యలమంచిలి వెంకటప్పయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
వెకటప్పయ్య గారు కృష్ణ జిల్లా [[కనుమూరు (పామర్రు)|కనుమూరు]] గ్రామంలో '''యలమంచిలి అంకప్ప, ఆదెమ్మ''' దంపతులకు 30 డిశెంబరు 1898లో జన్మించారు. వీరిది నిరుపేద [[వ్యవసాయదారుడు|రైతు]] [[కుటుంబం]]. వీరికి ఐదుగురు [[అన్నదమ్ములు]], ఇద్దరు అక్కలు, ముగ్గురు చెల్లెండ్రు<ref>{{Cite book|title=బీద బ్రతుకు|last=యలమంచిలి|first=వెంకటప్పయ్య స్వీయ చరిత్ర|publisher=యలమంచిలి వెంకటప్పయ్య సంస్మరణ వేదిక. ప్రచురుణ సంఖ్య-3|year=2010|location=విజయవాడ|pages=1 - 75}}</ref>.
[[దస్త్రం:Venkatappayya Beeda bratuku .jpg|thumb|బాల్యంలో వెంకటప్పయ్య - స్వీయ రచన బీదబ్రతుకులో ఊహా చిత్రం]]
వెంకటప్పయ్య గారు 14 ఏండ్ల లోపలే ఆంధ్ర నామ సంగ్రహము, గజేంద్ర మోక్షము, రుక్మిణీ కళ్యాణము, అమర కోశము, ఆది పర్వము వంటి గ్రంధాలతో పాటు అమర కోశము కంఠస్థం చేసారు. 1914 లో [[కురుమద్దాలి|కురుమద్దాళి]] లో వారాలు చేసుకొని [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] నేరుచుకున్నారు, దాతల సహాయంతో 1916లో విజయవాడలో కమ్మ విద్యార్థి వసతి గృహం లో ఉండి యస్. కె,పి.పి హైస్కూల్ లో 8వ తరగతిలో చేరాడు. 1919లో యస్.యస్.యల్.సి పరీక్షలో తప్పి మరల దానినే చదుతున్న సమయంలో [[మహాత్మా గాంధీ|గాంధీజీ]] విజయవాడ వచ్చారు. వారి ప్రసంగం విన్న వెంకటప్పయ్య గారు చదువుకు స్వస్తి చెప్పి స్వాతంత్ర పోరాటంలో పాల్గోన్నారు. ఆతరువాత హిందీ భాషపై అనురక్తి కలిగి నెల్లూరు వెళ్ళి [[మోటూరి సత్యనారాయణ]] గారి వద్ద హిందీ ప్రచార శిక్షణ పొంది హిందీ భాషా బోదకుడిగా మారాడు.
 
1925 లో [[మైనేనివారిపాలెం|మైనేనివారి పాలెం]] కు చెందిన బొబ్బా బసవయ్య గారి కుమార్తె '''బసవమ్మ దేవి''' గారిని వివాహం చేసుకున్నారు. 1929లో గుంటూరు జిల్లా బోర్డ్ అద్యక్షునిగా ఉన్న [[జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి|జాగర్లమూడి కుప్పుస్వామి]] గారు రేపల్లె హైస్కూలో హిందీ పండితునిగా నియమిస్తే చేరకుండా తెనాలిలో సొంత పాఠశాల నడిపారు. 1935 లో అలహాబాదు వెళ్ళి హింది విద్యాపీటం లో సాహిత్య రత్న కోర్స్ చదివారు. హిందీ - తెలుగు వ్యాకరణం పై పుస్తకాలు రాసారు