గ్రామ దేవత: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
== పోషణ, రక్షణ నిచ్చే దేవతలు==
[[File:Diety reliefs at Village Outskirts in Rajula Tallavalasa, Visakhapatnam district.jpg|thumb|250px|విశాఖ జిల్లాలో ఒక గ్రామ దేవత ప్రతిరూపాలు పూజింపబడుతున్నవి]]
ఇక ప్రజల మనసులో పుట్టి ఏ కోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరంచి భక్తులకు అండగా నిలిచే తల్లి '''తలుపులమ్మ'''. తలపు అంటే ఆలోచన వాటిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమముగా ఈమె 'తలుపులమ్మ'గా మారింది. ఇంట్లో నుండి బయటికి వెల్లేటపుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు. వూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో వుండేతల్లి '''పొలిమేరమ్మ''' క్రమముగా '''పోలేరమ్మ''' అయింది. పొలిమేరలో వుండే మరొక తల్లి '''శీతలాంబ'''. ఈమె చేతుల్లో [[చీపురు]], [[చేట]] ఉంటాయి. తన గ్రామంలోని ప్రజలకు వ్యాదులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిచాచ గణాలను గ్రామంలోనికి రాకుండా వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈదేవతే. 'ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము అందుకే 'ఎల్లమ్మ' కూడా ఈ పనిని చేసేదన్నమాట. ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోసించే తల్లి 'పోచ+అమ్మ=పోచమ్మ' అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే, పోచమ్మ పోషణ కలిగిస్తుంది. ఇక పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి '''పుట్టమ్మ''' ఈమె [[దేవాలయం|గుడి]]లో అనేక పుట్టలుంటాయి. అక్కడే సుబ్రహ్మణ్య షష్టికి అందరూ పుట్టలో పాలు పోస్తారు. ఈ తల్లికే 'నాగేశ్వరమ్మ' అని కూడా అంటారు. పాము+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి పాపమ్మ అని కూడా అంటారు. [[సుబ్రహ్మణ్య స్వామి|సుబ్రహ్మణ్యేశ్వరుడు]] పేరుమీదే 'సుబ్బ+అమ్మ=సుబ్బమ్మ కూడా దైవముగా ఉంది.
 
==గ్రామదేవతా నామ విశేషాలు ==
"https://te.wikipedia.org/wiki/గ్రామ_దేవత" నుండి వెలికితీశారు