వెంపటి సదాశివబ్రహ్మం: కూర్పుల మధ్య తేడాలు

సంసారం లింకు సవరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 38:
సదాశివబ్రహ్మం [[తూర్పు గోదావరి]] జిల్లాలోని [[తుని]] గ్రామంలో [[ఫిబ్రవరి 19]], [[1905]] సంవత్సరంలో వెంపటి బ్రహ్మయ్యశాస్త్రి, వెంకాయమ్మ దంపతులకు మూడవ కుమారుడిగా జన్మించాడు. వీరు [[పంచకావ్యాలు]] చదివి, [[ఆంధ్ర]], [[సంస్కృత]] భాషలలో అపారమైన పాండిత్యాన్ని సంపాదించారు. [[తిరుపతి వేంకటకవుల]] ప్రభావంతో అవధాన విద్యపై మొగ్గు చూపాడు. [[అష్టావధానాలు]], [[శతావధానాలు]] జరిపి, గద్య, పద్య రచనలు చేసి బాలకవిగా పేరుపొందారు.
 
ఎప్పుడూ ఎక్కడా ఓ చోట కాలు నిలవని సదాశివబ్రహ్మానికి పెళ్ళి చేస్తేనైనా ఇంటిపట్టున వుంటాడని భావించి, 1928 లో ఆయన 23 వ ఏట శ్రీకాకుళానికి చెందిన జానకమ్మతో పెళ్ళి జరిపించారు. అప్పటికామె వయస్సు ఎనిమిది సంవత్సరాలే. వివాహమయ్యాక ఆమెను [[తుని]]లో ఉంచి, తాను మాత్రం స్వాతంత్య్రోద్యంలోకి దూకాడు. ముఖ్యంగా రంపచోడవరం మొదలగు ఏజెన్సీ ప్రాంతాలలో [[అల్లూరి సీతారామరాజు]] నిర్వహించిన పితూరీలలో పాల్గొన్నాడు. ఆ తరువాత కాంగ్రెసు పార్టీలో చేరారు. 1930లోని [[ఉప్పు సత్యాగ్రహం]]లో పాల్గొని, కొన్ని నెలలు కారాగార శిక్ష అనుభవించాడు. జైల్లో [[దేశభక్తి]] పూరితమైన పద్యాలను, గేయాలను రాసి ఎలుగెత్తి ఆలపించేవాడట. ఆనాటి [[కాంగ్రెసుభారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] సభల్లో పాల్గొని, [[హరికథ]], ప్రక్రియలో ప్రబోధాత్మక కథాగానాలను ఆలపిస్తు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయటంలో తన వంతు పాత్రను నిర్వహించాడు.
 
==సినీ రచయితగా==