ఖిలాషాపూర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
|||
పంక్తి 199:
పాపన్నఒక సాధారణ గౌడ కుటుంబం నుండి వచ్చిన వాడు కనుక అతనికి ప్రజల కష్ట నష్టలన్నీ తెలుసు. అందుకే పాపన్న రాజ్యంలో పన్నులు లేవు. ఖజానా కొరకు అతను జమిందార్, సుబేదార్ లపై తన గెరిల్ల సైన్యంతో దాడి చేయించేవాడు. పాపన్న అనేక ప్రజామోద యోగ్యమైన పనులు చేసాడు. అతని రాజ్యంలో సామజిక న్యాయం పాటించేవాడు. తాటి కొండలో చెక్ డాం నిర్మించాడు. అతను ఎల్లమ్మకు పరమ భక్తుడు కావున హుజురా బాద్ లో ఎల్లమ్మ గుడి కట్టించాడు. అది నేటికి రూపం మారిన అలానే ఉంది.
పాపన్న గెరిల్ల సైన్యంతో మొగల్ సైన్యం పై దాడి చేస్తున్నాడని ఔరంగజేబుకు తెలిసింది. అతడు రుస్తుం దిల్ ఖాన్ కు బాధ్యతలు అప్పగించాడు. రుస్తుం దిల్ ఖాన్ యుద్ధానికి ఖాసింఖాన్ ను పంపించాడు. షాపుర వద్ద ఇరు సైన్యాలు తలపడ్డాయి. నెలలపాటు యుద్ధం జరిగింది. చివరికి రుస్తుం దిల్ ఖాన్ రంగం లోకి దిగాడు. సుమారు 3 నెలలపాటు యుద్ధం జరిగింది. పాపన్న తన ప్రాణ స్నేహితున్ని కోల్పోయాడు. దాంతో ఆయన యుద్ధాన్ని విరమించుకొని, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. మొగల్ సైన్యాలు అతని కోసం వెతకడం ప్రారంభించాయి. అయితే పాపన్న తన సొంత ఊరు జనగామకు వెళ్లి అక్కడ గౌడ కులం వారు ఎక్కువగా ఉండే చోట జీవితం గడిపాడు. ఔరంగజేబు మరణించిన తర్వాత దక్కన్ పాలకుడు కంబక్ష్ ఖాన్ బలహీన పాలనను చుసిన పాపన్న 1708 ఏప్రిల్ 1 లో వరంగల్ కోటపై దాడి చేసాడు. అయితే ఈ దాడిలో పాపన్న పట్టుబడ్డాడు. 1708 లో గోల్కొండకు తీసుకెళ్ళి పాపన్న తల తీసి కోట ముఖ ద్వారానికి వేళ్ళాడ దీసారు.<ref name="ఖిలాషపూర్ కోట పునరుద్ధరణ పనులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన">{{cite news |last1=Namasthe Telangana |title=ఖిలాషపూర్ కోట పునరుద్ధరణ పనులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన |url=https://www.ntnews.com/telangana/minister-srinivas-goud-laid-foundation-for-the-renovation-of-historical-khilashapur-fort-136483/ |accessdate=3 July 2021 |work=Namasthe Telangana |date=3 July 2021 |archiveurl=http://web.archive.org/web/20210703143442/https://www.ntnews.com/telangana/minister-srinivas-goud-laid-foundation-for-the-renovation-of-historical-khilashapur-fort-136483/ |archivedate=3 July 2021}}</ref>
==మూలాలు==
|