'''[[స్వాతి]]''' ఒక ప్రముఖ [[నటి]], వ్యాఖ్యాత, గాయకురాలు, డబ్బింగ్ కళాకారిణి.<ref>{{Cite web|url=http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break96|title=వర్మ గురించి నాకెన్ని ప్రశ్నలో!|date=28 November 2017|publisher=ఈనాడు|language=తెలుగు|archiveurl=https://web.archive.org/web/20171128101659/http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break96|archivedate=28 November 2017}}</ref> ఈమె మాటీవీలో ప్రసారమైన ''కలర్స్'' అనే కార్యక్రమం ద్వారా [[వ్యాఖ్యాత]] గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత మరికొన్ని [[తెలుగు సినిమా|తెలుగు]], [[తమిళ సినిమా|తమిళ]], [[మలయాళ భాష|మలయాళ]] చిత్రాలలో నటించి ప్రజల మన్నలను అందుకుంది. నటిగా స్వాతి మొదటి చిత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్. 2008లో ఆమె నటించిన [[అష్టా చెమ్మా]] చిత్రం విజయవంతం అవడం వలన ఆమెకు మంచి నటిగా పేరు రావడం, తరువాత అనేక అవకాశాలు రావడం జరిగింది. 2008 లో ఈ సినిమాకు ఆమెకు [[నంది పురస్కారం]] లభించింది. స్వాతి వివాహం ఆగస్టు 30, 2018లో వికాస్ తో జరిగింది.<ref name="నిరాడంబరంగా కలర్స్ స్వాతి వివాహం">{{cite news |last1=Sakshi |title=నిరాడంబరంగా కలర్స్ స్వాతి వివాహం |url=https://www.sakshi.com/photos/movies/colours-swathi-marriage-photo-gallery-1113129#lg=1&slide=0 |accessdate=10 May 2021 |work=Sakshi |date=1 September 2018 |archiveurl=https://web.archive.org/web/20210510152107/https://www.sakshi.com/photos/movies/colours-swathi-marriage-photo-gallery-1113129#lg=1&slide=0 |archivedate=10 మే 2021 |language=te |url-status=live }}</ref><ref name="I can’t believe that I’m married!: Swathi Reddy">{{cite news |last1=Deccan Chronicle |first1= |title=I can’t believe that I’m married!: Swathi Reddy |url=https://www.deccanchronicle.com/entertainment/tollywood/050918/i-cant-believe-that-im-married-swathi-reddy.html |accessdate=10 May 2021 |work=Deccan Chronicle |date=5 September 2018 |archiveurl=https://web.archive.org/web/20210510152316/https://www.deccanchronicle.com/entertainment/tollywood/050918/i-cant-believe-that-im-married-swathi-reddy.html |archivedate=10 మే 2021 |language=en |url-status=live }}</ref>
==జీవిత విశేషాలు==
పంక్తి 20:
16 ఏళ్ళ వయసులో కలర్స్ అనే టీవీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఈ కార్యక్రమంలో భాగంగా [[అక్కినేని నాగార్జున|నాగార్జున]], [[ఉదయకిరణ్ (నటుడు)|ఉదయ్ కిరణ్]] లాంటి నటులను ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది.<ref>{{Cite book|title=మాట్లాడకుండా ఉండలేను|last=|first=|publisher=ఈనాడు|year=2009|isbn=|location=హైదరాబాదు|pages=18-19}}</ref> అప్పటి నుంచే సినిమా అవకాశాలు రావడం మొదలైంది. ఆమె మొదటి సినిమా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్. తర్వాత వెంకటేష్ కథానాయకుడిగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో సహాయ పాత్రలో నటించింది. మూడో సినిమా తెలుగు తమిళ ద్విభాషా చిత్రం అనంతపురం (తమిళంలో సుబ్రహ్మణ్య పురం). తర్వాత వచ్చిన అష్టాచమ్మాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఈ చిత్రంలో నటనకు గాను 2008లో ఆమెకు ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది.
2008 లో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వచ్చిన [[జల్సా]] సినిమాలో కథానాయిక ఇలియానాకు డబ్బింగ్ చెప్పింది. స్వాతి వివాహం జరిగిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంది, 2021లో [[పంచతంత్రం (2021 సినిమా)|పంచతంత్రం]] సినిమా ద్వారా సినిమాల్లో తిరిగి నటిస్తుంది.<ref name="కలర్స్ స్వాతి రీ ఎంట్రీ.. కొత్త కాన్సెప్ట్‌తో అలరించేందుకు రెడీ..!">{{cite news |last1=Namasthe Telangana |title=కలర్స్ స్వాతి రీ ఎంట్రీ.. కొత్త కాన్సెప్ట్‌తో అలరించేందుకు రెడీ..! |url=https://www.ntnews.com/cinema/presenting-you-the-cast-of-panchathantram-65921/ |accessdate=10 May 2021 |date=22 April 2021 |archiveurl=https://web.archive.org/web/20210510151250/https://www.ntnews.com/cinema/presenting-you-the-cast-of-panchathantram-65921/ |archivedate=10 మే 2021 |work= |url-status=live }}</ref>