దువ్వూరి సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
సుబ్బారావు ఆర్ధిక శాస్త్రంతో పాటు భౌతిక శాస్త్రాన్ని కూడా ఎంతో లోతుగా చదువుకున్నాడు. అతను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చదువుకునేటప్పుడు, అలాగే తన సివిల్స్ పరీక్షలకు కూడా భౌతిక శాస్త్రాన్ని తన ముఖ్యమైన సబ్జెక్ట్‌గా ఎంచుకున్నాడు. [[స్టీఫెన్ హాకింగ్]] రాసిన "బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం" అనే పుస్తకం పైన ఒక విక్లీలో సమీక్ష రాశాడు సుబ్బారావు. ఈ సమీక్ష "ఫ్రం ద ఎటర్నిటీ" అనే పేరుతో ప్రచురితమైంది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి వ్యక్తి సుబ్బారావు కావడం విశేషం.
 
సుబ్బారావు 1988 నుండి 1993 మధ్య కాలంలో భారత ప్రభుత్వంలోని ఆర్ధిక మంత్రిత్వ శాఖలో, ఆర్ధిక వ్యవహారాల శాఖకు సంయుక్త కార్యదర్శిగా పనిచేశాడు. <ref>{{cite news|url=http://in.reuters.com/article/2012/11/07/india-rbi-subbarao-idINDEE8A60E820121107|title=PROFILE - RBI governor Duvvuri Subbarao|publisher=Businessweek|access-date=8 February 2013|date=7 November 2012}}</ref> ఆ తరువాత, 1993 నుండి 1998 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్ధిక కార్యదర్శిగా పనిచేశాడు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలో తన పదవీకాలం పూర్తి అయిన తరువాత [[ప్రపంచ బ్యాంకు]]కు ప్రధాన ఆర్ధిక శాస్త్రజ్ఞుడిగా బదిలీ చేయబడ్డాడు.
 
==నిర్వహించిన పదవులు==