వేంగి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 173:
{{main|నన్నయ}}
* పైన చెప్పినట్లుగా వేంగి రాజ్యం, తూర్పు చాళుక్యుల పాలన తెలుగువారి చరిత్రలో సాంస్కృతికంగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్న కాలం. నన్నయ భట్టు, నారాయణ భట్టు మహాభారత ఆంధ్రీకరణను ప్రారంభించారు. ఈ కాలంలోనే శాసనాలలో తెలుగు కనిపించ సాగింది. కుబ్జవిష్ణువర్ధనుని చేజెర్ల శాసనంలో సగం పైగా తెలుగు. అతని కుమారుడు జయసింహ వల్లభుని విప్పర్ల, మాచెర్ల శాసనాలు తెలుగు. వేంగి రాజ్యానికి సమాంతరంగా నడచిన రేనాటి చోడులు కూడా తమ శాసనాలు తెలుగులో వేయించారు. వానిలో ధనంజయుని [[కలమళ్ళ శాసనం]] (క్రీ.శ.575) మనకు లభించిన మొట్టమొదటి [[తెలుగు శాసనాలు|తెలుగు శాసనం]].
 
* చరిత్రలో చాలా సార్లు జరిగినట్లుగానే రాజవంశాలలోని అంతఃకలహాలు, పొరుగు రాజ్యాల సామ్రాజ్య విస్తరణాకాంక్ష దేశాన్ని బలపడకుండా చేశాయి. వేంగి, ధరణికోట, యనమదల, కంభం, నెల్లూరు వంటి వగరాలు పలుమార్లు ధ్వంసం చేయబడ్డాయి.
 
* ఈ కాలంలో రాయలసీమ, తెలంగాణ ప్రాంతం ఎక్కువ భాగం ఇతర రాజుల సామంతరాజుల పాలనలో ఉంది.
 
* వేంగి రాజుల సైన్యాధిపతులలో అనేక బ్రాహ్మణ వీరులుండేవారు. బౌద్ధమతం క్షీణించినా అప్పటికి కులవ్యవస్థ ఇంకా బాగా బలపడలేదు.
 
* స్థానిక ప్రాంతాలలోని అధికారులు సామంతరాజులవంటివారిగా వ్యవహరించేవారు. కేంద్రం బలహీనపడడానికి, అంతఃకలహాలకు, పొరుగురాజుల యుద్ధవ్యూహాలకు వీరు చాలావరకు కారకులయ్యారు.
 
* రాజ్యం "విషయాలు" (రాష్ట్రాల వంటివి)గా విభజింపబడింది. వేంగి రాజ్యంలో 30 విషయాలుండేవి. కమ్మ రాష్ట్ర విషయము, అత్తిలినాడు విషయము వంటి పేర్లుండేవి.
 
* అనేక విధాలైన పన్నులండేవి - డేగరచ పన్ను, పడెవాలుపన్ను, పడియేరి పన్ను, సంధి విగ్రహం పన్ను నంటివి.
 
* బౌద్ధం క్షీణించిన అనంతరం జైనమతం వ్యాపించి మరల క్షీణించింది. వైదిక మతం క్రమంగా బలపడింది. కుల వ్యవస్థ వేళ్ళూనుకోసాగింది. జాతరలు, ఆచారాలు, మూఢ విశ్వాసాలు వ్యాప్తి పొందాయి.
 
* వైశ్యులు జైన మతాన్ని విశేషంగా ఆదరించారు. వైశ్యుల కులదేవత [[కన్యకా పరమేశ్వరి]] ఆరాధనకు పెనుగొండ మూల స్థానం. వాసవీ కన్యకను విష్ణువర్ధనుడనే చాళుక్యరాజు బలాత్కరించగా ఆమె అగ్నిలో ఆహుతి అయ్యిందనే కధలో చారిత్రిక సత్యం లేదు. అయితే అగ్నిలో దూకి మరణించడం జైన ఆచారాలలో ఒకటి. వాసవి కూడ ఆ వ్రతం ఆచరించి వైశ్యులకు ఆరాధ్య దేవత అయ్యింది. తరువాత శైవం ప్రబలినప్పుడు "పరమేశ్వరి"గా పిలవబడి ఉంటుంది. <ref name="BSL"/>
 
* క్రీ.శ. 636 లోచైనా యాత్రికుడు [[హ్యూన్ త్సాంగ్]] ([[యువాన్ చువాంగ్]]) ఆంధ్ర దేశంలో పర్యటించాడు. వేంగి, [[ధరణికోట]], [[శ్రీశైలం]] అతని వర్ణనలలో ఉన్నాయి. వేంగిని అతడు "పింగ్-కీ-లో" అని వ్రాశాడు. పింగ్-కీ-లో సమీపంలోనే అచల అర్హతుడు ఇరవై సంఘారామాలు నిర్మించాడని, వానిలో మూడువేల మంది బౌద్ధ భిక్షువులు నివశించేవారని వ్రాశాడు. ఈ ఆరామాలకు సమీపంలోనే ఒక చైత్య గృహంలో నివసిస్తూ జన బోధిసత్వుడు తర్కశాస్త్రం రచించాడట. ఈ జన బోధిసత్వుడే ప్రసిద్ధ మహాయానాచార్యుడు అయిన [[దిజ్ఞాగుడు]] అని చరిత్రకారుల అభిప్రాయం.<ref name="BSL1"> [http://www.archive.org/details/bouddamuandhramu018708mbp బౌద్ధము, ఆంధ్రము - డా.బి.ఎస్.ఎల్. హనుమంతరావు] (తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ)</ref> ఇక్కడి సంఘారామంలో పెక్కు అంతస్తులు గల హర్మ్యములును, సొగసుగ చెక్కబడిన స్తంభములచే కూడిన ఇతర గృహములును ఉండినట్లు, ఈ ఆరామం ఎదురుగా నూరడుగుల యెత్తు కలిగిన స్తూపమొకటి యుండినట్లు వ్రాశాడు. ఇక్కడి బుద్ధ విగ్రహమును శిల్పి తన నేర్పంతయు చూపి చెక్కినట్లు తెలియుచున్నదట. <ref name="MSS">[http://www.archive.org/details/amaravathistupam025779mbp మల్లంపల్లి సోమశేఖర శర్మ - అమరావతి స్తూపము, ఇతర వ్యాసములు] </ref>
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/వేంగి" నుండి వెలికితీశారు