అక్కినేని నాగ చైతన్య: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి clean up, replaced: సునీల్సునీల్
పంక్తి 41:
నాగ చైతన్య నటించిన మొదటి సినిమా [[దిల్ రాజు]] నిర్మాణంలో వాసు వర్మ [[దర్శకుడు|దర్శకత్వంలో]] వచ్చిన [[జోష్]]. ఈ సినిమా ద్వారా నటి రాధ కూతురు కార్తీక నటిగా పరిచయమైంది. ఈ సినిమా ఆశించదగ్గ విజయం సాధించనప్పటికీ, చైతన్యకు ఉత్తమ నూతన నటుడిగా [[ఫిలింఫేర్]] మరియ, [[నంది పురస్కారాలు|నంది]] అవార్డులను పొందాడు. కానీ 2010లో తను అతిథి పాత్రలో నటించిన విన్నైతాండి వరువాయా సినిమా యొక్క [[తెలుగు]] పునః నిర్మాణం ఐన [[ఏ మాయ చేశావే]] చైతన్యకు మొదటి భారీ విజయాన్ని అందించింది. గౌతం మీనన్ దర్శకత్వంలో [[సమంత]] కథానాయికగా తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రంలో చైతన్య తన నటనకు విమర్శకులనుంచి ప్రశంసలందుకున్నాడు. నేటికీ తెలుగు సినిమాల్లోని ఎన్నో క్లాసిక్స్ లో ఒకటిగా ఈ చిత్రం నిలిచిపోయింది. ఈ సినిమాకి చైతన్యకు ఉత్తమ నటుడికి గాను ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.
 
ఆ తర్వాత 2011లో [[సుకుమార్]] దర్శకత్వంలో [[100% లవ్]] సినిమాలో నటించాడు. ఇందులో [[తమన్నా]] కథానాయిక. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించింది. కానీ ఆ తర్వాత అజయ్ భుయాన్ దర్శకత్వంలో [[కాజల్ అగర్వాల్]] కథానాయికగా తెరకెక్కిన తన చిత్రం [[దడ]], వివేక్ కృష్ణ దర్శకత్వంలో [[అమలాపాల్]] కథానాయికగా తెరకెక్కిన బెజవాడ సినిమాలు పరాజయాన్ని చవిచూసాయి. నాగ చైతన్య దేవ కట్ట దర్శకత్వంలో సమంత సరసన ఆటోనగర్ సూర్య, కిషోర్ పార్థాసాని దర్శకత్వంలో [[ఇందుకూరి సునీల్ వర్మ|సునీల్]], తమన్నా, ఆండ్రియా సరసన తడాఖా, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మనం, వీరూ పోట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాల్లో నటించాడు. వాటిలో చెప్పుకోదగ్గ చిత్రం 'మనం'. ఈ చిత్రంలో స్వర్గీయ [[అక్కినేని నాగేశ్వరరావు]] నటించడంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఎక్కువయ్యాయి. అయితే, ఈ చిత్రం పూర్తి కాకుండానే, ఎ.ఎన్.ఆర్ చనిపోవడంతో, 'మనం' సినిమా అంచనాలకు మించి, బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టించింది. ఆ తర్వాత 2014 చివర్లో 'ఒక లైలా కోసం'తో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 2015లో [[సుధీర్ వర్మ]] దర్శకత్వంలో '[[దోచేయ్]]' అనే సినిమా చేసినప్పటికీ అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. 2016లో మలయాళం రీమేక్ అయిన 'ప్రేమమ్' సినిమాతో మరొక విజయాన్ని అందుకున్నాడు. ఆ వెంటనే [[గౌతమ్ మీనన్]] దర్శకత్వంలో [[సాహసమే శ్వాసగా సాగిపో]] అనే చిత్రంలో నటించి ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. 2017లో [[రారండోయ్ వేడుక చూద్దాం]] మళ్ళీ ఘన విజయం సాధించింది. 2018లో విడుదల అయిన [[శైలజారెడ్డి అల్లుడు]] విజయం సాధించింది. 2018లో విడుదల అయిన [[సవ్యసాచి]] సినిమా ప్లాప్ అయింది. 2019లో [[సమంత అక్కినేని]] తో నటించిన [[మజిలీ]] చిత్రంతో అతి పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 2019 డిసెంబర్ లో తన మామయ్య అయిన [[దగ్గుబాటి వెంకటేష్]] తో కలిసి నటించిన [[వెంకీ మామా]] సినిమా తో మరొక విజయాన్ని అందుకున్నాడు.
 
==వ్యక్తిగత జీవితం==
పంక్తి 122:
|-
|2018
|[[సవ్యసాచి (2018 సినిమా)|సవ్యసాచి ]]
|
|తెలుగు