సురేష్ ప్రొడక్షన్స్: కూర్పుల మధ్య తేడాలు

చి #WPWPTE, #WPWP
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:RAMANAIDU FILM STUDIO.jpg|alt=Rama Naidu Studios |thumb|రామానాయుడు ఫిలిం స్టూడియో - విశాఖపట్నం]]
'''సురేష్ ప్రొడక్షన్స్''' (Suresh Productions) సినీ నిర్మాణ సంస్థ. దీనిని చిత్ర నిర్మాత [[దగ్గుబాటి రామానాయుడు]] తన పెద్ద కుమారుడు [[దగ్గుబాటి సురేష్|సురేష్]] పేరు మీద స్థాపించారు. చిత్ర నిర్మాణం ఎక్కువగా [[హైదరాబాదు]] లోని [[రామానాయుడు స్టుడియోస్]] లో జరుగుతాయి. వీరు మొదటి సినిమా [[అనురాగం]]ను 1963లో నిర్మించారు. వీరి మొదటి సూపర్ హిట్ చిత్రం [[ఎన్.టి.ఆర్.]] నటించిన [[రాముడు భీముడు]]. ఈ సంస్థ ద్వారా 48 సంవత్సరాల కాలంలో, 131 సినిమాలు, 9 భాషలలో విడుదలయ్యాయి.<ref>http://www.sureshproductions.net/Home-Productions.htm</ref> ఇదొక ప్రపంచ రికార్డు. [[విజయా పిక్చర్స్]] సంస్థతో కలిపి [[విజయ సురేష్ కంబైన్స్]] ద్వారా నిర్మించిన 10 చిత్రాలలో మొదటిది [[పాపకోసం]] (1968).
 
వీరి సంస్థ తెలుగు, హిందీ, తమిళం మూడు భాషలలో నిర్మించిన మెగా హిట్ చిత్రం [[ప్రేమనగర్]] (1971).
వీరి [[శ్రీకృష్ణ తులాభారం]] (1966) పౌరాణిక చిత్రాలలో తలమానికం పేరుపొందితే, [[అహనా పెళ్ళంట]] (1987) ఇప్పటినీ అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంది.
[[దస్త్రం:Ramanaidu studios.jpg|alt=Rama Naidu Studios |thumb|రామానాయుడు ఫిలిం స్టూడియో]]
 
సురేష్ ప్రొడక్షన్స్ ప్రతి సంవత్సరం సుమారు 5 నుండి 6 చిత్రాలు నిర్మిస్తున్నా, వాటిలో 90 శాతం చిత్రాలు విజయవంతమై సినీ జగత్తులో చిరస్థాయిగా నిల్చుంటాయి.