ఆర్థర్ కాటన్: కూర్పుల మధ్య తేడాలు

చి సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్టలోని వివరాలను ఇక్కడ తగిన చోట చేర్చాను
పంక్తి 33:
|accessdate=2021-06-24}}</ref>
1819లో మద్రాసు ఇంజనీరుల దళములో చేరి మొదటి బర్మా యుద్ధములో పాల్గొన్నాడు. 1861లో కాటన్ సర్‌ బిరుదాంకితుడైనాడు.
==తొలి జీవితం==
ఆర్థర్ కాటన్ 1803, మే 15న హెన్రీ కాల్వెలీ కాటన్ దంపతులకు పదవ కుమారునిగా జన్మించాడు. వివిధ వృత్తులలో స్థిరపడి జీవనం సాగించిన పదకొండు మంది సోదరులలో కాటన్ ఒకడు. 15 సంవత్సరాల వయసులో కాటన్ 1818లో మిలటరీలో క్యాడెట్ గా చేరి అడ్డిస్‌కాంబ్ వద్ద [[ఈస్టిండియా కంపెనీ]] యొక్క ఆర్టిలరీ, ఇంజనీరింగు సర్వీసులలో శిక్షణ పొందాడు. 1819లో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టెనెంట్ గా నియమితుడయ్యాడు. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ 18 ఏళ్ల వయసులో భారతదేశానికి వచ్చి మొదటిసారిగా మద్రాస్‌లో ఉద్యోగార్థం చేరాడు. అప్పటి బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీ ఈయనను దక్షిణ ప్రాంతానికి చెరువుల శాఖకు ఇంజనీర్‌గా నియమించింది. భారతదేశంలో జలవనరులను సమర్ధవంతంగా వినియోగించడానికి పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, నిర్మించాడు. 1899 జులై 14న ఆర్థర్ కాటన్ చనిపోయాడు. <ref name="narisetti"/>
==కృషి==
{{main|ధవళేశ్వరం ఆనకట్ట}}
పంక్తి 44:
ఫలితంగా కాటన్ పనులపై విచారణకు సెలక్టు కమిటీ నియమించారు. 1878లో లార్డ్ జార్జి హేమిల్టన్ అధ్యక్షతన ఏర్పడిన యీ సంఘం 900 పై చిలుకు ప్రశ్నలు వేసి, కాటన్ ను పరీక్షించారు. ఐనా నాడు కామన్స్ సభలో జరిగిన చర్చలకు పత్రికలలో జరిగిన వాదోపవాదాలకు, సెలక్టు కమిటీ ప్రశ్నలకు సమాధానం చెప్పి రాణించగలిగాడు కాటన్. కాటన్ తాను చేసిన పనిలో నమ్మకం ఉంచటమేగాక, ఫలితాలను ప్రత్యక్షంగా చూపగలగటమే కాటన్ ధైర్యానికి ఆస్కారమయింది. రైలుమార్గాలు వేసిన తరువాత వచ్చిన ఫలితాలనూ కాలువల వలన వచ్చిన వాటిని పోల్చి బాగోగులు చూపాడు.
 
1879-80లో కరువు విషయమై నియమించబడిన ఫామిన్ కమిషన్ కూడా సాగునీటి పథకాల అవశ్యకత, ప్రాధాన్యతను నొక్కిచెప్పి, కాటన్ వాదనను సమర్ధించాయి.
==స్మరణలు==
[[File:Arthan kaaTan.jpg|right|thumb|ఆర్ధర్ కాటన్ విగ్రహం, టాంక్ బండ్, హైదరాబాదు]]
* కాటన్ చాలా ముందుచూపుతో చేసిన కృషి వలన గోదావరివాసులకు బంగారుపంటల్ని యిచ్చిన వ్యక్తిగా చరిత్రకెక్కాడు. గోదావరి జిల్లా అసోసియేషన్ వారు కాటన్ కు "గోదావరి డెల్టా పితామహు"డని నామకరణం చేశారు. ఆయన పేరిట ఒక టౌన్ హాలు నిర్మించి తమ కృతజ్ఞత చూపారు.
 
* హైదరాబాదులో టాంక్ బండపై తెలుగు వెలుగులు సరళి విగ్రహాలలో కాటన్ విగ్రహం వున్నది.
* ఉభయగోదావరి జిల్లాల లోని చాలా గ్రామాలలో గుర్రముమీద స్వారీచేస్తున్న కాటన్ దొర, లేక అర్ధాకృతి కాటన్ విగ్రహం కనబడుతుంది.
"https://te.wikipedia.org/wiki/ఆర్థర్_కాటన్" నుండి వెలికితీశారు