సామ్రాట్ విక్రమార్క: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
==కథ==
విక్రమార్క మహారాజు ఉజ్జయినిని రాజధానిగా చేసుకుని రాజ్యం చేసే రోజుల్లో ప్రతి యేటా తన జన్మదినోత్సవంనాడు ప్రజలందరినీ పిలిచి వారి కోర్కెలను తీర్చడం ఆచారంగా కొనసాగించాడు. అలాంటి ఒక సందర్భంలో ఒక మాయా సిద్ధుడు విక్రమార్కుని ఆశ్రయించి మదనగిరి పర్వతం మీద తాను చేస్తున్న మహాయాగాన్ని భేతాళుడు ధ్వంసం చేయడం వివరించి ఆ యాగపరిరక్షణను యాచించగా అతడు అభయమిస్తాడు. సిద్ధుని కోరిక ప్రకారం విక్రమార్కుడు ఒక అమావాస్యనాడు బయలుదేరి వెళ్ళి ఆ యాగ ధ్వంసం చేస్తున్న భేతాళుడితో యుద్ధం చేసి గెలుస్తాడు. విక్రమార్కుని పరాక్రమాన్ని మెచ్చుకున్న భేతాళుడు ఆ మాయాసిద్ధుని కపట నాటకాన్ని వివరించి, తాను యావజ్జీవము విక్రమార్కునికి బానిసగా ఉండిపోతాడు. తన యాగం నిర్విఘ్నంగా పూర్తిచేసుకున్న సిద్ధుడు విక్రమార్కుని బలి ఇవ్వదలచి అతడిని హోమ పురుషునికి నమస్కారం చేయమంటాడు. భేతాళుని వల్ల అసలు విషయం తెలుసుకున్న విక్రమార్కుడు సిద్ధుని ఆ నమస్కార విధానం చూపమని కోరగా అతడు నమస్కరించగానే విక్రమార్కుడు అతడిని కడతేర్చి హోమ పురుషుని వల్ల వరాలను పొందుతాడు.
 
విక్రమార్కుడు భేతాళుని సహాయంతో ఒక రోజు రాత్రి తన ప్రేయసి అయిన స్వర్గపురి రాకుమారి సౌగంధి మందిరం చేరతాడు. అప్పుడే తన ప్రియుడి గురించి కలలు కంటున్న సౌగంధి విక్రమార్కుని ఆహ్వానించి రాబోయే దశమినాడు జరగబోయే తన స్వయంవరం గురించి తెలిపి ఆహ్వానిస్తుంది.
 
==పాటలు==