వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1,343:
:* "అలాంటప్పుడు తెవికీని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నట్లుగా ఎందుకు పరిగణించరాదు!" అన్నారు. ఆయనవి స్వార్థ ప్రయోజనాలని దూషించడానికి మీరు చెప్పిన (అవాస్తవమైన) కారణం ఏమిటంటే ప్రణయ్ రాజ్ గారికి నిర్వహణపై ధ్యాస లేదన్నారు. ఆయనే నిర్వహణ స్వీయ సమీక్ష చేసుకున్నారని లింకు ఇచ్చాను. ఇప్పుడు మీరు రాసిన ఈ వాక్యాన్ని ఎలా పరిగణించాలి? మీకు వ్యక్తిగతంగా ప్రణయ్ రాజ్ గారికి వస్తున్న మంచిపేరుతో ఏదో సమస్య అయినా ఉందనుకోవాలి లేదంటే ఆయనను వేధించి బెదిరించి చర్చల్లో మాట్లాడనీయకుండా చేయాలనుకుంటున్నారని అయినా తీసుకోవాలి. ప్రణయ్ గారు నిర్వహణపై ఎంతో కృషిచేస్తున్నప్పుడు, మీరు పచ్చి అసత్యాన్ని ప్రచారం చేస్తుంటే - ఎంత సదుద్దేశం ఆపాదించి చూసుకున్నా మీరు చేస్తున్న పనిని ఇంతకన్నా వేరుగా విశ్లేషించలేము.
: '''మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నిరాధారమైన నిందలు, వ్యక్తిగత దాడులు మానుకోండి. వేధింపు ధోరణి వదులుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పటికే రాజశేఖర్‌ గారు వెలువరించిన నిర్ణయాన్ని కనీసం గౌరవించండి. మీరు ఆ నిర్ణయాన్ని గౌరవించినంత మాత్రాన మీకున్న విలువ తగ్గిపోదు, నిజం చెప్పాలంటే కాస్తో కూస్తో పెరుగుతుంది.''' దయచేసి గమనించండి. మీకు మీ ధోరణిలోని పొరబాటు ఏమిటో చాలా ఓపికగా, నా సమయాన్ని వెచ్చించి రాస్తున్నాను. ఇంతకన్నా మృదువుగా, గౌరవంగా ఈ విషయం మీకెవ్వరూ ఎత్తిచూపలేరు. రచ్చబండ గౌరవాన్ని ఇంతకన్నా పతనం చేసేలా రాతలు రాయవద్దని మిమ్మల్ని కోరుతున్నాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 05:06, 19 జూన్ 2021 (UTC)
::: నిర్వహణ అంటే కేవలం స్వీయసమీక్ష చేసుకోవడం కానేకాదు. 10-15 సం.ల క్రితం నిర్వహణ ఎలా ఉండేదో, నిర్వాహకుల కృషి ఎలా ఉండేదో, అప్పుడు తెవికీని పాఠకులు బ్రహ్మరథం ఎందుకు పట్టారో, అప్పటి వ్యాస నాణ్యత, సభ్యుల కృషి, నిర్వాహక పనులు గురించి తెలుసుకోవడం మంచిది. '''ఇప్పుడు తెవికీ చచ్చిపోయింది'''. కొన ఊపిరితో ఉన్న తెవికీని హతమార్చిన ఇద్దరెవరో అందరికీ తెలుసు. '''ఇన్నేళ్ళ తెవికీ సభ్యుల కృషి బూడిదలో పోసిన పన్నీరైంది'''. ఇప్పుడు పనిచేస్తున్న వారి కృషి ఎలాగూ పనికిరాదు. దీనికి ఒకటే పరిష్కారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్వాహకులందరూ రాజీనామా చేసి వెళ్ళిపోతే అర్జున, వెంకటరమణ లాంటి వారితో కొద్దికొద్దిగా తెవికీని పుంజుకొనే అవకాశం అంది. అందుకు నాలాంటివారి సహకారం ఉంటుంది. కాని తెవికీ అభివృద్ధి దృష్ట్యా ఆలోచిస్తేనే ఈ పని అవుతుంది. పదవులపై ధ్యాస ఉంటే మాత్రం తెవికీ సమాధికే అంటే చరిత్రకే పరిమితం. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 00:24, 20 జూన్ 2021 (UTC)
 
== Wikimania 2021: Individual Program Submissions ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు