మాతృదేవోభవ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: నాజర్నాజర్ (2)
పంక్తి 11:
studio = [[క్రియేటివ్ కమర్షియల్స్ ]]|
music = [[ఎం.ఎం.కీరవాణి|కీరవాణి]]|
starring = [[నాజర్ (నటుడు)|నాజర్]],<br>[[మాధవి]],<br>[[చారుహాసన్]],<br>[[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]],<br>[[వై. విజయ]]|
}}
'''మాతృదేవోభవ''' కె. అజయ్ కుమార్ దర్శకత్వంలో [[1993]] లో విడుదలై పలువురి మన్ననలు పొందిన సినిమా. ఈ చిత్రాన్ని [[క్రియేటివ్ కమర్షియల్స్]] పతాకంపై [[కె. ఎస్. రామారావు]] నిర్మించాడు. [[ఎం. ఎం. కీరవాణి]] సంగీతం అందించాడు. [[వేటూరి సుందరరామ్మూర్తి]] సాహిత్యం అందించాడు. [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]], [[కె. ఎస్. చిత్ర]], [[ఎం. ఎం. కీరవాణి|కీరవాణి]] పాటలు పాడారు. ఈ చిత్రానికి మూలం సిబి మలయిల్ దర్శకత్వంలో వచ్చిన మలయాళం సినిమా ''[[:ml:ആകാശദൂത്|ఆకాశదూతు]]''. ఇదే సినిమాని కన్నడ భాషలో ''[[:kn:ಕರುಳಿನ ಕೂಗು|కరుళిన కూగు]]'' (1994) పేరుతోను, హిందీ భాషలో ''[[:en:Tulsi (film)|తులసి]]'' (2008) పేరుతోను, మరాఠీ భాషలో ''చిమని పఖరే'' (2003) పేరుతోను పునర్మించారు. అయితే ఈ సినిమాలన్నీ 1983లో విడుదలైన అమెరికన్ సినిమా [[:en:Who Will Love My Children?|హూ విల్ లవ్ మై చిల్డ్రన్?]] ఆధారంగా నిర్మించబడ్డాయని భావిస్తున్నారు.{{citation needed}}
పంక్తి 20:
 
==కథ==
శారద ([[మాధవి]]), [[చారుహాసన్]] నడిపే ఒక అనాథాశ్రమంలో పెరిగిన అమ్మాయి. సంగీత అధ్యాపకురాలిగా పనిచేస్తుంటుంది. సత్యం ([[నాజర్ (నటుడు)|నాజర్]]) అదే అనాథాశ్రమంలో పెరిగి లారీ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. శారదను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. వీరికి నలుగురు పిల్లలు. సత్యం వ్యక్తిగతంగా మంచివాడైనప్పటికీ మద్యానికి బానిసౌతాడు. కల్లు దుకాణానికి యజమానియైన అప్పారావు ( [[తనికెళ్ళ భరణి]] ) శారద మీద కన్ను వేస్తాడు. అది సత్యానికి తెలిసి అతని దుకాణం ముందే అప్పారావుని అవమానిస్తాడు. అదే సమయంలో శారదకు మెదడు క్యాన్సర్ సోకిందనీ, తను ఇక ఎంతో కాలం బ్రతకదనీ డాక్టర్లు చెబుతారు. అప్పారావు పగబట్టి సత్యాన్ని చంపేస్తాడు. శారద తనలాగే తన పిల్లలు కూడా అనాధాశ్రమంలో పెరగడం ఇష్టం లేక వారిని మంచి మనసున్న కుటుంబాలకు దత్తత ఇచ్చి వేస్తుంది.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/మాతృదేవోభవ" నుండి వెలికితీశారు