేనె ఉత్పత్తులను నిషేధిస్తున్నారని సీఎస్ఈ డిప్యూటీ డైరెక్టర్ చంద్రభూషణ్ అన్నారు. ఇందుకు పెద్ద ఉదాహరణే.. భారత ఎగుమతుల తనిఖీ కౌన్సిల్ (ఈఐసీ) విదేశీ మార్కెట్‌లో విడుదల చేసే తేనె ఉత్పత్తులలో నిర్ణీత యాంటీబయోటిక్స్ మాత్రమే వాడాలని షరతులు పెట్టింది. కానీ దేశీయ మార్కెట్‌లో విక్రయించే తేనె ఉత్పత్తులకు మాత్రం ఎలాంటి నిబంధనలు లేవు.
 
==తేనె వాడకూడని సందర్భాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3221486" నుండి వెలికితీశారు