వేంగి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 181:
* బౌద్ధం క్షీణించిన అనంతరం జైనమతం వ్యాపించి మరల క్షీణించింది. వైదిక మతం క్రమంగా బలపడింది. కుల వ్యవస్థ వేళ్ళూనుకోసాగింది. జాతరలు, ఆచారాలు, మూఢ విశ్వాసాలు వ్యాప్తి పొందాయి.
* వైశ్యులు జైన మతాన్ని విశేషంగా ఆదరించారు. వైశ్యుల కులదేవత [[కన్యకా పరమేశ్వరి]] ఆరాధనకు పెనుగొండ మూల స్థానం. వాసవీ కన్యకను విష్ణువర్ధనుడనే చాళుక్యరాజు బలాత్కరించగా ఆమె అగ్నిలో ఆహుతి అయ్యిందనే కధలో చారిత్రిక సత్యం లేదు. అయితే అగ్నిలో దూకి మరణించడం జైన ఆచారాలలో ఒకటి. వాసవి కూడ ఆ వ్రతం ఆచరించి వైశ్యులకు ఆరాధ్య దేవత అయ్యింది. తరువాత శైవం ప్రబలినప్పుడు "పరమేశ్వరి"గా పిలవబడి ఉంటుంది. <ref name="BSL"/>
* క్రీ.శ. 636 లోచైనా యాత్రికుడు హ్యూన్ త్సాంగ్ (యువాన్ చువాంగ్) ఆంధ్ర దేశంలో పర్యటించాడు. వేంగి, ధరణికోట, శ్రీశైలం అతని వర్ణనలలో ఉన్నాయి. వేంగిని అతడు "పింగ్-కీ-లో" అని వ్రాశాడు. పింగ్-కీ-లో సమీపంలోనే అచల అర్హతుడు ఇరవై సంఘారామాలు నిర్మించాడని, వానిలో మూడువేల మంది బౌద్ధ భిక్షువులు నివశించేవారని వ్రాశాడు. ఈ ఆరామాలకు సమీపంలోనే ఒక చైత్య గృహంలో నివసిస్తూ జన బోధిసత్వుడు తర్కశాస్త్రం రచించాడట. ఈ జన బోధిసత్వుడే ప్రసిద్ధ మహాయానాచార్యుడు అయిన [[దిజ్ఞాగుడు]] అని చరిత్రకారుల అభిప్రాయం.<ref name="BSL1"> బౌద్ధము, ఆంధ్రము - డా.బి.ఎస్.ఎల్. హనుమంతరావు (తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ)</ref> ఇక్కడి సంఘారామంలో పెక్కు అంతస్తులు గల హర్మ్యములును, సొగసుగ చెక్కబడిన స్తంభములచే కూడిన ఇతర గృహములును ఉండినట్లు, ఈ ఆరామం ఎదురుగా నూరడుగుల యెత్తు కలిగిన స్తూపమొకటి యుండినట్లు వ్రాశాడు. ఇక్కడి బుద్ధ విగ్రహమును శిల్పి తన నేర్పంతయు చూపి చెక్కినట్లు తెలియుచున్నదట. <ref name="MSS">[http://www.archive.org/details/amaravathistupam025779mbp మల్లంపల్లి సోమశేఖర శర్మ - అమరావతి స్తూపము, ఇతర వ్యాసములు] </ref>
*
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/వేంగి" నుండి వెలికితీశారు