రామోజీరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
రామోజీరావు [[కృష్ణా జిల్లా]] [[పెదపారుపూడి]]లో 1936 నవంబరు 16న కమ్మ కులానికి చెందిన వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు [[పామర్రు]] మండలంలోని [[పెరిశేపల్లి]] గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చాడు.{{sfn|గోవిందరాజు చక్రధర్|2020|p=20}} రామోజీరావు తాత మరణించిన 13 రోజులకు జన్మించాడు. దానితో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు పెట్టారు.{{sfn|గోవిందరాజు చక్రధర్|2020|p=19}} ఇతనికన్నా ముందు ఇద్దరు అక్కలు ఉన్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ.{{sfn|గోవిందరాజు చక్రధర్|2020|p=20}}
 
=== బాల్యం, విద్యాభ్యాసం, వివాహం (1937 - 1961) ===
ఇతని కుటుంబానిది శ్రీ వైష్ణవ నేపథ్యం. తల్లి చాలా భక్తిపరురాలు, ఆచారవంతురాలు కావడంతో చిన్నతనంలో ఇతనికీ భక్తి, శుచి అలవడింది. లేకలేక పుట్టిన మగసంతానం కావడంతో రామోజీని చాలా ముద్దుచేసేవారు. పెద్దక్క పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయినా చిన్నక్క రంగనాయకమ్మతో సాన్నిహిత్యం ఉండేది. ఇంట్లో తల్లికి ఇంటిపనుల్లో, వంటలో సహాయం చేసే అలవాటూ ఉండేవి.{{sfn|గోవిందరాజు చక్రధర్|2020|p=20}}
 
రామయ్య అన్న తన పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరేప్పుడే స్వంతంగా "రామోజీ రావు" అన్న పేరును సృష్టించుకుని, తానే పెట్టుకున్నాడు. ఆ పేరే జీవితాంతమూ కొనసాగుతోంది. రామోజీరావు 1947లో [[గుడివాడ]]<nowiki/>లో పురపాలకోన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరాడు. 1957లో ఆరవ ఫారం అక్కడే పూర్తిచేసుకుని, గుడివాడ కళాశాలలో ఇంటర్, బీఎస్సీ చదివాడు.{{sfn|గోవిందరాజు చక్రధర్|2020|p=20}}
 
1961 ఆగస్టు 19న రామోజీరావుకు, [[పెనమలూరు]]<nowiki/>కు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల మూడవ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ కాగా పెద్దలు పెట్టిన పేరు నచ్చక అలా మార్చుకుంది.
 
=== వ్యాపారం ===
"https://te.wikipedia.org/wiki/రామోజీరావు" నుండి వెలికితీశారు