"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

== చంద్రకాంతరావు గారూ సమయమనం పాటించండి ==
[[వాడుకరి:C.Chandra Kanth Rao|చంద్రకాంత రావు]] గారూ, పైన [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]] గారు రాసినది చూసాక, ఆయన మాట మీద గౌరవముంచి నేను ఇక ఇక్కడ ఏమీ రాయకూడదని భావించాను. ఆయన మాటను మీరు కూడా గౌరవిస్తారని అనుకున్నాను. కానీ మీరు అలా చెయ్యలేదు. తప్పనిసరై ఇది రాయాల్సి వస్తోంది. "''అబ్బబ్బో రామారావు బాగా పనిచేస్తున్నాడా? ఇది ప్రపంచపు ఎన్నో వింతనో అది కూడా చెబితే బాగుండేది.''" అని రాసారు మీరు. ఇలా ఏకవచనంతో సంబోధించడం మర్యాద కాదు. రామారావు గారి పనిలో దోషముంటే ఆ దోషాలను ఎత్తి చూపవచ్చు, అందులో తప్పులేదు. కానీ ఇలా న్యూనత పరచడం తప్పు. వికీ నియమాల ప్రకారం ఇది ఆయన్ను పీడించడం (హరాస్‌మెంటు) కిందకి వస్తుంది. రావు గారూ, నాపై ఉన్న అక్కసుతో మీరు సంయమనం కోల్పోతున్నారు. వికీనియమాలను ఉల్లంఘిస్తున్నారు. ఈ చర్చలో నన్ను, ఇతరులనూ దూషించారు. జనరిక్ స్టేట్‌మెంట్లు ఇచ్చేసారు. ఏకవచనంతో సంబోధించారు. ఇంతమంది వాడుకరులు ఈ చర్చలో పాల్గొన్నారు గదా.. మీరు, అజ్ఞాత తప్ప మరెవరైనా ఇలా వ్యక్తిగత నింద చేసారా? ఇలా నిందించడం తప్పని ఇంతమంది చెబుతున్నప్పటికీ మీరు ఆపలేదు. వీటిపై వికీనియమాల ప్రకారం తగు చర్య తీసుకునే అవకాశం ఉంది, గమనించగలరు. దయచేసి ఇకనైనా ఆపండి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 19:37, 17 జూన్ 2021 (UTC)
: {{Ping|C.Chandra Kanth Rao}} గారూ, ఇప్పటికే ఈ చర్చలో పన్నెండుమంది నిర్వాహకుల్లో ఏడుగురు స్పందించారు.
:* [[వాడుకరి:K.Venkataramana]], [[వాడుకరి:రవిచంద్ర]] గార్లు మీరు చేస్తున్నది వ్యక్తిగత దాడి అనీ, క్రమం తప్పకుండా వికీపీడియాలో పనిచేస్తున్నవారిపై కనీస గౌరవం లేకుండా మాట్లాడడమనీ పలు విధాలుగా ఖండించారు. ఇక [[వాడుకరి:Rajasekhar1961]] గారు "ఇక్కడ చర్చలతో మనలో మనం పరిష్కరించుకోవలసిన విషయాలను వికీపీడియా పతనానికి దారితీసే విధంగా ప్రవర్తిస్తున్నాము. మీరు ఈవిధంగా ప్రతిసారి పురోగతిలో పాల్గొంటున్న వారందరి మీద; ప్రస్తుతం చదువరి మరియు యర్రా రామారావు గారి మీద నిందలు వేస్తున్నారు." అంటూ కలసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని మీకు హితవు చెప్పారు. అదే సందర్భంలో ఆయన ఒక బాధ్యతాయుతమైన నిర్వాహకునిగా ఈ నిందలను ఆపుచేయమంటూ "వికీపీడియా విస్తృత పరిధిని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కలిసి పోవడం మంచిది." అని సామరస్యపూర్వకంగా ఒక నిర్ణయం చేశారు.
