సుద్దాల హనుమంతు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 6:
 
== తెలంగాణ ఉద్యమంలో ==
విద్య పెద్దగా లేదు- ఆనాడు చదువుకు అవకాశాల్లేవు. వీధిబడిలో [[ఉర్దూ భాష|ఉర్దూ]], [[తెలుగు]] భాషలు నేర్చుకున్నాడు. [[శతకాలు]], [[కీర్తనలు]], సీస, కంద పద్యాలు కంఠస్థం చేశాడు. బాల్యంలో [[యక్షగానాలు]], [[కీర్తనలు]], భజనల్లాంటి కళారూపాలంటే ఆసక్తి వుండేది. అందుకే యక్షగానాల్లో పాత్రలు ధరించారు. గొంతెత్తి పాడటం నేర్చుకున్నాడు. చిన్నతనం నుండే నాటకాల పై ఆసక్తిని పెంచుకున్న హనుమంతుకు ప్రజా కళారూపాలైన [[హరికథ]], బురక్రథ, యక్షగానాలే తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రచారాసాధనాలుగా ఉపయోగపడ్డాయి. ఆయన బురక్రథ చెబితే ఆనాడు గడ్డిపోచ కూడా యుద్ధానికి సిద్ధమయ్యేదని జనంలో ప్రచారం బలంగా ఉండేది. [[హైదరాబాద్‌]] సంస్థానంలో జరిగిన అనేక అక్రమాలను, భూస్వాముల దురాగతాలను, దొరల దౌర్జన్యాలను బురక్రథల రూపంలో చాటి చెప్పారు. విచిత్ర వేషాలు, ‘గొల్లసుద్దులు’, ‘లత్కోరుసాబ్‌’, ‘బుడబుక్కలు’, ‘ఫకీరు వేషం’, ‘సాధువు’ మొదలైన కళా రూపాల ద్వారా పీడిత వర్గాల బాధల్ని, భావాల్ని వ్యక్తీకరించాడు.
 
[[కమ్యూనిస్టు పార్టీ]] దళ సభ్యునిగా చేరి తన పాటల ద్వారా ప్రజల్ని ఉత్తేజితుల్ని చేశారు. [[భువనగిరి]]లో జరిగిన 11వ [[ఆంధ్ర మహాసభ]]కు హన్మంతు వాలంటీర్‌గా పనిచేశారు. ఆ మహాసభ ప్రభావంతో సుద్దాల గ్రామంలో `సంఘం’ స్థాపించారు. ఈ `సంఘం’ ఆధ్వర్యంలో ఆందోళనలు, [[తిరుగుబాటు]] పోరాటాలు మొదలైనయ్‌. సంఘం పెట్టి, [[పాటలు]] కట్టి ప్రజల్ని ఉద్రేకపరుస్తున్నాడని హనుమంతు పై నిజాం ప్రభుత్వం అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. అప్పుడే హనుమంతు అజ్ఞాతవాసంలోకి వెళ్ళాల్సి వచ్చింది.
"https://te.wikipedia.org/wiki/సుద్దాల_హనుమంతు" నుండి వెలికితీశారు