చర్చ:కాకతీయులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
==కాకతీయులు కర్ణాటక==
కాకతీయుల పూర్వీకులు కర్ణాటక నుండి ఆంధ్రదేశానికి వలస వచ్చిన విషయం మార్పుచేర్పులలో తొలగిపోయినట్టుంది. అది చేర్చగలరు. ఇది ఆంధ్ర చరిత్రకారుల్లో పి.వి.పరబ్రహ్మ శాస్త్రి రచించిన కాకతీయులు పుస్తకంలో ఉంది. ఈయన్ను కన్నడ పక్షపాతి అని కొట్టివేయలేము..ఎందుకంటే శాతవాహనులు ఆంధ్రులని ఋజువు చేసింది ఈయనే --[[సభ్యులు:వైజాసత్య|వైజాసత్య]] 12:43, 16 జూలై 2008 (UTC)
 
==కాకతీయుల పుట్టుక==
 
నేను తెలుగు విశ్వవిద్యాలయము వారు ప్రకటించిన విజ్ఞాన సర్వస్వము-చరిత్ర సంపుటము నుండి మరియు దుర్గాప్రసాద్ గారి ఆంగ్ల పుస్తకము నుండి సమాచారము సేకరించాను. కాకతీయుల పుట్టుక చాలా వివాదాస్పదము.
 
* చరిత్రకారుల అభిప్రాయము కాకతీపురము ఒరుగంటికి పాతపేరు.
* అలాగే 'రాష్టకూట' అను పదము విశ్వాసపాత్ర్రులైన కాకతీయుల పూర్వీకులు తమ పేరుకు చివర వ్రాసుకున్నారు. మరొక ఉదాహరణ: వెలనాడు, కమ్మనాడు లోని పలువురు తెలుగు నాయకులు తమిళ చో(ళు)డులకు విధేయులై వారి పేర్ల చివర 'చోడ' అని వ్రాసుకున్నారు.
* రాష్ట్రకూటులు ఉత్తర భారతమునుండి వచ్చిన ఆర్య సూర్యవంశ క్షత్రియులు. కాకతీయులు ద్రావిడులు, శూద్రులు మరియు దుర్జయ వంశము వారు.
* కాకతీయుల పేర్లు అచ్చ తెలుగు పేర్లు. ఉదా: ఎర్ర, గుండ, బేత, ప్రోల మొదలగునవి.
వీటినిబట్టి కాకతీయులు తెలుగు, కర్ణాట దేశముల సరిహద్దు ప్రాంతములకు చెందిన తెలుగు వారని చెప్పవచ్చును.[[సభ్యులు:Kumarrao|Kumarrao]] 11:50, 17 జూలై 2008 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:కాకతీయులు" నుండి వెలికితీశారు
Return to "కాకతీయులు" page.