సామ్రాట్ విక్రమార్క: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
 
విక్రమార్కుడు భేతాళుని సహాయంతో ఒక రోజు రాత్రి తన ప్రేయసి అయిన స్వర్గపురి రాకుమారి సౌగంధి మందిరం చేరతాడు. అప్పుడే తన ప్రియుడి గురించి కలలు కంటున్న సౌగంధి విక్రమార్కుని ఆహ్వానించి రాబోయే దశమినాడు జరగబోయే తన స్వయంవరం గురించి తెలిపి ఆహ్వానిస్తుంది. అదే సమయంలో కుశరీనగరును రాజధానిగా పరిపాలిస్తున్న ప్రచండసేన మహారాజు మహామాయావి. సౌగంధి అందచందాలను తెలుసుకున్న ప్రచండుడు ఆమెను ఎలాగైనా తన మహారాణిగా చేసుకోవాలని నిశ్చయిస్తాడు. తన పరివారంలోని చతురిక అనే పరిచారికను సౌగంధి వద్ద కొలువుకు కుదిరి తన గుణగణాలను ప్రచారం చేయంటాడు. విక్రమార్కునికి వెళ్తున్న ఆహ్వానాన్ని మార్గమధ్యంలోనే నిరోధించి స్వయంవరానికి హాజరౌతాడు.
 
స్వయంవరంలో ప్రియునికోసం వెదుకుతున్న సౌగంధి తనను నిర్లక్ష్యం చేయడం చూచి ప్రచండుడు ఉగ్రుడై తన మాయాజాలంతో తనను ఎదుర్కోవచ్చిన రాకుమారులను అందరినీ శిలలుగా మార్చి సౌగంధిని అపహరించుకుని పోతాడు. సౌగంధి స్వయంవర సమాచారం తెలియని కలతతో ఉన్న విక్రమార్కుని వద్దకు స్వర్ణపురి మహారాణి, చెలికత్తె వచ్చి జరిగిన ఆపద గురించి తెలియజేస్తారు.
 
==పాటలు==