:* ఇంత చేసినా మీరు ఇప్పటికీ తెలుగు వికీపీడియాలో నిత్యం పనిచేస్తున్న సభ్యులపై ఆధారాలు లేకుండా దాడిచేస్తూ, వారి కృషిని కొట్టిపారేస్తూ, అవమానిస్తూ వ్యక్తిగతదాడులు చేయడం ఏమీ బాగోలేదు. [[వాడుకరి:Pranayraj1985]] గారిని మీరు "ప్రణయ్ రాజ్, ఏమిటీ చెప్పేది? అసలు నిర్వాహకుడిగా మీ తెవికి సేవలేంటీ? అస్తమానం మీ రికార్డులే ధ్యాసే తప్ప నిర్వహణ గురించి ఏమైనా పట్టించుకున్న దాఖలాలున్నాయా?" అంటూ దాడిచేస్తున్నారు. ప్రణయ్‌రాజ్ గారు ఎంతో చిత్తశుద్ధితో చాలామంది చేయని విధంగా (ఆ చాలామందిలో దురదృష్టవశాత్తూ నేనూ ఉన్నాను) [[వికీపీడియా:నిర్వాహకుల పనుల సమీక్ష/ప్రణయ్‌రాజ్ వంగరి/2020 ఏప్రిల్ - 2020 సెప్టెంబరు|తన నిర్వాహకత్వ సమీక్షను]] క్రమం తప్పకుండా చేస్తున్నారు. "నా నిర్వాహకత్వం గురించి చెప్పేదేమైనా ఉంటే, ముఖ్యంగా విమర్శ ఉంటే, దీని చర్చా పేజీలో రాయండి." - అని ఆ పేజీలో రాసుకున్నారు కూడాను. ఈ సమీక్ష లింకు ప్రణయ్ రాజ్ గారు రచ్చబండలో ఇచ్చిన రోజే మీరూ రచ్చబండలో ఏవో చర్చలు చేశారు. మరి ఆ పేజీ చూసి, మీకేమైనా విమర్శలు ఉంటే ఆయన చర్చా పేజీలో రాసివుండొచ్చు కదా. అదేమీ చేయకుండా ఆయనను కించపరుస్తూ, న్యూనపరుస్తూ మాట్లాడడాన్ని వేధింపు అంటారు. మీరు ఇలాంటి వేధింపులు ఇంతకుముందు చేసివున్నారు. ఇంక మానెయ్యండి. ఇంతమంది చెప్తున్నారు మీకు. ఇది గౌరవంగా లేదు.
:* "అలాంటప్పుడు తెవికీని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నట్లుగా ఎందుకు పరిగణించరాదు!" అన్నారు. ఆయనవి స్వార్థ ప్రయోజనాలని దూషించడానికి మీరు చెప్పిన (అవాస్తవమైన) కారణం ఏమిటంటే ప్రణయ్ రాజ్ గారికి నిర్వహణపై ధ్యాస లేదన్నారు. ఆయనే నిర్వహణ స్వీయ సమీక్ష చేసుకున్నారని లింకు ఇచ్చాను. ఇప్పుడు మీరు రాసిన ఈ వాక్యాన్ని ఎలా పరిగణించాలి? మీకు వ్యక్తిగతంగా ప్రణయ్ రాజ్ గారికి వస్తున్న మంచిపేరుతో ఏదో సమస్య అయినా ఉందనుకోవాలి లేదంటే ఆయనను వేధించి బెదిరించి చర్చల్లో మాట్లాడనీయకుండా చేయాలనుకుంటున్నారని అయినా తీసుకోవాలి. ప్రణయ్ గారు నిర్వహణపై ఎంతో కృషిచేస్తున్నప్పుడు, మీరు పచ్చి అసత్యాన్ని ప్రచారం చేస్తుంటే - ఎంత సదుద్దేశం ఆపాదించి చూసుకున్నా మీరు చేస్తున్న పనిని ఇంతకన్నా వేరుగా విశ్లేషించలేము.
: '''మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నిరాధారమైన నిందలు, వ్యక్తిగత దాడులు మానుకోండి. వేధింపు ధోరణి వదులుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పటికే రాజశేఖర్‌ గారు వెలువరించిన నిర్ణయాన్ని కనీసం గౌరవించండి. మీరు ఆ నిర్ణయాన్ని గౌరవించినంత మాత్రాన మీకున్న విలువ తగ్గిపోదు, నిజం చెప్పాలంటే కాస్తో కూస్తో పెరుగుతుంది.''' దయచేసి గమనించండి. మీకు మీ ధోరణిలోని పొరబాటు ఏమిటో చాలా ఓపికగా, నా సమయాన్ని వెచ్చించి రాస్తున్నాను. ఇంతకన్నా మృదువుగా, గౌరవంగా ఈ విషయం మీకెవ్వరూ ఎత్తిచూపలేరు. రచ్చబండ గౌరవాన్ని ఇంతకన్నా పతనం చేసేలా రాతలు రాయవద్దని మిమ్మల్ని కోరుతున్నాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 05:06, 19 జూన్ 2021 (UTC)
 
== Wikimania 2021: Individual Program Submissions ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3222320" నుండి వెలికితీశారు