ఆర్థర్ కాటన్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 65:
(మాకు గోదావరి నదీ స్నాన పుణ్యాన్ని కలిగించిన అపర భగీరధుడు, ఆంగ్ల దేశీయుడైన కాటన్ దొరగారిని ప్రతినిత్యం స్మరించి తరిస్తున్నాము. అని ఈ శ్లోకానికి తాత్పర్యం)
 
అని పఠించేవారు.<ref name="mandali">{{Cite wikisource|title=లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు|chapter=తెలుగు భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ |author=మండలి బుద్ధ ప్రసాద్|year=2010 }}</ref> అంతటి గౌరవాన్నిపొందాడు
===కాటన్‍మ్యూజియం===
[[File:Cotton museum-dhavalesvaram.JPG|thumb|కాటన్ మ్యూజియం, ధవళేశ్వరం]]
కాటను దొర చేసిన సేవలను గుర్తుంచుకొని [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వం ఆయనపేరుమీద ఒక మ్యూజియం ఏర్పాటు చేసింది. ఈ మ్యూజియాన్ని [[ధవళేశ్వరం ఆనకట్ట]]కు దగ్గరగా, కాటన్‍దొర ఆనకట్ట కట్టునప్పుడు కార్యాలయంగా ఉపయోగించిన అలనాటి భవనంలో ఏర్పాటుచేసారు. రెండంతస్తుల భవనమిది. రాతిగోడలకట్టడం, పైకప్పు పెంకులతో నిర్మించబడింది. భవనంచుట్టూ ఆవరణలో పూలమొక్కలు, ఫెన్సింగు మొక్కలు ఉన్నాయి. మ్యూజియం ఆవరణమీదుగా, మ్యూజియం భవనానికి అతిచేరువగా ఆనకట్టకు వెళ్ళు రహదారి వంతెన (ఫ్లైఒవర్) ఉంది. ఈవంతెన క్రింది ఖాళీ భాగంలో ఆనకట్ట నిర్మాణంలో వాడిన 160 సంవత్సరాలనాటి పురాతన యంత్రాలు (రివెటింగ్ యంత్రం, స్టీం బాయిలర్లు, కంప్రెసర్లు, సానపట్టు యంత్రాలు, బోరింగ్ యంత్రాలను ఉంచారు. ముఖ్యభవనానికి కుడివైపున అలనాటి రెండు పిరంగులను ఉంచారు. మ్యూజియంలోని క్రిందిగదులలో, ఆనకట్టకు సంబంధించిన వివరాలు, కొన్ని నమూనాలు ఉన్నాయి. మధ్య హాలులో ఆనకట్ట నిర్మాణానికిచెందిన చిత్రాలతో కూడిన వివరాలున్నాయి. మరొక హాలులో కాటన్ దొర జీవిత విశేషాలు వివరించిన ఫలకాలున్నాయి. మరొక హాలులో [[గోదావరి నది]] రాజమహేంద్రవరం నుండి, సముద్రంలో కలియు వరకు నమూనా ఉంది. ఈ నమూనాకు వెనుక గోడపై, ఆనకట్ట నిర్మాణవిశేషాలు, ఎన్నిఎకరాలకు నీరందుతున్నదనే వివరాలు ఉన్నాయి. పై అంతస్తులో ఆంధ్రప్రదేశ్ లోని ఇతరప్రాజెక్టుల వివరాలు, కొన్ని నమూనాలు, కాటన్ ఆధ్వర్యంలో ఇతరచోట్ల జరిగిన పనుల చిత్రాలు ఉన్నాయి. దిగువ గదిలో కాటన్ దొర మునిమనుమడు ఈ మ్యూజియాన్ని సందర్శించినప్పుడు<ref name="mandali" /> వ్రాసిన స్పందన చిత్రము ఉంది. కాటన్ వివిధ వయస్సు లలోని చిత్తరువులు, తల్లిదండ్రుల చిత్రాలు, కాటన్ అర్ధాకృతి విగ్రహం ఉన్నాయి. మ్యూజియం బయట అవరణలో గోదావరినది [[నాసిక్]] లోపుట్టి [[బంగాళాఖాతం]]లో కలియువరకు చూపించే నమూనాకలదు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆర్థర్_కాటన్" నుండి వెలికితీశారు