బాలగంగాధర తిలక్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) |
చి →భారత జాతీయ కాంగ్రెస్ తో సంబంధాలు: clean up, replaced: కాంగ్రెస్ → కాంగ్రెస్ |
||
పంక్తి 23:
== భారత జాతీయ కాంగ్రెస్ తో సంబంధాలు ==
తిలక్ 1890లో కాంగ్రెస్ లో సభ్యుడుగా చేరాడు. కానీ త్వరలోనే అతనుకు కాంగ్రెస్ మితవాద రాజకీయాలపై నమ్మకం పోయింది. స్వరాజ్యం కోసం పోరాటమే సరైన మార్గమని అతను నమ్మాడు. అప్పటివరకు [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] ప్రతి సంవత్సరం డిసెంబరు చివరివారంలో మూడు రోజులపాటు సమావేశమై బ్రిటిష్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను "pray, petition, protest" చెయ్యడానికే పరిమితమైంది. తిలక్ దాని గురించి చాలా ఘాటైన విమర్శలు చేశాడు: "మీరు సంవత్సరానికొకసారి మూడు రోజులపాటు సమావేశమై కప్పల మాదిరి బెకబెకలాడడం వల్ల ప్రయోజనం లేదు." అని, "అసలు కాంగ్రెస్ సంస్థ అడుక్కునేవాళ్ళ సంఘం (బెగ్గర్స్ ఇన్స్టిట్యూషన్)" అన్నాడు. కాంగ్రెస్ సమావేశాలను ''3-డే తమాషా''గా అభివర్ణించాడు. "స్వరాజ్యం నా జన్మహక్కు. దాన్ని నేను పొంది తీరుతాను." అని తీర్మానించాడు. [[1907]]లో మహారాష్ట్రలోని సూరత్‌లో జరిగిన సమావేశంలో [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] చీలిపోయింది. మితవాదులు కాంగ్రెస్ పై తమ పట్టును నిలబెట్టుకున్నారు. అతివాదులుగా పిలవబడే తిలక్, అతను మద్దతుదారులు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు. తిరిగి [[1916]]లో [[లక్నో]]లో జరిగిన సమావేశంలో అంతా ఒకటయారు. అదే సమావేశంలో కాంగ్రెస్ కు, [[ముస్లిం లీగు]]కు మధ్య లక్నో ఒప్పందం కుదిరింది.
== విద్యావిధానం ==
|