విజయలక్ష్మి పండిట్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: కాంగ్రెస్కాంగ్రెస్ (3)
పంక్తి 67:
మతవాదుల ఉద్యమాల వలన మోతీలాల్ అంతగా ఆకర్షించపడక పోయినా, [[1915]] వ సంవత్సరంలో జరిగిన హోంరూలు ఉద్యమము నుంచీ, మోతీలాల్ రాజకీయాలపైన ఆసక్తి యెర్పడింది. [[1915]] నాటికి [[అనిబిసెంట్]] దివ్యజ్ఞాన సమాజంలో ఉంది. అప్పతికి తిలక్ జైలు నుంచి విడుదలవటం జవహర్ లాల్ ఇంగ్లాండులో బారిష్టరు డిగ్రీతో ఇండియాకు వచ్చి న్యాయవాద వృత్తి ప్రారంభించటం, దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ రావటం లాంటివి జరిగాయి.
 
మోతీలాల్ రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచీ, [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] నాయకులు చాలామంది "ఆనంద భవనానికి" రాకపోకలు ఎక్కువ చేశారు. అందువలన స్వరూపరాణికి తండ్రి గారి మూలముగా చిన్నతనం నుంచే అఖిలభారత కాంగ్రెస్ నాయకులందరితో పరిచయాలు ప్రారంభమైనాయి. [[1915]] వ సంవత్సరం కాంగ్రెస్ మహాసభలు బొంబాయిలో జరిగాయి. [[ముస్లింలీగ్]] సమావేశాలు కూడా అక్కదే జరిగాయి. మోతీలాల్ తో పాటు స్వరూప కుమారి యీ రెండు సమావేశాలకు హాజరైనా, ఆమెకు రాజకీయాలపైన పెద్ద పరిశీలనా దృష్టి లెకపోవడంతో సమస్యలు క్షుణ్ణంగా అర్థమయ్యేవి కావు. అయినా ఆమెకు దేశ పరిస్థితులు, ఉద్యమ విధానాలు తెలుసుకోవాలన్న కుతూహలం మాత్రం ఉండేది.
 
[[1916]] వ సంవత్సరంలో స్వరూపకుమారి అన్న గారైన జవహర్ లాల్ నెహ్రూ కు కమలా నెహ్రూతో ఢిల్లీలో వివాహమైంది. మోతీలాల్ బాగా ధనవంతుడవడం వలన వివాహం చాల ఆడంబరంగా జరిగింది. వారు [[కాశ్మీరు]] విహార యాత్రకు వెళుతూ వారి వెంట స్వరూప కుమారి కూడా వెళ్ళింది. వీరు కాశ్మీరు అందచందాలను చూసి [[మొదటి ప్రపంచ యుద్ధం]] అయ్యాక తిరిగి వచ్చారు. తండ్రీ కుమారులు యుద్ధ వార్తలు చాలా కుతూహలంగా వింటూ చర్చించుకొనేవారు. తండ్రి అన్నతో స్వరూప కుమారి కూడా ఆ వార్తలూ, వీరి నిర్ణయాలూ వింటూ పరిస్థితులను కొంత అవగాహన చేసుకుండేది.
పంక్తి 73:
స్వరూప కుమారి ఆమె సోదరి కృష్ణ లకు కవిత్వమంటే మంచి ఆసక్తి. వారిద్దరూ ఎక్కువ కాలం వారి తోటలో కూర్చుని సాయంకాల సమయాలలో కవిత్వ ప్రసంగాలతో కాలము వెళ్ళబుచ్చేవారు. స్వరూప కుమారి పదిహేడవ ఏట ఆమె సంరక్షకురాలైన ఆంగ్ల వనిత వెళ్ళిపోయింది. సోదరి కృష్ణకు ఆమె అన్ని విధాల చేదోడుగా ఉంటూ, పది సంవత్సరాల కృష్ణకు ఆమె ఎంతో విజ్ఞానాన్ని బోధిస్తూ ఆమెను విపరీతంగా ప్రేమించింది.
 
స్వరూప కుమారికి కసలు పాఠశాల విద్యంటే తెలియదు. [[జలియన్ వాలా బాగ్]] ఉదంతంతో ఉద్యమం గాంధీజీ నాయకత్వంలో ఉదృతమైనది. ఈ సంఘటనలన్నీ మోతీలార్ పూర్తిగా రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు ఉపకరించాయి. [[గాంధీజీ]], మోతీలాల్ చర్చల ఫలితంగా ఆ సంవత్సరం [[అమృత్ సర్]]లో జరిగిన [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] మహాసభకు మోతీలాల్ అధ్యక్షుడు. జలియన్ వాలా బాగ్ ఉదంతంతో మోతీలాల్ కుటుంబమంతా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమంలో మోతీలాల్ కుటుంబమంతా పాల్గొన్నారు.
 
