యలమంచిలి వెంకటప్పయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'<nowiki/>'''''యలమంచిలి వెంకటప్పయ్య''' ''' ( 1898 -: 1 మార్చి 1997) స్వాతంత్ర సమర యోధుడు.రచయిత, హింది బాషాప్రచారోద్యమ నాయకుడు [[హేతువాది]].
 
== బాల్యం,విద్య ==
వెకటప్పయ్య గారు కృష్ణ జిల్లా [[కనుమూరు (పామర్రు)|కనుమూరు]] గ్రామంలో '''యలమంచిలి అంకప్ప, ఆదెమ్మ''' దంపతులకు 30 డిశెంబరు 1898లో జన్మించారు. వీరిది నిరుపేద కమ్మ [[వ్యవసాయదారుడు|రైతు]] [[కుటుంబం]]. వీరికి ఐదుగురు [[అన్నదమ్ములు]], ఇద్దరు అక్కలు, ముగ్గురు చెల్లెండ్రు.
 
వెంకటప్పయ్య గారు 14 ఏండ్ల లోపలే ఆంధ్ర నామ సంగ్రహము, గజేంద్ర మోక్షము, రుక్మిణీ కళ్యాణము, అమర కోశము, ఆది పర్వము వంటి గ్రంధాలతో పాటు అమర కోశము కంఠస్థ చేసారు. 1914 లో [[కురుమద్దాలి|కురుమద్దాళి]] లో వారాలు చేసుకొని [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] నేరుచుకున్నారు, దాతల సహాయంతో 1916లో విజయవాడలో యస్. కె,పి.పి హైస్కూల్ లో 8వ తరగతిలో చేరాడు. 1919లో యస్.యస్.యల్.సి పరీక్షలో తప్పి మరల దానినే చదుతున్న సమయంలో [[మహాత్మా గాంధీ|గాంధీజీ]] విజయవాడ వచ్చారు. వారి ప్రసంగం విన్న వెంకటప్పయ్య గారు చదువుకు స్వస్తి చెప్పి స్వాతంత్ర పోరాటంలో పాల్గోన్నారు. ఆతరువాత హిందీ భాషపై అనురక్తి కలిగి నెల్లూరు వెళ్ళి మోటూరి సత్యనారాయణ గారి వద్ద హిందీ ప్రచార శిక్షణ పొంది హిందీ భాషా బోదకుడిగా మారాడు. 1925 లో [[మైనేనివారిపాలెం|మైనేనివారి పాలెం]] కు చెందిన బొబ్బా బసవయ్య గారి కుమార్తె '''బసవమ్మ'''ను వివాహం చేసుకున్నారు. 1929లో గుంటూరు జిల్లా బోర్డ్ అద్యక్షునిగా ఉన్న [[జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి|జాగర్లమూడి కుప్పుస్వామి]] గారు రేపల్లె హైస్కూలో హింది పండితునిగా నియమిస్తే చేరకుండా తెనాలిలో సొంత పాటశాల నడిపారు.1935 లో అలహాబాదు వెళ్ళి హింది విద్యాపీటం లో సాహిత్య రత్న కోర్స్ చదివారు. హింది - తెలుగు వ్యాకరణం పై పుస్తకాలు రాసారు
 
== స్వాతంత్ర పోరాటంలో ==
1921లో ప్రభుత్వానికి వెతిరేకంగా రెచ్చ గొట్టాడనే నేరంపై రాజమండ్రి జైల్లో ఆరు నెలలు ఉన్నారు. [[కాకినాడ]]లో 1923 లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలలో పాల్గోని బ్రాహ్మణులకు ప్రత్యేక భోజన శాల ఉండటానికి వీల్లేదని అందరూ కలిసే తినాలనీ తీర్మానం చేయించాడు. చెరుకువాడ నరసింహం, [[భోగరాజు పట్టాభి సీతారామయ్య]] ఈయన్ని సమర్దించారు. 1930లో ఉప్పుసత్యాగ్రహం లో ఎర్నేని సుబ్రహ్మణ్యం గారితో కలిసి పాల్గోని కన్ననూరు జైల్లో ఒక ఎడాది పాటు ఉన్నారు.1932 లో మద్య పాన నిషేదోద్యమంలో ఆరు మాసాలు రాజమండ్రి జైల్లో ఉన్నారు.
 
1942లో కాంగ్రెస్ పిలుపు మేరకు '''[[క్విట్ ఇండియా ఉద్యమం]]''' దేశవ్యాప్తంగా మొదలైంది. ఆ ఉద్యమ సమయం లో12-9-1942 న తెనాలిలో [[కల్లూరి చంద్రమౌళి]] నాయకత్వంలో శాంతి యుతంగా మొదలైన అందోళన వారి అదుపుతప్పి ఉద్రిక్తంగా మారి హింసాత్మక రూపు ధరించింది. తెనాలి రైల్వై స్టేషన్ తగలపెట్టిన ఆందోళనకారులు తాలుకా ఆఫీస్ లక్ష్యంగా వస్తున్న వేళ జరిగిన పోలిసు కాల్పులలొ ఏడుగురు ఉద్యమకారులు అసువులు బాసారు. దీనిలో పాల్గోన్నందులకు వెంకటప్పయ్యను రెండు సంవత్సరాలు బళ్ళారి జైల్లో ఉంచారు.
మంత్రాలులేని వివాహాలు, [[కులాంతర వివాహాలు]] పట్టుబట్టి చేయించారు.
 
