సేవ్ ఇండియన్ ఫ్యామిలీ: కూర్పుల మధ్య తేడాలు

→‎చరిత్ర: బొమ్మను చేర్చాను #WPWPTE #WPWP
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 26:
 
== చరిత్ర ==
[[File:Save Indian Families protest (New Delhi, 26 August 2007).jpg|Save_Indian_Families_protest_(New_Delhi,_26_August_2007)thumb|న్యూఢిల్లీలో లో ఇండియన్ ఫ్యామిలీ సేవ్ నిరసన చేస్తున్న చిత్రం]]
10 మార్చి 2005న భారతదేశంలో దుర్వినియోగానికి గురైన పురుషులు కొందరు చేతులు కలిపి సేవ్ ఇండియన్ ఫ్యామిలీని స్థాపించారు. ఇది ఒక యాహూ గ్రూప్ గా ప్రారంభమైనది. వేగంగా విస్తరించిన సేవ్ ఇండియా ఫ్యామిలీ లో 10,000 మంది సభ్యులు చేరారు. రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా సేవ్ ఇండియా ఫ్యామీలీ తన సేవలను విస్తరించినది. కాలం మారుతోన్న కొద్దీ, SIF, దాని ప్రాథమిక లక్ష్యాలు, భావజాలం కూడా బలపడుతూ వచ్చినవి. సభ్యసమాజంలో పాతుకుపోయిన పురుషద్వేషం వలన దెబ్బతిన్న, వేధింపులకు గురి అయిన, అణగారిన పురుషులకు/వారి కుటుంబాలకు బాసటగా నిలిచినది. ఈ పురుషద్వేషమే అనేక పురుష-వ్యతిరేక చట్టాలకు బీజమైనదని, భారతదేశం లింగ ఆధారిత నేర సంఘంగా ముద్ర వేయబడినది అని SIF గ్రహించినది. SIF వలన చాలా మంది పురుషులు స్వాంతనను/శాంతిసౌభాగ్యాలను అందుకొన్నారు. లింగ వివక్ష గల సమాజంలో, చట్ట/న్యాయవ్యవస్థలలో ఎలా నిలద్రొక్కుకోవాలో కొన్ని లక్షల మంది పురుషులకు శిక్షణనిస్తూ, సలహాలను సూచనలను ఇస్తూ దూసుకెళ్ళినది. ప్రతి తొమ్మిది నిముషాలకు ఒక భర్త ఆత్మహత్యకు పాల్పడుతోన్నాడన్న నగ్నసత్యాన్ని SIF ఎలుగెత్తి చాటినా కూడా అది అరణ్యరోదనగానే మిగిలిపోయినది. అనేక ప్రభుత్వ సంస్థలకు, కమిటీలకు, కుటుంబ సంక్షేమాన్ని కోరే SIF ఈ సమాజంలో ఎవరి హక్కులైనా విస్మరించబడినట్లయితే, అవి పురుషులవే అని, ఇప్పటికైనా వీటిపై దృష్టి సారించాలని తెలియజేసినది. SIF ఉచిత సహాయ సముదాయాలను, వారాంతపు సమావేశాలను, ఆన్లైన్ ఫోరంలను, బ్లాగులను, హెల్ప్ లైన్ లను, ఇతర ప్రభుత్వేతర సంస్థలను నిర్వహిస్తూ అనేక భారతీయ కుటుంబాలను రక్షిస్తూ ఉంటుంది.