సామ్రాట్ విక్రమార్క: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
 
వినోదుని భార్య ఐన దీపాలనాగి మిథిలానగరంలోని తన చెల్లెలు మదనమంజరికి ప్రచండుడితో వైరముందని, ప్రచండుని ఆయువుపట్లు ఆమెకు తెలుసునని చెప్పి ఆమె పేరిట ఒక ఉత్తరం ఇస్తుంది. ఆ ఉత్తరం తీసుకుని విక్రమార్కుడు వినోదునితో కలిసి బయలుదేరుతాడు. మార్గంలో ఒక గ్రామంలో జరుగుతున్న పొట్టేళ్ళ పందాన్ని విక్రమార్కుడు, వినోదుడు చూస్తూ ఉంటారు. జూదగాడైన వినోదుడు ఒక పొట్టేలుపై తన ప్రాణాన్ని పందెంగా ఒడ్డుతాడు. అతని పొట్టేలు ఓడిపోయి మరణిస్తుంది. స్నేహితుని రక్షించడానికి విక్రమార్కుడు ఆ పొట్టేలు శరీరంలో పరకాయప్రవేశం చేస్తాడు. అదను కోసం కాచుకుని ఉన్న భూషణుడు విక్రమార్కుని శరీరంలోకి ప్రవేశిస్తాడు.
 
మదనమంజరి ఉత్తరాన్ని తీసుకుని మిథిలా నగరానికి బయలుదేరిన మాయా విక్రముడు తరువాత ఏమి చేస్తాడు? స్నేహితుడికై సొంత శరీరాన్ని కోల్పోయిన విక్రమార్కుడు తన కార్యాన్ని ఎలా సాధిస్తాడు? ప్రచండుని చెరలో బందీ అయిన సౌగంధి గతి ఏమౌతుంది? అనే ప్రశ్నలకు సమాధానం పతాక సన్నివేశంలో తెలుస్తుంది.<ref name="పాటల పుస్తకం">{{cite book |last1=తాపీ ధర్మారావు |title=సామ్రాట్ విక్రమార్క పాటల పుస్తకం |date=1958 |pages=18 |edition=1 |url=https://indiancine.ma/documents/ALQ |accessdate=19 June 2021}}</ref>
 
==పాటలు==