==వివాహం==
పంక్తి 87:
జూన్ లో తండ్రితో కలిసి [[బొంబాయి]] వెళ్ళినపుడు ప్రభుత్వం మోతీలాల్ నూ, కాంగ్రెస్ కార్యకర్తల్ని అరెస్టు చేసింది. అయినా కాంగ్రెస్ లో ఎప్పటి కప్పుడు సభ్యులు చేరుతూనే ఉన్నారు. ఇది జరిగిన కొద్దికాలానికి జవహర్ లాల్ నెహ్రూ ను రంజిత్ పండిట్ ను ప్రభుత్వం అరెష్టు చేసి చైనీ సెంట్రల్ జైలుకు పంపింది. మోతీలా అనారోగ్యంగా ఉండటం వలన ఆయనను విడుదల చేసింది. అదే సమయంల్ జవహర్ లాల్ కూడా విడుదలయ్యాడు. మోతీలాల్ [[అలహాబాద్]] వచ్చినప్పటి నుండి విజయలక్ష్మీ, కృష్ణ వీరంతా సహాయ నిరాకరణోద్యమంలో పనిచేస్తూనే ఉన్నారు. నైనీ జైల్లో పండిట్ తో పాటు మదన్ మోహన్ మాలవ్య ఉండేవాడు. రంజిత్ వద్ద మాలవ్య [[జర్మనీ]] భాష నేర్చుకున్నాడు. రంజిత్ [[జర్మనీ]], [[ఫ్రెంచి భాష|ఫ్రెంచ్]], [[సంస్కృతం]], [[ఇంగ్లీషు]] భాషల్లో రంజిత్ మంచి పండితుడు.
 
మోతీలాల్ ఆరోగ్యం పూర్తిగా పాడైంది. ఆయనకు [[లక్నో]]లో జవహర్ లాల్, విజయలక్ష్మి, [[కమలా నెహ్రూ]] లు అంతా సేవలు చేస్తూనే ఉన్నారు. కానీ [[1931]] వ సంవత్సరం [[ఫిబ్రవరి 6]] వ తేదీన మోతీలాల్ మరణించాడు.ఆ సంవత్సరం [[కరాచీ]]లో జరిగిన [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] సభకు విజయలక్ష్మీ వెళ్ళలేదు. ఇర్విన్ సంప్రదింపులు వ్యర్థమై గాంధీజీ రౌండ్ టేబిల్ కాన్ఫరెన్సు కు వెళ్ళి [[లండన్]] నుంచి వస్తూంటే [[బొంబాయి]] వెళ్ళి ఆయనకు స్వాగతము చెప్పాలనుకున్న జవహర్ లాల్ ను అరెష్టు చేశారు. ఆ తరువాత బాపూజీ, పటేలు కూడా అరెష్టయ్యారు. ఈ ఉధ్యమంలో విజయలక్ష్మీ పండిట్, కమల, స్వరూపరాణి మొదలైన వారంతా ముమ్మరంగా ప్రచారం చేశారు.
 
విజయలక్ష్మీ పండిట్ కు సభలూ, సమావేశాల్లోనూ పాల్గొనకూడదని ప్రభుత్వం నోటీసులిచ్చింది. ఒక రోజు [[అలహాబాద్]]లో జరిగిన బహిరంగ సభలో స్వరూపరాణి ఉపన్యసిస్తుంటే, ప్రభుత్వం లాఠీ చార్జీ అరెస్టులు జరిపించింది. విజయలక్ష్మీ పండిట్ ను అక్కడ అరెస్టు చేస్తే, ఉద్యమం తీవ్రమౌతుందని ప్రభుత్వం మరుసటి రోజు ఉదయం ఆనందభవన్ వద్ద ఆమెను, ఆమె సోదరి కృష్ణనూ అరెస్టు చేశారు. అయినా వారి అరెస్టులను వారుగానీ, వారి కుటుంబ సభ్యులు గానీ, ఏ మాత్రం విచారించలేదు. దేశం కోసం జైలుకు వెళ్ళడం చాలా ఘనతగా ఊహించారు. వారు వారి కుటుంబమంతా గర్వించింది. అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ కోర్టు విచారన తర్వాత చెరొక సంవత్సరం జైలు శిక్షను లక్నో జైలులో అనుభవించారు. సంవత్సరం గడిచాక వారు విడుదల చేయబడ్డారు. జవహర్ లాల్ భార్య కమలా నెహ్రూ కు అనారోగ్యంవల్ల ఆనంద భవన్ లో ఎవ్వరూ లేరు. వీరి తల్లి కూడా కమలా నెహ్రూ వద్ద [[కలకత్తా]] వెళ్ళి వదిన గారి సుస్థీ నయమయ్యాక అలహాబాద్ ఆనందభవన్ కి వచ్చారు.
"https://te.wikipedia.org/wiki/విజయలక్ష్మి_పండిట్" నుండి వెలికితీశారు