== హేతువాద ఉద్యమం లో ==
==రచయిత జీవితంలో కొన్ని సంఘటనలు వారి మాటల్లోనే==
వెంకటప్పయ్య గారు భావ విప్లవకారుడు.[[త్రిపురనేని రామస్వామి]] గారితో కలసి మంత్రాలులేని వివాహాలు, [[కులాంతర వివాహాలు]] పట్టుబట్టి చేయించారు. అంటరానితనం, మూఢ విశ్వాసాలకు వెతిరేకంగా, మద్యపాన నిషేదానికి కృషి చేసారు. ప్రముఖ నాస్తిక వాదులైన [[గోరా]], గుత్తా రామస్వామి గారితో కలసి పనిచేసారు.
 
==రచనలు==
;నేను బడికి వెళ్ళే టప్పుడు రోజు ఎడమ చేతి చంకలో బడిలో కూర్చోవడానికి సొంతంగా ఇంటి వద్ద అల్లుకొనిన తాటాకుల చాపను, కుడి చేతిలో బడి వద్ద నేల మీద [[అక్షరాలు]] నేర్చుకోవడానికి పిడకల కచ్చికలు గల చిన్న [[తాటాకు]] బుట్ట తీసుకుని వెళ్ళే వాణ్ణి.మాబడికి ప్రతి [[పూర్ణిమ]]కు, [[అమావాస్య]]కు సెలవు లుండేవి. సెలవులకు ఆటూడుపు రోజులు అనే వారు. ప్రతి ఆటూడుపుకు ప్రతి పిల్లవాడు ఒక్కొక్క కాని, విలువగల గారి [[నాణెము]]ను పంతులకు ఇవ్వాలి.ఊళ్ళోకి భోగం మేళం వచ్చిందనగానె ఊళ్ళోని కుర్ర కారంతా ముఖ్యంగా డబ్బుగల కుర్రాళ్ళు భోగం మేళంలోని అందమైన పడుచు అమ్మాయిలకు డబ్బిచ్చి వారిని జత కట్టే వారు. ఆ రోజులలో ఆపని తప్పుగా గాని, నేరంగా గాని ఎంచ బడేది కాదు. పై పెచ్చు ఆ పని మగ వాని లక్షణమని పొగిడేవారు.ఆ రోజుల్లో తెల్ల దొరలు, తెల్ల దొరసానులు [[మాదిగ]] గూడాలలోనే తరచుగా వచ్చి తమ [[క్రీస్తు]] మత ప్రచారం చేసే వారు. అందువల్ల వారు మాట్లాడే భాషను మాల భాషగా, మాదిగ భాషగా ఎంచి దానిని ఏవ గించుకుని దాని జోలికి పోయే వారు కాదు.ఆత్మాభిమానం గల ఒక ముసలు బ్రాహ్మణేతరుదు జబ్బు పడి ఆర్థిక సాయానికై ఎవరింటికెళ్ళినా... వారతనిని నానా చీవాట్లు పెట్టి తరిమేశేవారు. ఎందుకనగా ... బ్రాహ్మణేతర బిచ్చగానికి ఏవిధమైన [[దానం]] చేయ కూడదనియు, చేస్తే చేసిన వారికి పాపం తగులు తుందనియు కేవలం బ్రాహ్మణుడనే వానికొక్కనికే బిచ్చం పెట్టే వారిని తరింప చేయ గల [[శక్తి]] గలదనియు శాస్త్రములో వ్రాయ బడి ఉందని బ్రాహ్మణ పండితులు వక్కాణించే వారు. (పుట23)ఆ రోజులలో [[కల్లు]], [[సారాయి]], [[చుట్ట]], [[బీడీలు]] త్రాగుట సంఘంలో చేయ కూడని పనులుగా ఎంచ బడేవి. కల్లు సారాయి త్రాగిన వారిని నేరస్థులుగా ఎంచి గ్రామ పెద్దలు వారిని శిక్షించే వారు. అందు వల్ల [[బ్రాహ్మణులు]], అబ్రాహ్మణులు మాల మాదెగ వారు ఎవరూ కూడా బహిరంగంగా స్వేచ్ఛగా కల్లు సారాయి త్రాగేవారు కారు. ఆ దుకాణాలు కూడా గ్రామానికి దూరంగా మారు మూల వుండేవి.
వెంకటప్పయ్య గారి రచనలలో ఎక్కువ హేతుబద్ద నాస్తిక భావజాలంతో నిండి ఉంటాయి. వారు తన స్వీయ జీవిత చరిత్రను ''''[[బీద బ్రతుకు (పుస్తకము)|బీద బ్రతుకు]]'''" అనే పేరుతో రాసారు. ఆనాటి సమాజిక జీవన పరిస్థుతులను మనకు పరిచయం చేస్తుంది. వీరు తెలుగులో 53 పుస్తకాలు రచించారు.
 
==వ్రాసిన పుస్తకాలు==
# [[వేదాలంటే ఇవేనా?]] 1984
# [[పుష్కరాలు ఎవరి కోసం?]] 1980
పంక్తి 43:
#[[పెద్దలేమన్నారు? మూడు భాగాలు.]]
#[[వైధిక ఆర్యుల ప్రాచీన సంస్కృతి]]
 
మొదలగు మొత్తం 53 పుస్తకాలు రచించారు:
 
(మూలం: బీద బ్రతుకు పుస్థకంలో 70, 71 పుటలలో పొరచురించిన జాబితా నుండి సేకరించినది)