ఆర్థర్ కాటన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వనరులు: వనరులు శుద్ధి
పంక్తి 50:
==కృషి==
{{main|ధవళేశ్వరం ఆనకట్ట}}
కాటన్ ముఖ్యంగా కృషి చేసి విజయాన్ని సాధించిన ప్రాజెక్టులలో [[గోదావరి]] పై [[ధవళేశ్వరం ఆనకట్ట]], కాలువల నిర్మాణం మొదటిదిగా చెప్పవచ్చు. ఈ కాలువల విభజన, అన్ని ప్రాంతాలను కలుపుతూ సాగే విస్తరణ, ఒకప్పుడు వ్యవసాయంలో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి పరీవాహక జిల్లా లను అత్యంత అభివృద్ధి, అధిక వ్యవసాయ దిగుబడులు కల జిల్లాలుగా మార్చివేసినవి. కాటన్ 1836 - 38 సంవత్సరాలలో '''కొలెరూన్''' నదిపై ఆనకట్టను నిర్మించాడు. దానితో తంజావూరు జిల్లా మద్రాసు రాష్ట్రంలోనే కాక, యావత్భారతదేశంలోనే ధనధాన్య సమృద్ధికి ప్రథమ స్థానం పొందింది. ఆ తర్వాత 1847 - 52 సంవత్సరాలలో గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తిచేశాడు. క్షామపీడితమైన గోదావరి డెల్టా సస్యశ్యామలమై కలకలలాడింది. తగ్గిపోతున్న జనసంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఆరు లక్షల ఎకరాల భూమి సాగు కిందికి వచ్చింది. ఈ మహత్కార్యాన్ని ఆయన కేవలం అయిదేళ్ళలో పూర్తి చేశాడు. [[కృష్ణా|కృష్ణానదిపై నది]]పై [[విజయవాడ]] వద్ద [[ప్రకాశం బేరేజిబ్యారేజి]] నిర్మాణానికి కృషి చేశాడు. ఇంతేకాక ఆయన [[బెంగాల్]], ఒడిసా, [[బీహారు]], మొదలైన ప్రాంతాల నదులను మానవోపయోగ్యం చేయడానికి ఎన్నో పరిశోధనలు, పరిశీలనలు చేశాడు. తెలుగు వారే కాదు [[తమిళులు]], ఒరియాలు, బెంగాలీలు, ఒరియాలు, బీహారీలు మొత్తం భారతీయులే ఆయనకు శాశ్వత ఋణగ్రస్తులు.
 
==స్మరణలు==
"https://te.wikipedia.org/wiki/ఆర్థర్_కాటన్" నుండి వెలికితీశారు